Banana Rava Balls : అరటిపండు రవ్వ కుడుములు.. సాయంత్రం స్నాక్స్‌గా ట్రై చేయండి.. ఆరోగ్యం కూడా-snacks recipe how to prepare banana rava balls know complete method of arati ravva kudumulu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Rava Balls : అరటిపండు రవ్వ కుడుములు.. సాయంత్రం స్నాక్స్‌గా ట్రై చేయండి.. ఆరోగ్యం కూడా

Banana Rava Balls : అరటిపండు రవ్వ కుడుములు.. సాయంత్రం స్నాక్స్‌గా ట్రై చేయండి.. ఆరోగ్యం కూడా

Anand Sai HT Telugu
Jun 03, 2024 05:15 PM IST

Banana Rava Balls Recipe : సాయంత్రంపూట స్నాక్స్ తినడం కొందరికి అలవాటు. అలాంటి వారు అరటిపండ్లు, రవ్వతో కలిపి మంచి ఐటమ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ.

అరటి రవ్వ కుడుములు
అరటి రవ్వ కుడుములు

మీ కుటుంబంలో సాయంత్రం స్నాక్స్ అడుగుతున్నారా? ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుందని చెబుతున్నారా? మీ ఇంట్లో అరటిపండు, రవ్వ ఉందా? అయితే ఎంచక్కా మీరు బనానా రవ్వ బాల్స్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

అరటిపండు, రవ్వతో రుచికరమైన చిరుతిండిని తయారు చేయండి. ఈ రెసిపీ తయారు చేయడం సులభం, ప్రతి ఒక్కరూ దీన్ని ఆనందిస్తారు. అరటి రవ్వ కుడుములు ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద అరటి రవ్వ బాల్స్ రెసిపీ పద్ధతి ఉంది. చదివి మీ ఇంట్లో కూడా స్నాక్స్ తయారుచేయండి.

అరటి రవ్వ కుడుములకు కావాల్సినవి

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, బాదంపప్పులు - కొద్దిగా (సన్నగా తరిగినవి), రవ్వ- 1 కప్పు, కొబ్బరి తురుము - 1/2 కప్పు, పండిన అరటిపండ్లు - 2, చక్కెర - 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - 1/2 tsp, నూనె - వేయించడానికి అవసరమైనంత

అరటి రవ్వ కుడుములు తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టీస్పూన్ల నెయ్యి పోసి వేడి అయ్యాక జీడిపప్పు, బాదంపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత అందులో 1 టీస్పూన్ నెయ్యి పోసి వేడి అయ్యాక అందులో రవ్వ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి ప్లేటులో పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్లీ అదే పాన్‌లో 1/2 టీస్పూన్ నెయ్యి పోసి అందులో కొబ్బరి తురుము వేసి వేయించాలి.

అనంతరం ఒక గిన్నెలో 2 అరటిపండ్లు వేసి, అందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసి బాగా మగ్గనివ్వాలి. వాటిని కలుపుకోవాలి.

తర్వాత వేయించిన రవ్వ, కొబ్బరి, జీడిపప్పు, బాదం, యాలకుల పొడి అరటి మిశ్రమంలో వేసి చేతులతో బాగా మెత్తగా చేయాలి.

పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేటులో పెట్టుకోవాలి. చివరగా బాణలి పెట్టి వేయించడానికి కావల్సినంత నూనె వేసి, వేడయ్యాక అందులో బాల్స్‌ను వేయాలి.

సన్నని మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుంటే రుచికరమైన అరటిపండు రవ్వ కుడుములు రెడీ.