Kkr Captain Nitish Rana: అనుభవం లేని ప్లేయర్ కెప్టెనా - నితీష్ రానాను కెప్టెన్‌గా నియమించడంపై ట్రోల్స్
Kkr Captain Nitish Rana: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు నితీష్ రానా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో అతడికి సారథ్య బాధ్యతల్ని అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.
Kkr Captain Nitish Rana: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌ను నితీష్ రానా నడిపించబోతున్నాడు. వెన్ను గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతడి స్థానంలో కెప్టెన్‌గా నితీష్ రానాను నియమిస్తోన్నట్లు కేకేఆర్ మేనేజ్‌మెంట్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. రసెల్, షకీబ్ అల్ హసన్, సౌథీ, శార్దూల్ ఠాకూర్ లాంటి సీనియర్స్ ప్లేయర్స్‌ను కాదని నితీష్ రానాకు జట్టు పగ్గాలు అప్పగించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోన్నాయి.
కెప్టెన్‌గా జట్టును నడిపించే సామర్థ్యం, అనుభవం నితీష్ రానాకు లేదంటూ కామెంట్స్ చేస్తోన్నారు. ఏ ప్రతిపాదికన అతడికి కెప్టెన్సీ ఇచ్చారో అర్థం కావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తోన్నారు. షారుఖ్ అండతోనే అతడు కెప్టెన్ అయ్యాడని అంటున్నారు.
నితీష్ సారథ్యంలో కనీసం లీగ్ దశనైనా కేకేఆర్ దాటుతుందా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. వెన్ను గాయంతో శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. శ్రేయస్ స్థానంలో కొత్త కెప్టెన్ ఎంపికపై కోల్‌కతా మేనేజ్‌మెంట్ పలు ఆప్షన్స్ పరిశీలించినట్లు తెలిసింది.
తొలుత కెప్టెన్‌గా నితీష్ రానా పరిశీలనలో లేడని, కానీ చివరలో అనూహ్యంగా అతడి పేరు తెరపైకి వచ్చినట్లు చెబుతోన్నారు. నితీష్ కంటే రసెల్, శార్ధూల్ ఠాకూర్ బెటర్ అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 91 మ్యాచ్‌లు ఆడిన నితీష్ రానా 2181 పరుగులు చేశాడు. 2018 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతోనే కొనసాగుతోన్నాడు.
గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 361 రన్స్ చేశాడు రానా. మిడిల్ ఆర్డర్ లో జట్టుకు అతడు వెన్నుముకగా నిలుస్తుండటంతో అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.