Shraddha Walkar murder case : ‘రంపం'తో శ్రద్ధను ముక్కలు ముక్కలుగా నరికిన అఫ్తాబ్!
Shraddha Walkar news : శ్రద్ధ వాల్కర్‌ను హత్య చేసిన అఫ్తాబ్ పూనావాలా.. ఆమె శరీరాన్ని రంపంతో ముక్కలుముక్కలుగా చేసినట్టు తెలుస్తోంది. శ్రద్ధా వాల్కర్ ఎముకలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం తెలిసినట్టు సమాచారం.
Shraddha Walkar murder case : శ్రద్ధా వాల్కర్ హత్య కేసులో మరో వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రద్ధను హత్య చేసిన అఫ్తాబ్ పూనావాలా.. ఆమె శరీరాన్ని రంపంతో ముక్కలు ముక్కలుగా నరికినట్టు తెలుస్తోంది.
శ్రద్ధను చంపి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి..
26ఏళ్ల శ్రద్ధా వాల్కర్‌ను 28ఏళ్ల అఫ్తాబ్ పూనావాలా.. గతేడాది మేలో ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్య చేశాడు. వీరిద్దరు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కాగా.. వీరి మధ్య తరచూ గొడవలు అవుతూ ఉండేవి! పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడంతో ఆమెను చంపేశాడు అఫ్తాబ్. ఈ నేరం బయటకు రాకుండా.. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి.. తన ఫ్లాట్‌లోని ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. వీలు దొరికినప్పుడల్లా.. వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీసుకెళ్లి.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.
Shraddha Walkar news : స్నేహితుల ఫోన్ కాల్స్‌కు శ్రద్ధ స్పందించకపోవడంతో అసలు విషయం బయటపడింది. శ్రద్ధతో మాట్లాడి చాలా రోజులైందని.. ఆమె తండ్రికి కొందరు స్నేహితులు వివరించారు. అఫ్తాబ్‌తో రిలేషన్లో ఉండటం ఇష్టం లేకపోవడంతో.. శ్రద్ధతో కొన్నేళ్ల క్రితమే తెగదెంపులు చేసుకున్న ఆమె తండ్రి.. గతేడాది నవంబర్‌లో ఢిల్లీకి వెళ్లాడు. శ్రద్ధ ఫ్లాట్‌కు వెళ్లేసరికి.. అది లాక్ చేసి ఉండటాన్ని గుర్తించాడు. అనుమానంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చివరికి.. అఫ్తాబ్ నేరం బయటపడింది.
ఎములకపై పరీక్షతో..
కేసులో భాగంగా గత నెలలో.. మెహ్రౌలి అటవీ ప్రాంతంతో పాటు గురుగ్రామ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. పోలీసులకు కొన్ని ఎముకలు లభించాయి. వాటిని డీఎన్ఏ పరీక్షలకు తరలించారు. అవి శ్రద్ధా వాల్కర్వేనని డీఎన్ఏ పరీక్షలో తేలింది. బాధితురాలి తండ్రి డీఎన్ఏను తీసుకుని ఈ పరీక్షలు చేశారు. ఆమె ఫ్లాట్‌లో పోలీసులు గుర్తించిన రక్తం కూడా శ్రద్ధదే అని తేలింది.
Aaftab Poonawala latest news : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో శ్రద్ధ ఎములకలపై అటాప్సీ నిర్వహించారు. కాగా.. ఆమె శరీరాన్ని రంపంతో ముక్కలు ముక్కలుగా నరికినట్టు అటాప్సీ నివేదికలతో బయటపడింది!
మరోవైపు సంబంధిత రంపం, బ్లేడుతో పాటు శ్రద్ధను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసేందుకు ఉపయోగించిన ఆయుధాలను.. గురుగ్రామ్‌లోని వివిధ ప్రాంతాల్లో అఫ్తాబ్ పడేసినట్టు తెలుస్తోంది.
Aaftab Poonawala Shraddha Walker case : ఈ వార్త గతేడాది నవంబర్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను పోలీసులు అదే నెలలో అరెస్ట్ చేశారు. ఈ నెలలో నిందితుడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం