Sri Rama Navami 2023: ప్రతి పండగకు ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే, ఆ పండగ కోసం చేసుకునే కొన్ని సాంప్రదాయ వంటకాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని దైవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు, అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈరోజు శ్రీరామ నవమి , ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన పండగ. శ్రీరామ నవమి రోజున దేవుడికి నైవైద్యంగా 'పానకం' తయారు చేస్తారు. ఈ పానకం అనేది చలువ గుణాలు కలిగిన ఒక పానీయం.
సాధారణంగా శ్రీరామ నవమి ఎండాకాలంలో వస్తుంది. ఈ సమయంలో చలువ గుణాలు ఉండే ఈ పానకం (Summer Refreshing Drink)తాగడం ద్వారా వేసవి వేడి నుంచి బయటపడవచ్చు. పానకంను నిమ్మరసం, అల్లం, బెల్లం, ఏలకులు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి చేస్తారు. దీంతో ఇది రుచిగా ఉండటమే కాకుండా, ఎంతో ఆరోగ్యకరమైన పానీయం కూడా. ఈ పానకం తాగడం ద్వారా అమ్మవారు పోయడం లేదా చికెన్ పాక్స్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. పానకం మీకు మీరుగా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు, పానకం రెసిపీని ఈ కింద చూడండి.
అంతే, సాంప్రదాయమైన పానకం రెడీ. దీనిని మీరు ఈ ఎండాకాలంలో ఎప్పుడైనా చేసుకొని తాగవచ్చు. మీరు ఈ పానకంలో కొన్ని ఐస్ క్యూబ్‌లను వేసి రుచిని ఆస్వాదిస్తూ రిఫ్రెష్ అవ్వొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్