Healthy Snacks : చలికాలంలో ఆరోగ్యానికి ఉపయోగపడే 5 రకాల స్నాక్స్ ఇవే
Healthy Snacks For Winter : చలికాలం వచ్చిందంటే కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మీరు తీసుకునే స్నాక్స్ కూడా మీ ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
శీతాకాలంలో చిరుతిళ్లు దాదాపు రోజూ ఉంటాయి. కాస్త గరం గరం అయ్యేందుకు సాయంత్రంపూట ఏదైనా స్నాక్స్ తింటుంటారు. స్నాక్స్ హానికరం కాదు, ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడేవి కూడా ఉంటాయి. అయితే మనం ఎంచుకునే వాటి మీదే ఇది ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యానికి, చలికాలంలో చలిని నివారించడానికి ఇక్కడ ఐదు రకాల రుచికరమైన స్నాక్స్ ఉన్నాయి.
చలికాలంలో ఐదు రకాల రుచికరమైన స్నాక్స్‌ని ఆహారంలో చేర్చుకోవచ్చు. అవి మిమ్మల్ని చలి నుండి కాపాడతాయి, శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. వాటిని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కమ్మగా ఉంటాయి.
చిక్‌పీస్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉన్నాయి. కావాలంటే ఉప్పు, నిమ్మ, ఉల్లి కలిపి తీసుకోవచ్చు. అయితే చలికాలంలో ఇది తింటే మంచిది. వెచ్చగా కూడా ఉంటుంది. సాయంత్రం పూట వీటిని మీరు ప్రయత్నించొచ్చు.
చిలగడదుంపలు శరీరాన్ని వేడి చేస్తాయి. దీన్ని ఉడకబెట్టి వివిధ రకాలుగా తినవచ్చు. కావాలంటే డీప్ ఫ్రై చేసి, వేయించిన మసాలా దినుసులు వేసుకోవచ్చు. ఇది ఫైబర్‌కు గొప్ప మూలం. చాలా ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఫాస్టింగ్ సమయంలోనూ చిలగడదుంపలను ఎక్కువగా తింటారు. ఆరోగ్యానికి చాలా మంచిది.
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలంటే తేనె కలిపిన టీని తాగండి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో తేనె చాలా సహాయపడుతుంది. మీరు దీన్ని హెర్బల్ టీ, నలుపు, ఎరుపు లేదా గ్రీన్ టీకి జోడించడం ద్వారా తాగవచ్చు. సాయంత్ర చలి వేసే సమయంలో కాస్త ఈ టీ తాగితే వెచ్చగా ఉంటుంది.
వింటర్ సీజన్ కోసం నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు వెచ్చగా ఉండేందుకు సాయపడతాయి. స్వీట్లు తినాలనుకునే వారికి చాలా మేలు చేస్తాయి. నువ్వులు లేదా బాదంపప్పును బెల్లంతో కలపాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నువ్వులు, బాదంపప్పుల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బెల్లం ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మేలు చేస్తుంది.
శీతాకాలంలో బాదంపప్పును సాయంత్రం తినవచ్చు. బాదంపప్పును నీటిలో నానబెట్టవచ్చు. కావాలంటే వేయించుకోవచ్చు. నూనె, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు కలిపి తినవచ్చు. ఇది చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైనది. కావాలంటే రెగ్యులర్‌గా తినవచ్చు. బాదంపప్పు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. చలికాలంలో వెచ్చగా ఉండేందుకు సాయపడుతుంది.
చలికాలం పౌష్టికాహారం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంది పెద్దగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు. దీంతో సమస్యలు ఎదుర్కొంటారు. స్నాక్స్ రూపంలో తీసుకునే ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే సరైన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ లాంటివి తీసుకోకపోవడమే బెటర్. ఇంట్లో తయారు చేసేవి తినాలి.