Jio Reels Platform : ఫేస్బుక్- ఇన్‌స్టాకు పోటీగా జియో.. 'రీల్స్' కోసం కొత్త యాప్!
Jio Reels Platform : ప్లాట్‌ఫామ్ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు రచిస్తోంది. ఇది.. ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీనిస్తుంది.
Jio Reels Platform : మెటా సంస్థకు చెందిన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీనిచ్చేందుకు రిలయన్స్ జియో సన్నద్ధమవుతోంది! షార్ట్ వీడియో ఫార్మాట్లో ఓ యాప్‌ను లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది జియో. ఈ యాప్.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 'రీల్స్'కు పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ యాప్‌నకు 'ప్లాట్‌ఫామ్' అని జియో పేరు పెట్టినట్టు సమాచారం.
కంటెంట్ క్రియేటర్లకు మంచి అవకాశం..!
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, క్రియేటివ్‌ల్యాండ్ ఏషియా, రోలింగ్ స్టోన్స్ ఇండియా సంస్థలు.. ఈ షార్ట్ వీడియో యాప్‌ను తీసుకొచ్చేందుకు భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశాయి. ఎంటర్‌టైనర్స్‌ను గుర్తించి, మంచి వాతావరణంలో ఆర్గానిక్‌గా వృద్ధిచెందుతూ, నిలకడగా మోనెటైజేషన్ సాధించే లక్ష్యంతోనే ఈ యాప్‌ను తీసుకొస్తున్నట్టు ఆ ప్రకటనలో సంస్థలు తెలిపాయి.
Jio Reels latest app : క్రియేటర్లు, సింగర్లు, యాక్టర్లు, మ్యుజీషియన్లు, డ్యాన్సర్లు, కమేడియన్లు, ఫ్యాషన్ డిజైనర్లతో పాటు ఇన్ఫ్లుయెంజర్లుగా మారాలనుకునే వారందరికి ఈ ప్లాట్‌ఫామ్ యాప్.. ఒక మంచి వేదికగా మారనుందని జియో భావిస్తోంది.
2023 జనవరిలో లాంచ్..?
తొలుత.. ఈ యాప్‌లో 100మంది ఫౌండింగ్ మెంబర్స్ ఉంటారని తెలుస్తోంది. వారి ప్రొఫైల్స్‌కు గోల్డెన్ టికెట్ వెరిఫికేషన్ లభిస్తుందని సమచారం. వీరు.. ఇతరులను ఆహ్వానిస్తారు. మిగిలిన వారు.. రిఫరల్ లింక్స్ ద్వారా యాప్‌లో సైన్ఇన్ అవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.
Jio reels vs Facebook reels : నివేదికల ప్రకారం.. ఈ యాప్‌ను బీటా వర్షెన్‌లో ఇప్పటికే టెస్ట్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2023 జనవరిలో జియో రీల్స్ యాప్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మెటాలో.. పెయిడ్ ఆర్గరిథమ్స్ ద్వారా క్రియేటర్ల ర్యాంకింగ్స్‌ను నిర్ణయిస్తారు. కానీ జియో రీల్స్ ప్లాట్‌ఫామ్ యాప్‌లో అలా ఉండకపోవచ్చు. ఆర్గానిక్గానే ర్యాంకింగ్స్, ప్రొఫైల్ గ్రోత్ ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా టాలెంట్‌కి తగ్గట్టు మోనెటైజేషన్, ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
కంటెంట్ క్రియేటర్ల గ్రోత్‌ను.. సిల్వర్, బ్లూ, రెడ్ టిక్ వెరిఫికేషన్ల ద్వారా గుర్తిస్తారని సమాచారం. కంటెంట్, ఫ్యాన్‌బేస్ ఆధారంగా ఈ టిక్స్‌ను కేటాయిస్తారని తెలుస్తోంది.
Reliance Jio latest news : ఈ యాప్‌లో 'బుక్ నౌ' అనే ఫీచర్ కూడా ఉండొచ్చు. ఎవరైనా.. ఎవరితోనైనా కొలాబొరేషన్ చేసేందుకు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చని సమచారం.
టెలికాం దిగ్గజం జియో.. మెటాకు పోటీగా నిలుస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి జియో ప్రవేశపెట్టే రీల్స్ యాప్ ఏమేరకు ప్రదర్శన చేస్తుందో చూడాలి.
సంబంధిత కథనం