Shraddha Walkar Murder case : శ్రద్ధ హత్య కేసులో 3వేల పేజీల ఛార్జ్‌షీట్!
Shraddha Walkar Murder case : శ్రద్ధ వాల్కర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో.. పోలీసులు రూపొందించిన 3వేల పేజీలతో కూడిన డ్రాఫ్ట్ ఛార్జ్‌షీట్ బయటకొచ్చింది.
Shraddha Walkar Murder case police chargesheet : శ్రద్ధ వాల్కర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీ పోలీసులు 3వేల పేజీలతో కూడిన డ్రాఫ్ట్ ఛార్జ్‌షీట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. 100మంది సాక్షుల స్టేట్మెంట్స్, ఎలక్ట్రానిక్, ఫోరెన్సీక్ ఆధారాల వివరాలను ఈ డ్రాఫ్ట్ ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నట్టు సమాచారం.
శ్రద్ధను హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా నరికి!
26ఏళ్ల శ్రద్ధా వాల్కర్‌ను 28ఏళ్ల అఫ్తాబ్ పూనావాలా.. గతేడాది మేలో ఢిల్లీలో ఓ ఫ్లాట్‌లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. వీరిద్దరు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కాగా.. వీరి మధ్య తరచూ గొడవలు అవుతూ ఉండేవి! పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడంతో ఆమెను చంపేశాడు అఫ్తాబ్.
Shraddha Walkar Murder case : ఈ నేరం బయటకు రాకుండా.. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి.. తన ఫ్లాట్‌లోని ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. వీలు దొరికినప్పుడల్లా.. వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీసుకెళ్లి.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. చేసిన తప్పుకు భయపడని అతను.. మరో గర్ల్‌ఫ్రెండ్‌తో అదే ఫ్లాట్‌లో సమయం గడిపేవాడు. అప్పటికీ శ్రద్ధ శరీరం ఫ్రిడ్జ్‌లోనే ఉంది!
Shraddha Walkar news : స్నేహితుల ఫోన్ కాల్స్‌కు శ్రద్ధ స్పందించకపోవడంతో అసలు విషయం బయటపడింది. శ్రద్ధతో మాట్లాడి చాలా రోజులైందని.. ఆమె తండ్రికి కొందరు స్నేహితులు వివరించారు. అఫ్తాబ్‌తో రిలేషన్లో ఉండటం ఇష్టం లేకపోవడంతో.. శ్రద్ధతో కొన్నేళ్ల క్రితమే తెగదెంపులు చేసుకున్న ఆమె తండ్రి.. గతేడాది నవంబర్‌లో ఢిల్లీకి వెళ్లాడు. శ్రద్ధ ఫ్లాట్‌కు వెళ్లేసరికి.. అది లాక్ చేసి ఉండటాన్ని గుర్తించాడు. అనుమానంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చివరికి.. అఫ్తాబ్ నేరం బయటపడింది. పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఆవేశంలో ముందువెనక ఆలోచించుకోకుండా.. శ్రద్ధను హత్య చేసినట్ట అఫ్తాబ్ పూనావాలా.. పోలీసుల ముందు అంగీకరించాడు!
డ్రాఫ్ట్ ఛార్జ్‌షీట్‌లో ఏముందంటే..!
Police Chargesheet on Aaftab Poonawala : ఈ క్రమంలో.. నిందితుడిపై ఛార్జ్‌షీట్ వేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు పోలీసులు. నేరాన్ని అంగీకరిస్తూ అఫ్తాబ్ ఇచ్చిన స్టేట్మెంట్, అతనిపై నిర్వహించిన నార్కో టెస్ట్ ఫలితాలు, ఫొరెన్సీక్ రిపోర్టులను సైతం ఈ డ్రాఫ్ట్ ఛార్జ్‌షీట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. న్యాయశాఖ నిపుణులు ప్రస్తుతం.. ఈ డ్రాఫ్ట్ ఛార్జ్‌షీట్‌ను సమీక్షిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. న్యాయశాఖ నిపుణులు ఆమోదించిన అనంతరం.. నిందితుడిపై ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ వేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
సంబంధిత కథనం