Never eat raw: ఈ 5 కూరగాయలు ఉడికించకుండా తినొద్దు.. లేదంటే తీవ్రమైన నష్టం-never eat these 5 veggies raw without cooking otherwise causes diseases ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Never Eat Raw: ఈ 5 కూరగాయలు ఉడికించకుండా తినొద్దు.. లేదంటే తీవ్రమైన నష్టం

Never eat raw: ఈ 5 కూరగాయలు ఉడికించకుండా తినొద్దు.. లేదంటే తీవ్రమైన నష్టం

Koutik Pranaya Sree HT Telugu
Oct 01, 2024 12:30 PM IST

Never eat raw: కొన్ని వంటకాల్లో, సలాడ్లలో ఆకుకూరలు, కొన్ని కూరగాయల్ని పచ్చిగానే వాడతారు. కానీ వాటినలా తినడం మానేయాల్సిందే. లేదంటే అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టేస్తాయి. ఆ కూరగాయలు ఏంటో తెలుసుకోండి.

పచ్చిగా తినకూడని కూరగాయలు
పచ్చిగా తినకూడని కూరగాయలు (Shutterstock)

కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు, పోషకాహార నిపుణులు, డైటీషియన్లు ఆహారంలో ఎక్కువ రంగురంగుల కూరగాయలను తినాలని సిఫార్సు చేస్తారు. ఈరోజు అక్టోబర్ 1న ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శాకాహారం వల్ల కలిగే ఆరోగ్యం, పర్యావరణ ప్రయోజనాలపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి, శాఖాహార జీవనశైలి విధానంపై దృష్టి పెట్టడానికి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున ఏ కూరగాయలను సరిగ్గా ఉడికించకుండా, పచ్చిగా తినకూడదో చూడండి.

ఈ కూరగాయలు పచ్చిగా తినకూడదు?

క్యాబేజీ

చాలా మంది సలాడ్లు, బర్గర్లు, శాండ్ విచ్ లలో క్యాబేజీని పచ్చిగా వాడతారు. కానీ పచ్చిగా తినకూడని కూరగాయల్లో ఇది ఒకటి. పచ్చి క్యాబేజీలో ఈకోలి లేదా సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉండవచ్చు. ఈ కూరగాయ గురించి ప్రజల్లో సరైన అవగాహన లేక చాలా మంది దీనిని పచ్చిగా తింటారు. కనీసం ఆవిరి మీద ఉడికించి తినడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది.

చామాకు

ఆ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను ఉపయోగించి రకరకాల సంప్రదాయ వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఈ ఆకుల్లో ఆక్సలేట్ అనే సేంద్రీయ ఆమ్లం ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకులను పచ్చిగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. చామాకులను సరిగ్గా ఉడికించి తింటే ఆక్సలేట్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి తినడానికి సురక్షితంగా మారతాయి.

పాలకూర

శరీరంలో ఇనుము లోపం ఉంటే ముందుగా తినమనేది పాలకూర. ఇది శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. కాకపోతే కొన్నిసార్లు దీనిమీద ఈకోలి బ్యాక్టీరియా ఉండొచ్చు. దాన్ని ఎక్కడ పెంచారనే దాన్ని బట్టి ఇది ఆధార పడి ఉంటుంది. అలాగే ఉడికించకుండా సలాడ్లలో వాడితే ఇది కడుపు నొప్పి మరియు ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

బ్రోకలీ:

బ్రోకలీని తేలికగా ఆవిరి మీద ఉడికించడం లేదా చాలా తక్కువ నూనెలో షాలో ఫ్రై చేయడం వల్ల దీని పోషకాలు ఎక్కువగా కోల్పోదు. ఇది గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కానీ పచ్చిగా తినడం మాత్రం శ్రేయస్కరం కాదు.

క్యాప్సికం

సలాడ్స్ లో, శ్యాండ్ విచ్‌లలో పచ్చి క్యాప్సికమ్ వాడితే రుచి పెరుగుతుంది. క్యాప్సికం చుట్టూ ఉండే పొరతో ప్రమాదం లేదు. కానీ దాని విత్తనాల్లో కొన్నిసార్లు రసాయన అవశేషాలు లేదా టేప్వార్మ్ గుడ్లు ఉండే అవకావం ఉంది.అందుకే దీన్ని వండుకుని తింటే రసాయనాలు తగ్గడంతో పాటూ తినడానికి ఆరోగ్యదాయకంగా మారుతుంది.

Whats_app_banner

టాపిక్