Salt tea: టీలో పంచదారకు బదులు చిటికెడు ఉప్పు వేసుకోండి, ఎంతో ఆరోగ్యం, అయితే ఈ జాగ్రత్త తీసుకోవాలి
Salt tea: ఉదయాన లేచినవంటే వెంటనే టీ తాగే వారి సంఖ్య ఎక్కువే. టీ ప్రేమికులకు ఆ తేనీరు నోటిలో పడనిదే.. ఏ పనీ చేయలేరు. టీ శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది.
Salt tea: టీలో ఎన్నో రకాలు ఉన్నాయి. పాలతో చేసే టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, రకరకాల హెర్బల్ టీ... ఇలాంటివి ఎంతోమంది తాగుతున్నారు. అయితే పాలతో చేసిన టీలో అందరూ చక్కెరను కలుపుకొని తాగుతారు. ప్రతిరోజు చక్కెర వేసిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే చైనాలో, కాశ్మీర్లో... సాల్ట్ టీ తాగే అలవాటు ఉంది. పంచదారకు బదులు ఉప్పు కలుపుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.
సాల్ట్ టీ ప్రయోజనాలు
పాలతో చేసిన టీలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఉప్పును అధికంగా తింటే చాలా ప్రమాదం. అలాగే తగినంత తినకపోయినా కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పును మన శరీరానికి ఎంత అవసరమో... అంతే తీసుకోవాలి. చిటికెడు ఉప్పును టీలో వేసుకొని తాగితే ఆరోగ్యానికి మేలే తప్ప కీడు జరగదు. అయితే టీ చాలా వేడిగా ఉన్నప్పుడే ఉప్పును వేయడం వల్ల ఉప్పు కూడా కాస్త ఉడుకుతుంది. దానిలోని చెడు చేసే స్వభావాలు కూడా తగ్గుతాయి.
టీలో చక్కెరకు బదులు చిటికెడు ఉప్పును వేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నరాల పనితీరు మెరుగుపడేలా ఇది సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణ ఎంజైమ్‌లు సవ్యంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా టీ లో ఉప్పు వేసుకుని తాగడం చాలా అవసరం. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
కొంతమంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖంపై మొటిమలు వంటివి వస్తూ ఉంటాయి. అలాంటివారు టీలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే ఎంతో మంచిది. ఇక మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఇలా సాల్ట్ టీను తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. మనసు రిలాక్స్ గా ఉండటమే కాదు, శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. టీ లో ఒత్తిడి హార్మోలను తగ్గించే శక్తి ఉంటుంది. కాబట్టి టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది.
సాల్ట్ టీ ఎలా చేయాలో ఒకసారి తెలుసుకోండి. ఒక పాత్రలో పాలు, కాస్త నీళ్లు కలిపి వేయండి. వాటిని స్టవ్ పై పెట్టి మరిగించండి. అందులోనే టీ పొడి వేసి బాగా మరిగించండి. దాన్ని వడకట్టి వేడివేడిగా ఒక గ్లాసులో వేయండి. అది బాగా వేడిగా ఉన్నప్పుడే చిటికెడు ఉప్పు వేయండి చాలు. బాగా కరిగే వరకు ఉంచండి. ఆ ఉప్పదనం మీ నాలుకకు తెలియకూడదు. అంత తక్కువగా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ టీ ని తాగండి. ప్రతిరోజూ ఈ టీని తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. బ్లాక్ టీ, హెర్బల్ టీలో కూడా చిటికెడు ఉప్పును వేసుకోవచ్చు. ఉదయం పూట టీ లో ఉప్పు తీసుకునేవారు తర్వాత ఆహారాల్లో ఉప్పును తగ్గించుకోవడం చాలా అవసరం. మన శరీరానికి ఎంత అవసరమో అంత ఉప్పును మాత్రమే తీసుకోండి.
టాపిక్