Carrot Methi Curry: హరియాణా స్పెషల్ క్యారట్ మేతీ కర్రీ.. 10 నిమిషాల్లో రెడీ..-know how to cook hariyana special carrot methi curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Methi Curry: హరియాణా స్పెషల్ క్యారట్ మేతీ కర్రీ.. 10 నిమిషాల్లో రెడీ..

Carrot Methi Curry: హరియాణా స్పెషల్ క్యారట్ మేతీ కర్రీ.. 10 నిమిషాల్లో రెడీ..

Koutik Pranaya Sree HT Telugu
Oct 25, 2023 12:27 PM IST

Carrot Methi Curry: హరియాణా స్పెషల్ వంటకం క్యారట్ లేదా గాజర్ మేతీ కర్రీ తయారీ చాలా సులువు. దాన్నెలా తయారు చేయాలో పక్కా కొలతలతో చూసేయండి.

క్యారట్ మేతీ కర్రీ
క్యారట్ మేతీ కర్రీ (instagram)

ఎప్పుడూ మనం చేసుకునే కూరలే కాకుండా కాస్త కొత్తగా ప్రయత్నిస్తే నోటికి కొత్తరుచి తగులుతుంది. అలాగనీ బిర్యానీలు, కష్టంగా ఉండే స్వీట్లే చేసుకో అక్కర్లేదు. రోజూవారీ చేసుకునే కూరల్లో కూడా కాస్త సింపుల్ గా ఉండే వాటిని ప్రయత్నించొచ్చు. ఒకసారి ఈ హరియాణా రాష్ట్ర స్పెషల్ క్యారట్ మేతీ లేదా గాజర్ మేతీ కర్రీ ప్రయత్నించండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అన్నంతో, చపాతీతో ఎలా తిన్నా బాగుంటుంది.

కావాల్సిన పదార్థాలు:

పావు కేజీ క్యారట్, సన్నటి ముక్కలు

1 కట్ట మెంతికూర

2 చెంచాల వంటనూనె

1 ఉల్లిపాయ, తరుగు

అరచెంచా పచ్చిమిర్చి, అల్లం ముద్ద

4 వెల్లుల్లి రెబ్బల తరుగు

సగం చెంచా పసుపు

తగినంత ఉప్పు

అరచెంచా జీలకర్ర పొడి

అరచెంచా ధనియాల పొడి

చెంచా నిమ్మరసం

తయారీ విధానం:

  1. కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త వేగాక అందులోనే పచ్చిమిర్చి అల్లం ముద్ద, వెల్లుల్లి కూడా వేసుకుని వేగనివ్వాలి.
  2. ఇప్పుడు పచ్చివాసన పోయాక మెంతి కూర సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా కలియబెడుతూ ఉండాలి.
  3. ఇప్పుడు క్యారట్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి.
  4. ముక్కలు కాస్త మెత్తబడ్డాక పసుపు, ఉప్పు వేసుకుని సన్నం మంట మీద ముక్కల్ని మరికాసేపు మగ్గనివ్వాలి.
  5. కూర ఉడికిపోయాక జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మరసం వేసుకుని ఒకసారి కలిపి. రెండు నిమిషాలయ్యాక దింపేసుకుంటే చాలు. వేడివేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది.

Whats_app_banner