Strawberry Crumble Recipe : మీకు డబుల్ ఎనర్జీనిచ్చే.. స్ట్రాబెర్రీ క్రంబుల్.. రెసిపీ ఇదే..
Strawberry Crumble Recipe : చాలా మందికి స్వీట్ టూత్ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు చీట్ డే తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. మనసుకు నచ్చింది హాయిగా, లిమిట్లో తిన్నప్పుడు శరీరం కూడా మంచిగా వర్క్ చేస్తుంది. అయితే మీరు కూడా రుచికరమైన స్వీట్ తినాలనుకున్నప్పుడు స్ట్రాబెర్రీ క్రంబుల్ చేసుకుని లాగించేయండి.
Strawberry Crumble Recipe : చలికాలంలో బెస్ట్ ఫుడ్ తినాలనుకునేవారు కచ్చితంగా ఈ స్వీట్‌ని ట్రై చేయాల్సిందే. దీనిని మనం స్ట్రాబెర్రీ, బాదంతో చేస్తాము. దీనిని తయారు చేయడం చాలా సులభం. పైగా వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా హాయిగా లాగించేస్తారు. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోగలిగే స్వీట్.. మీ పండుగ, ఏదైనా పార్టీ సమయంలో మీకు, కుటుంబసభ్యులకు మంచి డిజర్ట్ కూడా అవుతుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* స్ట్రాబెర్రీలు - 500 గ్రాములు
* బ్రౌన్ షుగర్ - 125 గ్రాములు
* బాదం మీల్ - 25 గ్రాములు
* బాదం పలుకులు - 50 గ్రాములు
* వెన్న - 75 గ్రాములు
* మైదా పిండి - 125 గ్రాములు
* బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా ఒవెన్‌ను 200c వరకు వేడి చేయండి. స్ట్రాబెర్రీలను బేకింగ్ ట్రేలో వేసి.. వాటిపై కాస్టర్ షుగర్, ఆల్మండ్ మీల్ వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మరో గిన్నెలో మైదా, వెన్న తీసుకుని బాగా కలపండి. క్రంబుల్ మిక్స్ కోసం.. బ్రౌన్ షుగర్, బేకింగ్ పౌడర్, బాదం వేసి బాగా కలపండి. పక్కన పెట్టుకున్న స్ట్రాబెర్రీలను కవర్ చేస్తూ.. ఈ క్రంబుల్ మిక్స్ వేసి వేయండి. దీనిని ఇప్పుడు ఒవెన్‌లో ఉంచి.. 30 నిమిషాల పాటు.. 180 C వద్ద బేక్ చేయండి. అంతే స్ట్రాబెర్రీ క్రంబుల్స్ రెడీ అయిపోయాయి. దీనిని మీకు నచ్చినట్లు గార్నిష్ చేసుకుని.. హాయిగా లాగించేయండి.
సంబంధిత కథనం