carrot roti: క్యారట్, కొత్తిమీర చపాతీ.. సులువుగా చేయండిలా..
carrot roti: క్యారట్, కొత్తిమీరతో చపాతీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం.
carrot coriander roti (pexels)
ఉదయాన్నే చపాతీలు తినే అలవాటుండి, కాస్త భిన్నంగా ప్రయత్నిద్దాం అనుకుంటే ఈ కొత్తిమీర, క్యారట్ చపాతీలు చేసుకుని చూడండి. చపాతీ చేసే సమయంలోనే మంచి అల్పాహారం సిద్ధమవుతుంది.
కావాల్సిన పదార్థాలు:
క్యారట్ తురుము - సగం కప్పు
కొత్తిమీర తరుగు - సగం కప్పు
బియ్యం పిండి - సగం కప్పు
గోదుమ పిండి - సగం కప్పు
పచ్చిమిర్చి ముద్ద -1 టేబుల్ స్పూన్
పసుపు - సగం టీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 4 చెంచాలు
తయారీ విధానం:
step 1: నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి.
step 2: కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి.
step 3: పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి
step 4: చపాతీలు చేసుకుని పెనం మీద వేసుకుని కాల్చుకుంటే చాలు. క్యారట్, కొత్తిమీర చపాతీ సిద్ధం.