Weight Loss Drinks : ఉదయం ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారు
Morning Weight Loss Drinks : బరువు తగ్గేందుకు ఉదయం పూట డైట్ కూడా చాలా ముఖ్యం. మార్నింగ్ కొన్ని రకాల డ్రింక్స్ తాగితే బరువు తగ్గించుకోవచ్చు.
స్లీమ్‌గా తయారు కావాలని అందరూ కోరుకుంటారు. కానీ దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేయాలి. చాలామంది బరువు పెరగకుండా ఏడాది పొడవునా రకరకాల సన్నాహాలు చేస్తారు. మార్నింగ్ వాకింగ్, జాగింగ్, యోగాలు కూడా చేస్తారు. తింటి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు. కానీ బరువు తగ్గరు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. బరువు పెరగడం లేదా తగ్గడం అనేది శరీరం జీవక్రియ రేటుపై చాలా ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల డ్రింక్స్ తాగితే బరువు తగ్గొచ్చు. అయితే ఉదయంపూట తీసుకోవాలి.
బరువు తగ్గేందుకు అద్భుతంగా పని చేసే కొన్ని పానీయాలు ఉన్నాయి. ఇవి మీ జీవక్రియ రేటును పెంచడం ద్వారా అదనపు బరువును తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు మీరు తాగాల్సిన డ్రింక్స్ ఏంటో చూడండి.
ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ నిమ్మరసం, దాల్చిన చెక్క పొడిని మిక్స్ చేసి తాగాలి. యాపిల్ సైడర్ వెనిగర్ జీవక్రియను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. నిమ్మకాయ శరీరానికి విటమిన్ సిని అందిస్తుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఉదయంపూట ఇది తీసుకుంటే ఫలితం ఉంటుంది.
అల్లం, పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా అల్లం, పసుపును కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మళ్లీ మిక్సీలో నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి, అర టీస్పూన్ తేనె కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. అల్లం, పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ రెండు సహజ పదార్థాలు జీర్ణక్రియను పెంచుతాయి. అలాగే బరువు నియంత్రణలో సహాయపడతాయి.
అలోవెరా, నిమ్మకాయ కూడా మీ బరువు తగ్గేందుకు సాయపడుతుంది. కలబంద ఆకును కట్ చేసి జెల్ తీయండి. అలోవెరా జెల్‌ని మిక్సీలో బాగా రుబ్బాలి. అందులో నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. కలబంద మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరాన్ని టాక్సిన్స్ లేకుండా చేస్తుంది. బరువు తగ్గిస్తుంది. నిమ్మకాయ శరీరానికి విటమిన్ సి అందించి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. బరువు తగ్గేందుకు పైన చెప్పిన డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
అధిక బరువు అనేది చాలా సమస్యలను తీసుకొస్తుంది. ప్రతీ విషయంలోనూ ఇబ్బందలు ఎదుర్కోవలసి వస్తుంది. కొవ్వు ఎక్కువైతే గుండె జబ్బులు అధికమవుతాయి. రోజూ కాస్త వ్యాయామం చేస్తూ.. ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. త్వరలోనే బరవు తగ్గుతారు.