శీతాకాలం (చలికాలం)లో చిలగడదుంపలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు సహా మరిన్ని లాభాలు ఉంటాయి. అలాగే, వింటర్ సీజన్‍లో చిలగడదుంప తింటే కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూడండి.
Photo: Pixabay
చిలగడదుంపల్లో బీటా కరొటిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Photo: Pixabay
చిలగడదుంపల్లో యాంటీ ఇన్‍ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. దీంతో శీతాకాల సంబంధిత కీళ్ల నొప్పులు, కీళ్లు పట్టుకుపోవడం లాంటి సమస్యలు తగ్గేందుకు ఇది సహకరించగలదు.
Photo: Pixabay
చిలగడదుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఉదర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Photo: Pixabay
చిలగడదుంపల్లో తీపి గుణం ఉన్నా.. గ్లిసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవెళ్లను నియంత్రణలో ఉండేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pixabay
చిలగడదుంపల్లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన శక్తిని త్వరగా ఇస్తాయి. అలాగే, చల్లగా ఉండే శీతాకాలంలో శరీరం యాక్టివ్‍గా, వెచ్చగా ఉండేందుకు కూడా తోడ్పడతాయి.
Photo: Pixabay
చిలగడదుంపల్లో బీటా కరొటిన్ ఉంటుంది. దీంతో కంటి చూపుకు కూడా ఇది మేలు చేస్తుంది.
Photo: Pixabay
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి