Exercises Tips : బరువు తగ్గాలి అంటే ఏరోబిక్ మంచిదా? యోగా బెటరా?
Aerobics vs Yoga : మీ రెగ్యులర్ వ్యాయామం మానసిక ఒత్తిడి అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా.. శరీరం నుంచి శక్తిని విడుదల చేస్తుంది. మీరు ఫిట్‌గా ఉండేలా చేసి.. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా నివారిస్తుంది. అయితే కొందరికి ఏ రకమైన వ్యాయామాలు చేయాలో తెలియదు. అయితే ఎవరు ఎలాంటి వ్యాయామం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Aerobics vs Yoga : మీరు బలంగా, ఫిట్‌గా మారేందుకు సహాయపడే అనేక రకాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడిప్పుడే వ్యాయామం ప్రారంభించాలి అనుకుంటే ఏ రకమైన వ్యాయామాన్ని ఎంచుకోవాలి అనేదానిపై స్పష్టత ఉండదు. యోగా వంటి సంపూర్ణ విధానాన్ని ఎంచుకోవడం లేదా శక్తివంతమైన ఏరోబిక్ వ్యాయామాలు చేయాలా అనేదానిపై కన్ఫ్యూజన్ ఉంటే.. ఇది మీకోసమే. వాటి మధ్య తేడాలు, ఫలితాలు గురించి తెలుసుకుని.. మీకు ఏది అవసరమో తెలుసుకుని మీరే ఓ నిర్థారణకు రండి.
ఏరోబిక్ వ్యాయామాలు అంటే ఏమిటి?
ఏరోబిక్ లేదా కార్డియోవాస్కులర్ వ్యాయామాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో నడక, ఈత, సైక్లింగ్ వంటి మొదలైన వ్యాయామాలు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి. రెగ్యులర్ ఏరోబిక్ వ్యాయామం గుండె సమస్యలు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. వీటిలో బాడీని స్ట్రెచ్ చేయడం, శక్తి శిక్షణ కార్యక్రమాలతో పాటు.. రిథమిక్ ఏరోబిక్ కూడా ఉంటుంది.
యోగా అంటే ఏమిటి?
ఇది పురాతనం నుంచి అందుబాటులో ఉన్న వ్యాయామం. యోగా మనస్సు, శరీరం, ఆత్మను బలపరుస్తుంది. ఆసనాలు (శారీరక భంగిమలు), ప్రాణాయామం (శ్వాస వ్యాయామాలు), ధ్యానం వంటి వివిధ రకాల యోగాలు దీనిలో ఉంటాయి. యోగా వ్యాయామాలు బలాన్ని పెంచుతాయి. మీ శరీరాన్ని టోన్ చేస్తాయి. ఇది జీవనశైలినే మార్చేస్తుంది. ఈ వ్యాయామ వ్యవస్థ శ్వాస నియంత్రణను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మీరు విశ్వంతో ఏకం కావడానికి అధిక స్పృహను ఇస్తుంది.
బరువు తగ్గడానికి ఏది మంచిది?
ఏరోబిక్స్ వ్యాయామం చేసే సమయంలో అధిక కేలరీలను బర్నింగ్ చేస్తుంది. అయితే యోగా కోర్ కండరాల బలాన్ని పెంచుతుంది. పైగా యోగా ఆత్మపై లోతైన ప్రభావాలను చూపుతుంది. ఆధ్యాత్మిక వృద్ధికి దారితీస్తుంది. హాట్ యోగా వంటి కొన్ని రకాల యోగాలు బరువును తగ్గించడానికి సహాయం చేస్తాయి. అయితే బరువు తగ్గడమే మీ ప్రాథమిక లక్ష్యం అయితే.. ఏరోబిక్స్ ఉత్తమ ఎంపిక.
ఆరోగ్యానికి ఏది మంచిది?
ఏరోబిక్ వ్యాయామాలు, యోగా రెండూ మొత్తం ఆరోగ్యానికి గొప్పవి. ఇవి జీవక్రియను, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయినప్పటికీ.. ఏరోబిక్ వ్యాయామాలు.. యోగా ఇచ్చే సాధారణ అభ్యాసం, చేయగల బలాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే యోగా శారీరక స్థితిని మెరుగుపరచడమే కాకుండా.. మన మనసుకు అద్భుతాలు చేస్తుంది. రెగ్యులర్ ధ్యానం దృష్టిని పెంచుతుంది. స్వభావాన్ని మెరుగుపరుస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది.
కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు
మీరు యోగా సాధన చేసినా లేదా ఏరోబిక్ వ్యాయామంతో రెగ్యులర్‌గా ఉన్నా.. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడం, శక్తి శిక్షణ రెండింటికీ ఆహారం అవసరం. మీ శరీరాన్ని లోపలి నుంచి శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. అందుకే మీ డైట్లో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు ఎక్కువ లేదా చాలా తక్కువ ఆహారం తీసుకుంటే.. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఏ వ్యాయామం చేసినా.. తగినంత ఆహారం తీసుకోవాలి.
సంబంధిత కథనం