Beauty tips: దీపికా పడుకునే మెరిసే చర్మ రహస్యం ఇదే, మీరు ఇంట్లోనే ఈ జ్యూస్ తయారుచేసుకోవచ్చు-this is deepikas secret to glowing skin you can make this juice at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Tips: దీపికా పడుకునే మెరిసే చర్మ రహస్యం ఇదే, మీరు ఇంట్లోనే ఈ జ్యూస్ తయారుచేసుకోవచ్చు

Beauty tips: దీపికా పడుకునే మెరిసే చర్మ రహస్యం ఇదే, మీరు ఇంట్లోనే ఈ జ్యూస్ తయారుచేసుకోవచ్చు

Haritha Chappa HT Telugu
Aug 20, 2024 07:00 AM IST

Beauty tips: దీపికా పడుకునే చర్మం సహజసిద్ధంగానే మెరుస్తూ ఉంటుంది. అలాంటి మెరిచే చర్మం కోసం ఆమె క్రీములు, షేషియల్స్ పై ఆధారపడదు. ఆరోగ్యమైన ఆహారంపైనే ఆధారపడుతుంది. దీపిక న్యూట్రిషనిస్ట్ అయిన శ్వేతా షా దీపికా రోజూ తాగే జ్యూస్ గురించి చెప్పారు. ఈ జ్యూస్ వల్లే దీపికా చర్మం అంతలా మెరుస్తుందట.

దీపికా పడుకునే ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్
దీపికా పడుకునే ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ (Instagram)

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, సక్సెస్‌ఫుల్ నటీమణుల పేర్లు తీసుకుంటే వారిలో దీపికా పదుకొణె మొదటి స్థానంలో ఉంటుంది. 38 ఏళ్ల వయసులో కూడా ఆమె మెరిసే చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు చూసి అందరూ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ప్రతి అమ్మాయికి అలాంటి మెరిసే చర్మం కావాలని ఉంటుంది. దీపికా పడుకునే ఎలాంటి మేకప్ వేసుకోకపోయినా కూడా చాలా అందంగా ఉంటుంది. ఆమె నో మేకప్ లుక్ చూసిన వారు ఈ విషయాన్ని చెప్పగలుగుతారు. ఆమె మెరిస చర్మం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని మీకూ ఉందా. దీపికా న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ఆ రహస్యాన్ని అందరితో పంచుకుంది. ఖరీదైన క్రీమ్ లేదా ఫేషియల్ వంటివి ఫాలో అవ్వకుండా ఇంట్లోనే చేసుకున్న ఒక జ్యూస్ రోజూ తాగడం ద్వారా దీపికా అందంగా మెరిసిపోతోంది. ఈ మ్యాజికల్ జ్యూస్ రెసిపీ తెలుసుకుంటే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఈ జ్యూస్ తాగి మీ చర్మాన్ని, జుట్టును కూడా మెరిపించుకోవచ్చు.

దీపికా ఏం తింటుంది?

న్యూట్రిషనిస్టు శ్వేతా షా మాట్లాడుతూ దీపికకు పెళ్లి కాకముందే ఆమెతో పరిచయం ఉందని చెప్పింది. ఆ సమయంలో దీపిక తన జుట్టు, చర్మానికి సహజసిద్ధమైన మెరుపు కావాలని అడిగినట్టు తెలిపింది. అందుకోసం ఏంతినాలో, ఏం తాగాలో చెప్పమని అడిగినట్టు వివరించారు. దీపికకు సోంపు నీరు ప్రతిరోజూ తాగాలని, అలాగే నల్ల ద్రాక్షలను ఆహారంలో చేర్చుకోవాలని శ్వేతాషా సూచించారు. అంతేకాకుండా దీపిక మూడు నెలల పాటు ఒక మ్యాజిక్ జ్యూస్ తాగమని కూడా దీపికకు సిఫారసు చేశారు. ఆ జ్యూస్ వల్లే దీపిక చర్మం అంతలా మెరిసిపోతోంది.

మ్యాజిక్ జ్యూస్ రెసపీ

దీపికా పదుకొణె మెరిసే చర్మం, పొడవాటి జుట్టు కోసం ప్రతిరోజూ న్యూట్రిషినస్టు శ్వేతా షా చెప్పిన పద్ధతిలో ఒక జ్యూస్ తయారు చేసుకుని తాగేది. ఈ జ్యూస్ తయారీలో వాడేవన్నీ చాలా తక్కువ ధరకు మార్కెట్లో దొరికేవే. కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర, మూడు నుంచి నాలుగు వేప ఆకులు, కరివేపాకులు, సగం బీట్ రూట్ కలిపి ఈ జ్యూస్ తయారుచేస్తారు. వీటన్నింటినీ బ్లెండర్ లో వేసి బాగా బ్లెండ్ చేయాలి. కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత వడకట్టకుండా ఈ జ్యూస్ అలాగే తాగాలి. దీన్ని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ చర్మం చాలా మెరుపు పొందుతుంది. జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది. వెంట్రుకలు పట్టు కుచ్చుల్లా ఉంటాయి. కేవలం నెల రోజుల పాటూ తాగండి చాలు…. మీకు మార్పు వెంటనే కనిపిస్తుంది.

పైన చెప్పిన జ్యూస్ ప్రతిరోజూ తాగుతూ… ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలతో వండినవి పదార్థాలు ఉండేలా చూసుకోండి. అలాగే ప్రతిరోజూ కప్పు పెరుగును తినండి. ఇలా తింటే సహజంగానే మెరుపు మీ చర్మం లోపల నుంచి వస్తుంది. మేకప్ వేసుకోకపోయినా కూడా మీరు అందంగానే కనిపిస్తారు.