Ravva Utappam: రవ్వ ఊతప్పం ఇలా చేశారంటే నోరూరిపోతుంది
Ravva Utappam: అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటే ఒకసారి రవ్వ ఊతప్పం ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం చాలా సులువు.
Ravva Utappam: ఎప్పుడూ దోశ, ఇడ్లీ, ఉప్ తిని బోర్ కొడితే ఒకసారి రవ్వతో ఊతప్పం వేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకోవచ్చు. రవ్వ ఊతప్పంలో పెరుగు, కొన్ని రకాల కూరగాయలు కూడా వేస్తాం, కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
రవ్వ ఊతప్పం రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ - ఒక కప్పు
పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకుల తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు - అర స్పూను
క్యారెట్ తురుము - పావు కప్పు
క్యాప్సికం తురుము - పావు కప్పు
టమోటో తరుగు - పావు కప్పు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడినన్ని
రవ్వ ఊతప్పం రెసిపీ
1. ఒక గిన్నెలో ఉప్మా రవ్వను వేయాలి. అందులో పెరుగు వేసి కాస్త నీళ్లు వేసి బాగా కలపాలి.
2. కాస్త మందంగా వచ్చేలా ఈ పిండిని కలుపుకోవాలి. ఓ పది నిమిషాల పాటు దాని పక్కన పెట్టేయాలి.
3. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, ఉల్లిపాయలను, క్యారెట్, క్యాప్సికం, టమోటోను అందులో వేసి బాగా కలపాలి.
4. అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనెలో కరివేపాకులను వేయించి, వాటిని కూడా ఈ పిండిలో కలపాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేసుకోవాలి.
7. ఊతప్పం లాగా మందంగా ఈ పిండిని వేసుకోవాలి.
8. రెండు వైపులా కాల్చి తీసి పక్కన పెట్టుకోవాలి.
9. ఊతప్పాలను కొబ్బరి చట్నీతో లేదా పల్లి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
ఊతప్పంలో టమోటోలు, క్యాప్సికం, ఉల్లిపాయలు, క్యారెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవి. కాబట్టి పిల్లలకి అప్పటికప్పుడు చేసి ఇవ్వాలనుకుంటే ఈ రవ్వ ఊతప్పాన్ని ఒకసారి ప్రయత్నించండి.