Mango Panipuri । మామిడిపండు పానీపూరీ.. తిన్నారంటే మైమరచిపోతారు!
Mango Panipuri: మామిడిపండు పానీపూరి గప్ చుప్ గా తినేయండి, ఒక్కసారి తిన్నారంటే మైమరచిపోతారు. మ్యాంగో పానీపూరీ రెసిపీని ఇక్కడ చూడండి.
Viral Mango Recipes: మామిడిపండుతో పానకం చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, అవసరమైతే మామిడిపండును కూరగా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోగా లేనిది, తాను కూడా కొత్తగా ఎందుకు ట్రై చేయకూడదు అని అనుకున్నాడో చిరువ్యాపారి. అందుకే వెరైటీగా మామిడిపండు పానీపూరీని (Mango Panipuri) సృష్టించాడు. తన వెరైటీ రెసిపీని జనాల మీద ప్రయోగించాడు. మరి జనాల రియాక్షన్ ఎలా ఉంది? తెలుసుకునేందుకు చదవడం కొనసాగించండి.
స్ట్రీట్ ఫుడ్ అంటే ప్రేమ ఉన్నవారు, పానీపూరీని ఎలా కాదనగలరు? చాలా మందికి ఈ చిరుతిండి అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మహిళలు పానీపూరీ కోసం ప్రాణాలర్పిస్తారు. ఎక్కడ చూసినా దొరికే ఈ వంటకానికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. క్రికెట్లో డకౌట్లు అవుతారేమో గానీ, పానీపూరీ తినడంలో డకౌట్లు అయ్యేవారే ఉండరు. ఒక్కసారి తినడం మొదలు పెట్టారంటే.. లెక్కలు, లెక్కలేసుకోవడాలు ఉండవు, కుప్పలుకుప్పలుగా తినేయడమే. సెంటర్ ఏదైనా, బండి ఏదైనా.. పానీపూరీతో బ్యాటింగ్ మొదలుపెడితే పూరీల వరద పారాల్సిందే.
పానీపూరీపై ఉన్న ఈ బలహీనతనే ముంబైలోని ఓ పానీపూరీ విక్రేత క్యాచ్ చేశాడు. ఇది మామిడిపండ్ల సీజన్ కాబట్టి, తన పానీపూరీలో మసాలా నీటికి బదులుగా మామిడిపండు రసాన్ని పోసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. దీనిని చూసిన జనం.. ఇదేందయ్యా ఇదీ... ఇది నేనెప్పుడూ చూడలా అనుకుంటూ దాని రుచిని చూడటం మొదలుపెట్టారు. క్రమంగా క్యూ పెరిగింది, ఈ మ్యాంగో పానీపూరీ కాస్త వైరల్ అయింది. ఆ వైరల్ వీడియోని మీరూ చూడండి మరి..
Watch Mango PaniPuri Recipe Here:
అయితే ఈ మ్యాంగో పానీపూరీ రెసిపీకి మిశ్రమ స్పందన లభించింది. లైక్స్ ఎక్కువే వస్తున్నా, కమెంట్ల రూపంలో తమ అయిష్టతను వ్యక్తం చేస్తున్నవారూ ఎక్కువే ఉన్నారు. ఇది హాని కలిగించే ఆహార కలయిక, ఆహారంతో ఆటలు ఆడవద్దు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దూ అంటూ కమెంట్స్ పెడుతున్నారు.
గతంలో కూడా ఇలాంటి వెరైటీ రెసిపీలు ప్రయోగాలు చేసినవారు ఉన్నారు. అప్పట్లో మామిడిపండు నూడుల్స్ చేయడం కూడా వైరల్ అయింది. నూడుల్స్ చేసేటపుడు చిల్లీసాస్, టొమాటో సాస్ వంటి వాటికి బదులుగా మామిడిపండు జ్యూస్ వేసి నూడుల్స్ చేయడమే మ్యాంగో నూడుల్స్.
దయచేసి మీరు కూడా ఇంట్లో ఇలాంటి ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే అవి సుశిక్షుతులైన నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
సంబంధిత కథనం