Chanakya Niti : జీవితంలో ఈ విషయాలపై క్లారిటీ ఉంటే హ్యాపీగా బతికేయెుచ్చు-signs of lucky person according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti : జీవితంలో ఈ విషయాలపై క్లారిటీ ఉంటే హ్యాపీగా బతికేయెుచ్చు

Chanakya Niti : జీవితంలో ఈ విషయాలపై క్లారిటీ ఉంటే హ్యాపీగా బతికేయెుచ్చు

Anand Sai HT Telugu
May 27, 2024 08:00 AM IST

Chanakya Niti In Telugu : చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. ఎలాంటి విషయాలపై దృష్టి పెడితే సంతోషంగా బతకొచ్చో తెలిపాడు. అలాగే ఎలాంటి విషయాలు మన దగ్గర ఉంటే అదృష్టవంతులమో వివరించాడు.

చాణక్య నీతి
చాణక్య నీతి

చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితంలోని అన్ని అంశాలను, పరిస్థితులను పేర్కొన్నాడు. ఇందులో సంతోషం, దుఃఖం వంటి వాటితో మనసు చెదిరిపోకుండా ఉండేందుకు ఎన్నో చర్యలు ప్రస్తావించాడు. అలాగే చాణక్యనీతిలో కొన్ని జీవిత రహస్యాలు వివరించాడు. ఇవి ఒక వ్యక్తి తన జీవితాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది. విజయం అందరి దగ్గర ఉండదు.

జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు మిమ్మల్ని విజయానికి దూరం చేస్తాయని చాణక్యుడు చెప్పాడు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ జీవితంలో అపజయం నుండి తప్పించుకోవాలనుకుంటే, ఆచార్య చాణక్యుడి సూచనలను అనుసరించండి. చాణక్యుడు చెప్పిన అలాంటి రహస్యాల గురించే తెలుసుకోండి. ఈ విషయాలను అర్థం చేసుకోవడం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీ జీవితంలో కొన్ని ఇంటే అదృష్టంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..

అందరికి అర్థం చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని అందించే జీవిత భాగస్వామిని దొరకరు. పూర్వ జన్మలో చేసిన పుణ్యాల ఆధారంగా మాత్రమే ఈ వరం వస్తుంది. ధర్మబద్ధమైన జీవిత భాగస్వామిని కలిగి ఉన్నవారిని అదృష్టవంతులుగా పిలుస్తారు అని చాణక్యుడు చెప్పాడు. జీవిత భాగస్వామి ఎప్పుడూ గొడవపడుతూ ఉంటే, ఇంట్లో పగలు రాత్రి అస్తవ్యస్తంగా ఉంటుంది. స్త్రీలను గౌరవించే వారు, వారి సుఖ దుఃఖాలన్నింటిలో తమ వెంట ఉండేవారు ప్రతి జన్మలోనూ పుణ్యఫలాలను పొందుతారని చాణక్యుడు చెప్పాడు.

డబ్బు లేని జీవితం నరకం లాంటిదని, అందరూ సంతోషంగా జీవించాలంటే డబ్బు అవసరం. కొందరి దగ్గర డబ్బు తక్కువ, మరికొందరి దగ్గర ఎక్కువ. అయితే డబ్బును సక్రమంగా వినియోగించుకునే సామర్థ్యం అందరికీ ఉండదు. సంపద విలువను అర్థం చేసుకుని, లక్ష్మీదేవిని ఎప్పుడూ అగౌరవపరచని వారు మాత్రమే డబ్బును సక్రమంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని చాణక్యుడు చెప్పాడు. ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉంటే జీవితంలో ఎంతో సంతోషాన్ని పొందుతారు. అలాంటి వారు అదృష్టవంతులని చాణక్యుడు నమ్మాడు.

దానధర్మాలు చేసేవారు జీవితంలో ఎప్పుడూ వేగంగా అభివృద్ధి చెందుతారని చాణక్యుడు చెప్పాడు. జీవితంలోని ప్రతి దశలో వారికి అదృష్టం లభిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఇచ్చే వైఖరి ఉండదు. ఇతరులకు ఏదైనా తిరిగి ఇవ్వాలని మీకు నిజమైన కోరిక ఉంటే మీరు అదృష్టవంతులు. ధర్మం చేసేవారు ఇతరుల జీవితాలను అందంగా తీర్చిదిద్దడమే కాకుండా తమ కుటుంబాన్ని సుసంపన్నం చేసుకుంటారని చాణక్యుడు చెప్పాడు.

రెండు పూటలా భోజనం చేసేవాడు అదృష్టవంతుడని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతిరోజూ లక్షలాది మంది ఆకలితో చనిపోతున్నారు. ఒక్క పూట కూడా తినని వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. రోజూ రెండు పూటల భోజనం చేసే వ్యక్తి తనను తాను అదృష్టవంతులుగా భావించాలని చాణక్యుడు చెప్పాడు.

మంచి కెరీర్ స్కిల్స్ ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడని చాణక్యుడు చెప్పాడు. ప్రపంచంలోని ఏ మూలలోనైనా సంతోషంగా జీవించగలరు. అయితే తన సామర్థ్యాల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకంటే మన గమ్యం ఎప్పుడైనా మారవచ్చు అని చాణక్యుడు హెచ్చరించాడు. అందుకే ప్రతీ విషయాన్ని నేర్చుకుంటూ వెళ్లాలి.