Morning Walk Tips: మార్నింగ్ వాక్‌కి వెళ్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే డబుల్ బెనిఫిట్స్ మీ సొంతం
Morning Walk Tips: ఉదయం నడక తర్వాత ప్రయోజనాలు ఎక్కువగా పొందాంటే చేయకూడని పనులు, చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి.
ఫిట్‌గా ఉండాలనుకుని, జిమ్ లు, కసరత్తులు చేయలేని వారు మార్నింగ్ వాక్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దానివల్ల మెరుగైన రక్త ప్రసరణతో సహా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మార్నింగ్ వాక్ ద్వారా శరీరంలోని కొవ్వును బ్యాలెన్స్ చేయడంతో పాటు ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు. అయితే, ఇక్కడో ప్రశ్న వస్తుంది. మార్నింగ్ వాక్ నుండి వచ్చిన తర్వాత మనం మొదట చేయాల్సిన పనేంటి? ఏం చేస్తే మనం చేసే మార్నింగ్ వాక్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మార్నింగ్ వాక్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా తప్పుడు ఆహారం తింటే వాకింగ్ చేసి ప్రయోజనం ఉండదు. మార్నింగ్ వాక్ నుండి వచ్చిన తర్వాత మీరు ఏమి తినాలో తాగాలో, ఒక గంట పాటు ఏం చేయాలో తెలుసుకుందాం.
స్ట్రెచింగ్స్ చేయొచ్చు
మార్నింగ్ వాక్ చేయడం వల్ల మన కండరాలు వేడెక్కుతాయి. ఈ సమయంలో వచ్చే కండరాల నొప్పిని వదిలించుకోవాలనుకుంటే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయవచ్చు. ఇది శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడంలోనూ సహాయపడుతుంది. మీరు వాకింగ్ తర్వాత ఏ పనీ చేయకుండా కూర్చుంటే.. కండరాలు, జాయింట్స్ నొప్పి వచ్చే అవకాశం ఉండొచ్చు.
పుష్కలంగా నీరు తాగాలి
మార్నింగ్ వాక్ చేసేటప్పుడు మనం ఎక్కువగా నీరు తాగాలి. నడక వల్ల శరీరం అలసిపోవడం, చెమట రూపంలో ద్రవాలు బయటికి పోతాయి. అందుకే నడక నుండి తిరిగి వచ్చినప్పుడు కూడా శరీరంలో నీటి పరిమాణాన్ని అంతే ఉంచడానికి ఎలక్ట్రోలైట్ పానీయాలు తాగవచ్చు.
శరీరాన్ని చల్లబర్చుకోవాలి
మనం మార్నింగ్ వాక్ చేస్తే మన శరీరం వెచ్చగా ఉంటుంది. శరీరం ఆవిర్లు వస్తూ, గుండె వేగం 120 బీపీఎం కూడా దాటవచ్చు. కొవ్వు కరగడంలో ఇలా అవడం చాలా ముఖ్యం. వాకింగ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మొదట మన శరీరం చల్లబడాలి. దీనికి ఉత్తమ మార్గం కొంత సమయం పాటు నిలకడగా కూర్చోవాలి. తద్వారా గుండె కొట్టుకోవడం సాధారణం అవుతుంది. ఇంకా అలసిపోయిన శరీరానికి కొంత విశ్రాంతి లభిస్తుంది.
ప్రోటీన్ షేక్స్
మార్నింగ్ వాక్ చేయడం వల్ల శరీరంలో చెమట పోవడంతో ఒంట్లో నీరు తక్కువగా ఉంటుంది. అదే విధంగా మన శక్తి కూడా తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకే మీరు మార్నింగ్ వాక్ నుండి తిరిగి వచ్చినప్పుడల్లా ప్రోటీన్ షేక్ లేదా అరటి పండు లాంటివి తినడానికి ప్రయత్నించండి. ఇది కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు కూడా అందేలా చేస్తుంది.