Belly Fat: ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందన్న న్యూట్రిషనిస్ట్.. ఇది పని చేస్తుందా?-amla turmeric drink for melt belly fat nutritionist recommended but it really work ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Belly Fat: ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందన్న న్యూట్రిషనిస్ట్.. ఇది పని చేస్తుందా?

Belly Fat: ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందన్న న్యూట్రిషనిస్ట్.. ఇది పని చేస్తుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 10, 2024 12:30 PM IST

Belly Fat: బెల్లీ ఫ్యాట్ కరిగేందుకు ఉసిరి, నారింజతో చేసిన ఓ డ్రింక్స్ ఉపయోగపడుతుందని ఓ న్యూట్రిషనిస్ట్ వీడియో పోస్ట్ చేశారు. ఇది బాగానే వైరల్ అవుతోంది. అయితే, ఇది బెల్లీ ఫ్యాట్‍పై నిజంగానే ప్రభావం చూపిస్తుందా లేదా అని ఓ డైటిషన్ క్లారిటీ ఇచ్చారు.

Belly Fat: ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందన్న న్యూట్రిషనిస్ట్.. ఇది పని చేస్తుందా?
Belly Fat: ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందన్న న్యూట్రిషనిస్ట్.. ఇది పని చేస్తుందా?

వెయిట్ లాస్ అంశం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‍గానే ఉంటుంది. బరువు తగ్గేందుకు ఏం తినాలో, ఏ డ్రింక్స్ తాగాలో చాలా మంది షేర్ చేస్తుంటారు. వారి సొంత ప్రయోజనాలు, అనుభవాలను కూాడా పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నేహా పరిహార్ అనే ఓ న్యూట్రిషనిస్ట్ తాజాగా ఓ డ్రింక్ గురించి వెల్లడించారు. ఇది తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు (బెల్లీ ఫ్యాట్) కరిగిపోతుందని వివరించారు.

డ్రింక్ తయారు చేశారిలా..

ఉసిరికాయ ముక్కలు, నారింజ, మిరియాల పొడి, పసుపు, అల్లం అన్ని కలిపి ఓ మిక్సర్‌లో బ్లెండ్ చేశారు నేహా. దాన్ని గ్లాసుల్లో వడగట్టారు. చివర్లో దాంట్లో నిమ్మకాయ రసం పిండారు. ఈ డ్రింక్‍ను ఆమె తాగడం కూడా వీడియోలో ఉంది.

ఉసిరి, నారింజతో చేసిన ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందని ఆ వీడియోలో నేహా రాసుకొచ్చారు. తన పొట్ట కరిగిందనేలా చూపించారు. తాను బరువు తగ్గానని కూడా చూపించారు.

బెల్లీ ఫ్యాట్‍ను ఈ డ్రింక్ తగ్గించగలదా?

మణిపాల్ హాస్పిటల్ న్యూటిషన్, డైటెటిక్స్ కన్సల్టెంట్ డైటిషియన్ వైశాలీ వర్మ ఈ డ్రింక్ గురించి హె‍చ్‍టీ లైఫ్‍స్టైల్‍తో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ డ్రింక్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరగదని క్లారిటీ ఇచ్చారు. ఈ డ్రింక్ వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. బెల్లీ ఫ్యాట్‍పై మాత్రం ప్రభావం చూపించలేదని తెలిపారు.

అన్ని కలిపి బ్లెండ్ చేయడం వల్ల ఈ డ్రింక్‍లో ఫైబర్ ఉండదని వైశాలీ వర్మ తెలిపారు. “ఈ డ్రింక్ బెల్లీ ఫ్యాట్‍ను కరిగించలేదు. అన్ని పదార్థాలను కలిపి బ్లెండ్ చేయడం మనం చూశాం. దీనివల్ల వాటిల్లోని ఫైబర్ ఉండదు. వాటిల్లోని ఫైబర్ సహా చాలా పోషకాలు వెళ్లిపోయాయి. కడుపు నిండినట్టుగా మనం తృప్తిగా ఫీలయ్యేందుకు, జీర్ణక్రియకు ఫైబర్ చాలా ఉపయోగపడుతుంది. తరచూ తినడాన్ని తగ్గించగలదు. ఈ డ్రింక్‍లో కేవలం వాటర్‌లో కలవగలిగే విటమిన్లే ఉంటాయి” అని వైశాలీ తెలిపారు.

ఈ డ్రింక్ వల్ల లాభాలు ఇవే

ఈ ఉసిరి, నారింజ జ్యూస్ బెల్లీ ఫ్యాట్‍ను కరిగించలేకపోయినా.. ఆరోగ్యానికి ప్రయోజనాలు చేస్తుంది. నారింజ, ఉసిరిలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. చర్మం, జుట్టుకు కూడా ఇవి మేలు చేస్తాయి. శరీరం ఐరన్‍ను శోషించుకోవడాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పసుపులోని యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణం కూడా ఆరోగ్యానికి మంచిది. కుడుపు ఆరోగ్యానికి అల్లం మేలు చేస్తుంది. ఇలా ఈ డ్రింక్ కొవ్వు కరిగించలేకపోయినా.. ఈ లాభాలను చేకూరుస్తుంది.

Whats_app_banner