Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్-soya dosa recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Haritha Chappa HT Telugu
May 20, 2024 06:00 AM IST

Soya Dosa: డయాబెటిస్ రోగులకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ సోయా దోశ. దీన్ని చేయడం చాలా సులువు. రుచిగా కూడా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

సోయా దోశె రెసిపీ
సోయా దోశె రెసిపీ

Soya Dosa: డయాబెటిక్ పేషెంట్ల కోసం కొన్ని ప్రత్యేక బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు ఉన్నాయి. అందులో సోయా దోశ ఒకటి. దీన్ని తినడం వల్ల శక్తి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. పైగా రుచిగా కూడా ఉంటుంది. దీన్ని చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అరగంటలోనే చేసుకోవచ్చు. కేలరీలు తక్కువగానే అందుతాయి. కాబట్టి బరువు పెరుగుతామనే అవకాశం ఉండదు. ఈ సోయా దోశ ఎలా చేయాలో తెలుసుకోండి.

సోయా దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు

సోయా పాలు - ఒక కప్పు

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను

ఉల్లిపాయ తరుగు - అరకప్పు

నూనె - సరిపడినంత

గోధుమపిండి - పావు కప్పు

బేకింగ్ సోడా - చిటికెడు

సోయా దోశ రెసిపీ

1. ఒక గిన్నెలో గోధుమపిండి, సోయా పాలు వేసి బాగా కలపాలి.

2. సన్నని పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

3. నీటిని వేసి ఇది దోశ పిండిలా పోయడానికి వీలుగా చేసుకోవాలి.

4. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి పావుగంటసేపు వదిలేయాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.

6. రెండు గరిట్లా పిండి మిశ్రమాన్ని వేసి దోశెలా వృత్తాకారంలో రుద్దుకోవాలి.

7. రెండు వైపులా ఎర్రగా కాల్చి పక్కన పెట్టుకోవాలి.

8. దీన్ని కొబ్బరి చట్నీతో, టమాటో చట్నీ, సాంబార్...ఇలా దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.

10. ఈ పిండిని ఒకసారి కలుపుకొని రెండు మూడు రోజులు పాటు ఫ్రిజ్లో నిల్వ కూడా చేసుకోవచ్చు.

ఇప్పుడు ఒకేలాంటి దోశలు తిని బోర్ గా అనిపించినప్పుడు డయాబెటిక్ పేషెంట్లు ఈ సోయా దోశను ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ఆహారాలు ఇందులో లేదు. కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలే జరుగుతుంది.

Whats_app_banner