Sai Memes : సాయి పేరుపై మీమ్స్ ఎందుకు.. నిజంగానే పులిహోర కలుపుతారా?-sai name memes why lakhs of memes creates on sai name ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sai Memes : సాయి పేరుపై మీమ్స్ ఎందుకు.. నిజంగానే పులిహోర కలుపుతారా?

Sai Memes : సాయి పేరుపై మీమ్స్ ఎందుకు.. నిజంగానే పులిహోర కలుపుతారా?

Anand Sai HT Telugu
Apr 02, 2023 01:45 PM IST

Instagram Sai Reels : ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే.. చాలు రీల్స్ కనిపిస్తాయి. ఇందులో సాయి అనే పేరు మీద ఫన్నీగా మీమ్స్ క్రియేట్ అవుతాయి. ఇంతకీ సాయి పేరు పైనే.. ఎక్కువగా మీమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? దీనికి కారణం ఏంటి?

సాయి పేరుపై మీమ్స్
సాయి పేరుపై మీమ్స్ (facebook)

ఇన్‌స్టాగ్రామ్(Instagram) తెరిస్తే.. తెగ టైమ్ పాస్. ఇక రీల్స్ చూస్తే మాత్రం అస్సలు టైమ్ కూడా తెలియదు. అలా స్క్రోల్ చేస్తుంటే.. చాలు.. రీల్స్ వచ్చేస్తుంటాయి. అయితే ఎప్పుడైనా గమనించారా? సాయి అనే పేరు మీద లక్షల్లో మీమ్స్ ఉంటాయి. మెుదట తెలుగులో ఎక్కువగా క్రియేట్ అయ్యేవి. తర్వాత తర్వాత.. ఇతర భాషల్లోనూ సాయి పేరుపై మీమ్స్(Sai Name Memes) వచ్చేశాయి. ఇప్పుడు సాయి పేరు ఉపయోగించుకోని.. మీమ్ పేజీ లేదు. మరి ఎందుకు ఈ పేరు మీద అంతలా మీమ్స్ క్రియేట్ అవుతుంటాయి?

రీల్స్(Reels) చూస్తుంటే.. ఫన్నీగా ఉంటాయి. అయితే సాయి పేరు మీద మీమ్స్(Sai Memes) మాత్రం.. ఎక్కువగా అమ్మాయిలను ఫ్లర్ట్ చేసేలా ఉంటాయి. ఒక్కసారి ఇన్‌స్టా(Insta) ఓపెన్ చేస్తే.. సాయి.. సాయి.. సాయి.. అంటూ మీమ్స్(Memes) దర్శనమిస్తాయి. హాయ్ సాయి.. హలో సాయి.. సాయిగాడి గురించి నీకేం తెలుసు.. సాయి నన్ను వదిలేస్తున్నావా? ఇలా సాయి ట్రోల్స్(Sai Trolls) కనిపిస్తాయి. ఇన్ని కోట్ల జనాభాలో సాయి పేరు మీదే మీమ్స్ ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించరా? మీమర్స్(Memers) చాలా తెలివైన వారు బాసూ.. అందుకే ఈ పేరును సరిగా వాడుకుంటున్నారు.

అంతేకాదు.. ఏదైనా.. ఇన్సిడేంట్ జరిగితే.. వెంటనే.. సాయి పేరు మీద మీమ్స్ పడతాయి. ఈ పేరును ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు.. చేసిన వీడియోలు కూడా ఇందుకు ఓ కారణం. అయితే ఓన్లీ ఆ వీడియోలు అని మాత్రం.. చెప్పలేం. మీమ్ పేజీలు(Meme Page) మెయింటేన్ చేసేవాళ్లు.. తాము పోస్ట్ వేస్తే.. ఎక్కువగా రీచ్ కావాలని కోరుకుంటారు. అందుకే ఈ పేరును ఉపయోగిస్తుంటారు.

మీరు ఒక్కసారి పరిశీలిస్తే.. ఓ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటే.. అందులో ఒక్కరికైనా సాయి అనే పేరు.. ముందో.. లేదా వెనకైనా ఉంటుంది. ప్రతీ పదిమందిలో ఒక్కరికైనా ఈ పేరు ఉంటుంది. సాయి ప్రకాశ్, సాయి కుమార్, విజయ్ సాయి.. ఇలా సాయి అనే పేరు.. కలిసి ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉపయోగించే పేరునే.. మీమర్స్(Memers) వాడుకుంటున్నారు. ఎలా అయిందంటే.. సాయి అనే పేరు పులిహోర కలపడానికి బ్రాండ్ అంబాసిడర్ లా చేసేశారు. మీమ్స్ చూసేవాళ్లకు ఈ విషయం తెలుసు.

ఎక్కువ మందికి ఉన్నపేరు ఉపయోగిస్తే.. మీమ్ పేజీల(Meme Page)కు రీచ్ ఎక్కువగా ఉంటుంది. మీమ్ పేజీలు సాయి పేరు మీద వేసే పోస్టుల్లో tag that sai అని వేస్తాయి. దీంతో ఫ్రెండ్స్ గ్రూపులో సాయి అనే పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ కారణంగా ఫ్రెండ్స్.. సాయి అనే వ్యక్తికి ఈ పోస్టును షేర్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూపులో సాయి అనే పేరు ఉంటే.. ఇతర వ్యక్తులకు కూడా ట్యాగ్ చేస్తారు. దీంతో మీమర్స్ పేజీకి రీచ్ ఎక్కువగా వస్తుంది. అలా మీమర్స్ తెలివిగా సాయి అనే పేరును ఎంచక్కా.. ఉపయోగించుకుంటున్నారు. సాయి అనే పేరు ఉన్నవాళ్లు కూడా.. ఈ విషయాన్ని లైట్ తీసుకుని నవ్వుతున్నారు. అంతేందుకు.. ఎవరైనా మీమర్స్ ఇప్పుడు ఈ విషయాన్ని చదివితే.. అబ్బా అవునా.. అంటూ మరో మీమ్ కూడా వేసేస్తారు. Tag That Sai అంటూ ట్రోల్ చేస్తారు.

Whats_app_banner