Sex Life : మీ లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లు ఇవే.. ఫాలో అయిపోండి..-these healthy tips to follow for better and healthy sexual life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sex Life : మీ లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లు ఇవే.. ఫాలో అయిపోండి..

Sex Life : మీ లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లు ఇవే.. ఫాలో అయిపోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 09, 2022 09:43 AM IST

Sex Life : మీ లైంగిక శ్రేయస్సుపై.. మీ మొత్తం శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? అవుననే అంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన అలవాట్లు లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి అంటున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>సెక్స్ టిప్స్</p>
సెక్స్ టిప్స్

Sexual Wellbeing : మంచి ఆరోగ్యాన్ని కావాలని ఎలా అనుకుంటారో.. లైంగిక శ్రేయస్సు కూడా ముఖ్యమే అని అందరూ తెలుసుకోవాలి. లైంగిక శ్రేయస్సుపై ఆ వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనేది నిజం. కాబట్టి.. మీ లైంగిక పనితీరును మెరుగుపరిచే ఆరోగ్యకరమైన అలవాట్లను.. అలవాటు చేసుకోవడం చాలామంచిది.

శారీరక శ్రమ

మీ లైంగిక పనితీరును మెరుగుపరిచే ప్రధానమైనది శారీరక శ్రమ. శారీరక ఉద్రేకం మంచి రక్త ప్రవాహంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. ఏరోబిక్ వ్యాయామం (ఇది మీ గుండె, రక్త నాళాలను బలపరుస్తుంది) మంచిది. అంతేకాకుండా వ్యాయామాలు గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్‌లను అరికట్టడం నుంచి.. మీ మానసిక స్థితిని మెరుగుపరచడం వరకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీరు రాత్రి మంచి నిద్రను పొందడంలో సహాయం చేసి.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.

ధూమపానం వద్దు..

ధూమపానం చేయవద్దు. ధూమపానం పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధికి దోహదం చేస్తుంది. ఇది పురుషాంగం, క్లిటోరిస్, యోని కణజాలాలకు రక్త ప్రవాహంలో ఆటంకాలు సృష్టిస్తుంది. అదనంగా ధూమపానం చేసే స్త్రీలు.. ధూమపానం చేయని వారి కంటే రెండు సంవత్సరాల ముందుగానే రుతువిరతి పొందుతారు. ధూమపానాన్ని ఆపేయాలనుకుంటే.. మీరు నికోటిన్ గమ్ లేదా ప్యాచ్‌లను ప్రయత్నించండి. లేదా బుప్రోపియన్ (జైబాన్) లేదా వరేనిక్‌లైన్ (చాంటిక్స్) ఔషధాల గురించి మీ వైద్యుడిని అడిగి.. వారు ఓకే చెప్తే ప్రయత్నించండి.

మద్యం అతిగా వద్దు..

మితంగా మద్యం తాగండి. అంగస్తంభన సమస్య ఉన్నవారు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. మద్యపానం కేంద్ర నాడీ వ్యవస్థను మందగించి.. లైంగిక ప్రతిచర్యలను నిరోధిస్తుంది. ఎక్కువ కాలం పాటు పెద్ద మొత్తంలో తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. పురుషులలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఆల్కహాల్ తీసుకునే మహిళల్లో వేడి ఎక్కువై.. నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇది ఇప్పటికే మెనోపాజ్‌లో ఉన్న సమస్యలను పెంచుతుంది.

మంచి ఫుడ్..

కొవ్వు పదార్ధాలను అతిగా తినడం వలన అధిక రక్త కొలెస్ట్రాల్, స్థూలకాయం వస్తాయి. ఈ రెండు ప్రధాన ప్రమాద కారకాలు హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తాయి. అదనంగా.. అధిక బరువు ఉండటం వలన బద్ధకం ఎక్కువ అవుతుంది. శృంగారంలో పేలవమైన ప్రదర్శన చేస్తారు. కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి.

మహిళల కోసం..

మెనోపాజ్‌లో ఈస్ట్రోజెన్ తగ్గినప్పుడు.. యోని గోడలు వాటి ధృడత్వాన్ని కోల్పోతాయి. అప్పుడు మీ శృంగార ప్రక్రియ నెమ్మదించవచ్చు. ఆ సమయంలో సంభోగం మీ వల్ల కాకపోతే.. హస్తప్రయోగం ట్రై చేయవచ్చు. ఇది ప్రభావవంతంగా ఉంటుంది. లేదంటే.. వైబ్రేటర్ లేదా డిల్డోను ఉపయోగించినా.. పర్లేదు అంటున్నారు నిపుణులు.

పురుషులు దీని గురించి తెలుసుకోవాల్సిందే..

పురుషులు అంగస్తంభన లేకుండా ఎక్కువ కాలం ఉండటం వలన మంచి లైంగిక పనితీరును ప్రదర్శిస్తారు. అయితే ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తంలో.. కొంత భాగాన్ని పురుషాంగం కోల్పోతుంది. రక్త ప్రవాహం పెరిగినప్పుడు పురుషాంగం విస్తరించే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం