Gandhi Jayanthi Wishes: గాంధీ జయంతి శుభాకాంక్షలను మీ స్నేహితులతో బంధువులతో షేర్ చేసుకోండి
Gandhi Jayanthi Wishes: స్వాతంత్య్రం పేరు చెబితే చాలు గుర్తొచ్చేది మహాత్మా గాంధీని. అతను తన ప్రాణాన్ని స్వాతంత్రం కోసమే అర్పించారు. అందుకే గాంధీ జయంతిని స్ఫూర్తివంతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది.
గాంధీ జయంతి విషెస్ (Pixabay)
Gandhi Jayanthi Wishes: అక్టోబర్ 2, గాంధీ జన్మించిన దినం. భారతదేశంలో గాంధీ జయంతి ఎంతో గొప్పగా జరుగుతుంది. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్రధారి అయిన గాంధీని దేశమంతా తలచుకుంటుంది. స్వాతంత్రోద్యమంలో అహింస, శాంతి అనే ఆయుధాలను ఉపయోగించి ఆయన భారతదేశం నుండి బ్రిటన్ పాలనను ముగించారు. భారతదేశ చరిత్రలోనే ఇది అరుదైన ఘట్టం. ప్రపంచవ్యాప్తంగా గాంధీ చెప్పిన అహింసా, శాంతి, న్యాయం, సమానత్వం అనే ఉద్యమాలను ప్రేరేపించింది. గాంధీ జయంతి సందర్భంగా మనం గాంధీని తలుచుకుంటూ మన స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ శుభాకాంక్షల్లోనే స్ఫూర్తివంతమైన సందేశాలను షేర్ చేయాలి.
గాంధీ జయంతి స్ఫూర్తివంతమైన శుభాకాంక్షలు
1. మన దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించి
స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి గాంధీ.
అతడిని గౌరవిద్దాం, స్మరించుకుందాం
గాంధీ జయంతి శుభాకాంక్షలు
2. ఎల్లప్పుడూ సత్యం, అహింసను సమర్థించి
సార్వభౌమదేశం కోసం పోరాడటానికి
భారతీయులను ఒక్కచోట చేర్చిన గొప్పవ్యక్తి
గాంధీ జయంతి శుభాకాంక్షలు
3. గాంధీ జయంతి నాడు మహాత్మా గాంధీ
మనకు అందించిన బాటలో పయనిస్తూ
ఆయనని స్మరించుకుంటూ సత్కరించుకుందాం
గాంధీ జయంతి శుభాకాంక్షలు
4. గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని
ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడేందుకు
మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుందాం
గాంధీ జయంతి శుభాకాంక్షలు
5. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన
జాతిపితనే గౌరవించాల్సిన సందర్భం ఇది
హ్యాపీ గాంధీ జయంతి
6. బాపు మనకి అందించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ
భారతదేశాన్ని అభివృద్ధి చెందిన సంపన్న దేశంగా మార్చడానికి
మన వంతు కృషి చేద్దాం
గాంధీ జయంతి శుభాకాంక్షలు
7. మనం గాంధీ బోధనలను పాటిద్దాం
అహింసాన్ని ఎల్లప్పుడూ ఆచరిద్దాం
గాంధీ జయంతి శుభాకాంక్షలు
8. గాంధీ జయంతి సందర్భంగా
మనలో సత్యం, అహింస, స్ఫూర్తి రగలాలని కోరుకుంటూ
గాంధీ జయంతి శుభాకాంక్షలు
9. కంటికి కన్ను అనుకుంటే
ప్రపంచం మొత్తం అంధులతోనే నిండిపోతుంది
గాంధీజీ చెప్పిన అహింసను అనుసరించి
శాంతియుతంగా జీవిద్దాం
గాంధీ జయంతి శుభాకాంక్షలు
10. నేను నిరాశకు గురైనప్పుడు
చరిత్రలో సత్యం, ప్రేమ ఎల్లప్పుడూ గెలిచాయని గుర్తుంచుకుంటాను.
నిరంకుశులు, హంతకులు కొంతకాలం అజేయంగా పాలన చేసి ఉండవచ్చు
కానీ చివరికి వారు కుప్పకూలిపోయారు
- గాంధీ
11. ప్రపంచానికి అహింస నేర్పిన ప్రత్యేకమైన వ్యక్తి
మన జాతికి స్వాతంత్య్రాన్ని ఇచ్చిన వీరుడు
అలాంటి వ్యక్తికి విలువ ఇవ్వాల్సిన రోజు ఇది
గాంధీ జయంతి శుభాకాంక్షలు
12. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు
క్షమాపణ అనేది బలవంతుల లక్షణం
గాంధీ జయంతి శుభాకాంక్షలు
13. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన
సంపన్న దేశంగా తీర్చిదిద్దేందుకు
బాపూజీ బాటలో నడుద్దాం
గాంధీ జయంతి శుభాకాంక్షలు
టాపిక్