Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి-there are two flush buttons in the toilet know the behind story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Anand Sai HT Telugu
May 17, 2024 02:00 PM IST

Two Flush Buttons Reasons : ఇప్పుడంతా వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్. పని అయిపోయాక నేరుగా బట్ నొక్కితే నీరు అందులోకి వెళ్లిపోతుంది. కానీ ఎప్పుడైనా మీరు ఫ్లష్ నొక్కేటప్పుడు రెండు బటన్లు ఉన్నాయని గమనించారా?

రెండు ఫ్లష్ బటన్లకు కారణాలు
రెండు ఫ్లష్ బటన్లకు కారణాలు

టాయిలెట్ లోపల కమోడ్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉన్నాయని మీరు గమనించారా? అవును మీరు జాగ్రత్తగా చూస్తే కమోడ్‌పై రెండు బటన్లు ఉంటాయి. ఒకటి పెద్ద బటన్, మరొకటి చిన్న బటన్. అయితే ఈ రెండు బటన్లు ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? పెద్దదాని పక్కన చిన్న బటన్‌ను ఎందుకు ఉంటుంది? కమోడ్‌లోని బటన్ గురించి చాలా మందికి తెలియదు. కానీ అందులో నీరు రాకుంటేనే ఆందోళన చెందుతాం. రెండు నొక్కుతాం. ఇలా రెండు బటన్లు పెట్టడం వెనక ఓ పెద్ద కథే ఉంది.

కొన్నాళ్ల క్రితం నీటి వినియోగంపై అవగాహన ఉన్న పెద్దలు ఈ బటన్‌ను పెట్టాలని నిర్ణయించుకోవడం మీకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రెండు బటన్లను ఉంచడానికి కారణం అదే. ఇది మొదట ఎక్కడ ప్రారంభించబడిందనే ఆశ్చర్యకరమైన సమాచారాన్ని తెలుసుకుందాం.

నీటి నష్టాన్ని నివారించడానికి రెండు బటన్లు పెట్టారు. ఎందుకంటే ఒక్కసారి ఈ బటన్ నొక్కితే లీటర్ల కొద్దీ నీరు బయటకు పోయింది. ఒకే బటన్ ఉంటే ఎక్కువగా నీరు పోతుంది. అయితే అన్ని వేళలా ఇంత నీరు అవసరం ఉండదు. ఒక్కసారి ఈ బటన్ నొక్కితే నీరంతా వెళ్లిపోతుంది. దీన్ని నివారించడానికి మొదట రెండు బటన్లతో కూడిన కమోడ్‌ను కనుగొన్నారు. 1980లో ఆస్ట్రేలియాలోని కరోమా ఇండస్ట్రీస్‌లోని ఇంజనీర్లు నీటి వృథాను నివారించడానికి ఈ రెండు-బటన్ ఫ్లష్‌ను మొదటిసారి ఉపయోగించారు. మొదట ఈ పెద్ద బటన్‌ను ఫ్లష్ చేసినప్పుడు, 10 లీటర్ల కంటే ఎక్కువ నీరు బయటకు వెళ్లేది. కానీ చిన్న బటన్ ద్వారా 3 నుండి 4.5 లీటర్ల నీటిని బయటకు పంపుతుంది.

ప్రఖ్యాత అమెరికన్ ఇండస్ట్రియల్ డిజైనర్ విక్టర్ పాపనేక్ 1976లో తన పుస్తకం 'డిజైన్ ఫర్ ది రియల్ వరల్డ్'లో డ్యూయల్-ఫ్లష్ టాయిలెట్ గురించి మొదట ప్రస్తావించాడు. కానీ అమలు చేయడంలో ఇబ్బంది ఏర్పడింది. మొదట్లో తీవ్ర నీటి కరువు వచ్చినప్పుడు ఈ మరుగుదొడ్లు అత్యంత భారంగా ఉండేవి. మరుగుదొడ్డి వినియోగిస్తూ ఎక్కువ నీరు వృథాగా పోతోందని ఫిర్యాదులు వచ్చాయి.

ఈ సమస్యను తొలగించడానికి చిన్న, పెద్ద బటన్లతో కమోడ్లను రూపొందించాలని నిర్ణయించారు. ఇలా పెద్ద బటన్ నుంచి 10 లీటర్ల నీరు బయటకు పోతే చిన్న బటన్ నొక్కితే 4 నుంచి 5 లీటర్ల నీరు వచ్చేలా చేశారు. ఈ విధంగా రెండు బటన్ ఫ్లష్ ఉపయోగించడం ద్వారా ఒక వ్యక్తి ఏడాదికి దాదాపు 20 వేల లీటర్ల నీటిని ఆదా చేస్తున్నట్టు తెలిసింది. ఇది పర్యావరణ అనుకూలమైనది అని తెలిసిన తర్వాత, ఇది ప్రతిచోటా విస్తృతంగా ఉపయోగించబడింది. నేటికీ మీరు లగ్జరీ హోటళ్లు, పార్టీ హాల్స్ మొదలైన వాటిలో డబుల్ ఫ్లష్ బటన్‌తో టాయిలెట్‌లను చూడవచ్చు.

ఈ రోజుల్లో మీరు కమోడ్‌లో ఎంత నీరు పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించడానికి బటన్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఇళ్లలోకి కూడా ఇలాంటి కమోడ్స్ వచ్చేశాయి. నీటిని ఆదా చేయడమే రెండు బటన్ల ఉదేశం అని మీకు అర్థమైంది కదా. మీరు కూడా నీటిని వృథా చేయకండి.

Whats_app_banner