Improve Sex Drive: లైంగిక శక్తిని పెంచుకోవడానికి.. ఆ రెండూ తినాలంటా.. -cherries and apricots are really improve your sex drive ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Improve Sex Drive: లైంగిక శక్తిని పెంచుకోవడానికి.. ఆ రెండూ తినాలంటా..

Improve Sex Drive: లైంగిక శక్తిని పెంచుకోవడానికి.. ఆ రెండూ తినాలంటా..

HT Telugu Desk HT Telugu
Jun 03, 2022 01:17 PM IST

చెడు ఆహారపు అలవాట్లు, చురుకైన జీవనశైలి కారణంగా కొన్నిసార్లు చాలా మందిలో లైంగికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా సార్లు పని ఒత్తిడి ఫలితంగా.. చాలా మంది జీవితంలో లైంగిక కార్యకలాపాలను ఆస్వాదించలేరు. లైంగిక శక్తిని మెరుగుపరచుకుని.. దాని ఆనందం పొందడానికి నిపుణులు రెండు ప్రత్యేక పండ్లను సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సెక్స్ డ్రైవ్
సెక్స్ డ్రైవ్

Cherry and Apricot Benefits | చెర్రీస్, ఆప్రికాట్లు విడివిడిగా సెక్స్ డ్రైవ్‌ను పెంచడంలో సహాయపడతాయని అంటున్నారు నిపుణులు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. మీ సెక్స్​ డ్రైవ్​ను మెరుగుపరచుకోవాలనుకునే వారు ఈ రెండు పండ్లను తీసుకోవాలి అంటున్నారు.

ఆప్రికాట్లు, చెర్రీ పండ్లను తింటే శృంగార కోరికలు మరింత పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు పండ్లు లైంగిక ఆరోగ్యం, శక్తిని కాపాడుకోవడానికి చాలా ముఖ్యమైనవని పేర్కొంటున్నారు. యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉన్న చెర్రీస్, ఆప్రికాట్లు సెక్స్ డ్రైవ్‌ను పెంచడంలో సహాయపడతాయని వెల్లడించారు. చెర్రీస్‌లో వివిధ శోథ నిరోధక పదార్థాలు కూడా ఉన్నాయి. ఇవి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒత్తిడి మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే.. ఈ రెండు పండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

మీ సంభోగం సమయంలో లైంగిక ప్రేరేపణ కలిగి ఉంటే.. ఇద్దరు భాగస్వాములకు సత్తువ లేకుంటే.. చెర్రీ మీకు బాగా పనిచేస్తుంది. చెర్రీస్ మీ శృంగార ప్రదర్శనలో గొప్పగా పని చేస్తుంది. నేరేడు పండు శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఆప్రికాట్లు, చెర్రీస్ రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ నుంచి స్పెర్మ్‌ను రక్షిస్తాయి. చెర్రీస్ మహిళల ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటాయి. చెర్రీస్ పిండం అభివృద్ధిలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి అంటున్నారు నిపుణులు.

మీరు ఆప్రికాట్లు, చెర్రీస్ తినాలనుకుంటే.. వీటిని మీరు అల్పాహారంగా తినవచ్చు. ప్రతి రోజు నట్స్​తో కలిపి చెర్రీస్ తీసుకోవచ్చు. ఈ రెండు పండ్ల జామ్‌లు, సల్సాలు మార్కెట్‌లో లభిస్తాయి. అయితే బజారులో కొనుక్కున్న వస్తువులు తినకుండా ఆ పండ్లను తింటేనే ఫలితం ఉంటుంది. పగటిపూట భోజనానికి ముందు ఆప్రికాట్లు, చెర్రీలను కూడా తినవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్