Diabetes: అలాంటి ఆహారాల్లో ఉండే హేమ్ ఐరన్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచేస్తుంది, జాగ్రత్తగా తినండి-heme iron in such foods can increase the risk of diabetes so eat with caution ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: అలాంటి ఆహారాల్లో ఉండే హేమ్ ఐరన్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచేస్తుంది, జాగ్రత్తగా తినండి

Diabetes: అలాంటి ఆహారాల్లో ఉండే హేమ్ ఐరన్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచేస్తుంది, జాగ్రత్తగా తినండి

Haritha Chappa HT Telugu
Aug 16, 2024 08:00 AM IST

Diabetes: డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కొత్త అధ్యయనం ప్రకారం రెడ్ మీట్‌లో ఉండే హేమ్ ఐరన్ డయాబెటిస్ ప్రమాదాన్ని 26 శాతం పెంచుతున్నట్టు చెబుతోంది. కాబట్టి మాంసాహారం తినేవారు జాగ్రత్తగా ఉండాలి.

డయాబెటిస్ పెంచే ఆహారం
డయాబెటిస్ పెంచే ఆహారం (Pixabay)

Diabetes: ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారికే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 30 ఏళ్ల వయసులో కూడా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి డయాబెటిస్ రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటిస్ అంతు తేల్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. నేచర్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం మాంసంలో లభించే హేమ్ ఐరన్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని 26 శాతం పెంచుతుందని చెబుతోంది. మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే నాన్ -హేమ్ ఐరన్ డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచదని ఈ పరిశోధన తెలిపింది.

రెడ్ మీట్ వద్దు

డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మాంసాహారాన్ని ముఖ్యంగా రెడ్ మీట్‌ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మొక్కల ఆహారాలను ఎక్కువగా తినాలి. ఇది డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది.

ఇలా అధ్యయనం

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 36 ఏళ్ల పాటు రెండు లక్షల మందికి చెందిన ఆహార, ఆరోగ్య డేటాను సేకరించారు. వారిలో 80 శాతం మంది మహిళలు ఉన్నారు. వారి ఆరోగ్య, ఆహార డేటాను పరిశీలించాక ఎవరైతే మాంసాహారం... అందులోనూ రెడ్ మీట్‌ను అధికంగా తిన్నారో వారు టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారు. ఇలా వారు డయాబెటిస్ బారిన పడడానికి కారణం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నించారు పరిశోధకులు. అందులో ఈ మాంసాహారాల్లో ఉండే హేమ్ ఐరన్ అధికంగా శరీరంలో చేరడం వల్లే షుగర్ వ్యాధి వచ్చినట్టు కనుగొన్నారు.

ఎవరైతే పూర్తి శాకాహారులుగా ఉన్నారో వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వారిలో చాలా తక్కువ మందే డయాబెటిస్ బారిన పడినట్టు చెబుతున్నారు పరిశోధకులు. దీనికి కారణం మొక్కల ఆధారిత ఆహారంలో హేమ్ ఐరన్ ఉండదు.

కాబట్టి డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనుకుంటే మీ ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రెడ్ మీట్ పూర్తిగా మానేయాలి. జంతు ఆధారిత ఆహారాలను తగ్గించుకోవాలి. వాటికి బదులుగా మొక్కల ఆధారిత ఆహారాలను అధికంగా తినాలి. పండ్లు, కూరగాయలు,

ఇప్పటికే డయాబెటిస్ తో బాధపడుతున్న రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. మధుమేహం ఉన్నవారు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం, ఫైవర్ రిచ్ ఫుడ్స్, మంచి కొవ్వులు ఉన్న ఆహారాన్ని అధికంగా తినాలి. బ్రౌన్ రైస్, బీన్స్, పండ్లు, తృణధాన్యాలు వంటివి అధికంగా తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. తృణధాన్యాలు, ఆకుకూరలు వంటివి అధికంగా తింటే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.

టాపిక్