Hair fall: జుట్టురాలిపోవడం ఆపి కొత్త వెంట్రుకలు పెరగాలంటే వీటిని ప్రతిరోజూ తినడం ప్రారంభించండి-start eating chia seeds daily to stop hair loss and grow new hair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Fall: జుట్టురాలిపోవడం ఆపి కొత్త వెంట్రుకలు పెరగాలంటే వీటిని ప్రతిరోజూ తినడం ప్రారంభించండి

Hair fall: జుట్టురాలిపోవడం ఆపి కొత్త వెంట్రుకలు పెరగాలంటే వీటిని ప్రతిరోజూ తినడం ప్రారంభించండి

Haritha Chappa HT Telugu
Nov 20, 2024 02:00 PM IST

Hair fall: ప్రతిరోజూ చియా సీడ్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు చియా సీడ్స్ ను తినడం వల్ల జుట్టు ఏపుగా ఎదగడం మొదలవుతుంది. దీన్ని మీ రోజువారీ ఆహారంలో ఎలా చేర్చవచ్చో తెలుసుకోండి.

హెయిర్ ఫాల్ తగ్గించే ఆహారం
హెయిర్ ఫాల్ తగ్గించే ఆహారం (Pixabay)

జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలకు జుట్టు రాలిపోవడం వల్ల ఆత్మన్యూనత భావం పెరిగిపోతోంది. జుట్టు ఊడిపోకుండా కొత్త వెంట్రుకలు పెరగాలంటే రోజూ వారీ ఆహారంలో కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాంటి సూపర్ పుడ్స్ లో చియా సీడ్స్ ఒకటి.

డాక్టర్ కృతికా మోహన్, తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక డ్రింక్ తాగుతున్న వీడియోను షేర్ చేశారు. ఇది ఆమె జుట్టు పెరగడానికి ఎంతో సహాయపడినట్టు ఆమె తెలిపింది. ఆమె ఇన్ స్టాలో ‘నా దినచర్యలో చియా విత్తనాలు భాగం చేసుకున్నాను. అవి నా జుట్టు రాలడాన్ని తగ్గించి, పెరుగుదలను పెంచేందుకు సహాయపడ్డాయి" అని చెప్పింది.

చియా విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి నెత్తిమీద ఇన్ ఫ్లమ్మేషన్‌ను పరిష్కరించడంలో సహాయపడతాయని, జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుందని డాక్టర్ కృతిక వివరించారు. చియా విత్తనాలను తీసుకోవడానికి ఉత్తమ సమయం ఉదయం పూట. వాటిని స్మూతీ, పెరుగు, వోట్మీల్ లేదా సాదా నీటిలో కలుపుకుని తాగితే ఎంతో మంచిది. చియా విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున ఈ చియా విత్తనాల డ్రింక్ తాగాలి.

చియా విత్తనాలు సహాయపడతాయా?

చియా విత్తనాలు నిజంగా జుట్టుకు సహాయపడతాయా? అంటే వైద్యులు కచ్చితంగా సహాయపడతాయని చెబుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవాలనుకునే వారు చియా విత్తనాలను ఆహారంలో చేర్చుకోవాలి. వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, జింక్, ఇనుము వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటాయి. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు.

చియా సీడ్స్ ఉపయోగాలు
చియా సీడ్స్ ఉపయోగాలు (Unsplash)

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: చియా సీడ్స్ ను తినడం వల్ల నెత్తి మీద ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గుతుంది. తేమవంతంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన మాడును అందిస్తుంది.

ప్రోటీన్: చియా సీడ్స్ లో ఉండే ప్రోటీన్ జుట్టు వెంట్రుకలను బలోపేతం చేస్తుంది. జుట్టు విచ్ఛిన్నతను నివారిస్తుంది.

జింక్: చియా సీడ్స్ లో ఉండే జింక్ దెబ్బతిన్న హెయిర్ ఫోలికల్స్ రిపేర్ చేస్తుంది. ఆరోగ్యకరమైన నూనె ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఐరన్: ఈ విత్తానల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నెత్తి మీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టు మూలాలకు పోషకాలను అందిస్తుంది.

చియా విత్తనాలను రోజువారీ ఆహారంలో ఎలా చేర్చాలి?

మీ ఆహారంలో చియా విత్తనాలను జోడించడం చాలా సులభం. వాటిని స్మూతీలలో కలపండి, పెరుగుపై చల్లండి. పోషకమైన చియా పుడ్డింగ్ తయారు చేసుకోవచ్చు. రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిలో సహా వాటిని తాగేయాలి. క్రమం తప్పకుండా చియా సీడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, మొత్తం జుట్టు ఆకృతి, కాంతిని మెరుగుపరుస్తుంది.

Whats_app_banner