Solala Biryani: తెలంగాణ స్పెషల్.. సోలాల బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా?-telangana special solala biryanai kandhi kaya biryani ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Telangana Special Solala Biryanai Kandhi Kaya Biryani

Solala Biryani: తెలంగాణ స్పెషల్.. సోలాల బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా?

Koutik Pranaya Sree HT Telugu
Nov 14, 2023 12:00 PM IST

Solala Biryani: తెలంగాణ స్పెషల్ సోలాలు లేదా కందికాయ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా. తయారీ చాలా సులభం. దాన్నెలా చేయాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.

సోలాల బిర్యానీ
సోలాల బిర్యానీ

ఈ సీజన్‌లో పచ్చి కందికాయ మార్కెట్లో చాలా దొరుకుతుంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ పచ్చికందికాయ గింజలతో చేసే బిర్యానీ చాలా ఫేమస్. దీన్నే సోలాల బిర్యానీ అని కూడా అంటారు. ఈ బిర్యానీని రుచిగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

కావాల్సిన పదార్థాలు:

పావు కేజీ సోలాలు లేదా పచ్చి కంది గింజలు

1 క్యారట్ (ఆప్షనల్)

1 కప్పు బియ్యం

2 చెంచాల నెయ్యి

1 చెంచా నూనె

అర అంగుళం దాల్చిన చెక్క

2 లవంగాలు

1 యాలకులు

1 బిర్యానీ ఆకు

పావు చెంచా ఆవాలు

పావు చెంచా షాజీరా

2 పచ్చిమిర్చి చీలికలు

1 ఉల్లిపాయ, పొడవుగా ముక్కలు కోసుకోవాలి

అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

పావు చెంచా పసుపు

రుచికి సరిపడా ఉప్పు

కొద్దిగా కొత్తిమీర

తయారీ విధానం:

  1. ముందుగా వెడల్పాటి పాత్ర ఒకటి పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో నెయ్యి, నూనె వేసుకోవాలి. నెయ్యి వద్దనుకుంటే పూర్తిగా నూనె వాడుకోవచ్చు.
  2. నూనె వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడాక బిర్యానీ ఆకు, షాజీరా, పచ్చిమిర్చి చీలికలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని వేగనివ్వాలి.
  3. ఒక నిమిషం ఆగి పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని వేగనివ్వాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేగనివ్వాలి.
  4. ఇప్పుడు క్యారట్ ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యేవరకు మూత పెట్టుకోవాలి. ఈ క్యారట్ వేసుకోవడం అనేది ఆప్షనల్. మీకిష్టం లేకపోతే వేసుకోకండి.
  5. ఇప్పుడు కంది గింజలు వేసుకుని మూత పెట్టుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటూ మగ్గనివ్వాలి.
  6. అందులో కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసుకుని మరుగు పట్టనివ్వాలి. నీళ్లు బాగా మరిగాక బియ్యం, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి.
  7. అయిదు నిమిషాల్లో వేడి వేడి సోలాల బిర్యానీ రెడీ అయిపోతుంది.

WhatsApp channel