Morning Routines | మీరు జీవితంలో విజయవంతం కావాలంటే.. మీ దినచర్యను ఇలా ప్రారంభించండి!
Morning Routines: ఈరోజుల్లో ఆరోగ్యంగా ఉండేవారు ధనవంతులకంటే ధనవంతులు. వారే జీవితంలో విజయవంతం అవుతారు. ఇందుకు మీ అలవాట్లు ఆధారం అవుతాయి. ఉదయం మీ దినచ్యర్య ఎలా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
Morning Routines: పొద్దున్నే లేవాలి, మంచి అలవాట్లు కలిగి ఉండాలని మనలో చాలా మందికి పేరేంట్స్ లేదా పెద్దవారు చెబుతూ వస్తారు. ఉదయం అలవాట్లు ఎలా ఉండాలి, దినచర్యను ఎలా ప్రారంభించాలి అని చిన్నప్పటి నుంచే పుస్తకాల్లో పాఠాలు చదువుకొని ఉంటారు. 'ఎర్లీ టు బెడ్.. ఎర్లీ టు రైజ్.. మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్' అనే నానుడి ఎన్నో సంవత్సరాలుగా వాడుకలో ఉంది. త్వరగా పడుకోవడం, త్వరగా లేవడం, మనిషిని ఆరోగ్యవంతుడిగా, ధనవంతుడిగా, జ్ఞానవంతుడిగా మారుస్తుంది అని అర్థం.
అయితే చాలా మంది ఈ విషయాన్ని పెడచెవిన పెడతారు. ఉదయాన్నే నిద్ర లేవడం వలన జీవితం ఏ మారుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఆ భావన తప్పు. నిజంగా మీరు వేళకు పడుకోవడం, వేళకు నిద్ర చేయడం చేస్తే మీ శరీరంలోని జీవగడియారం దానికి అలవాటుపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈరోజుల్లో ఆరోగ్యంగా ఉండేవారు ధనవంతులకంటే ధనవంతులు.
ఈ రకంగా ఆరోగ్యవంతులైన మీరు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు, మీలో ఉత్పాదత పెరుగుతుంది. మీరు వివిధ విషయాలు నేర్చుకోవడానికి సమయం ఉంటుంది, ఇలా మీ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, మీ నైపుణ్యాలను, మీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు, మీరు జీవితంలో మరిన్ని గొప్పగొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుంది. మీ లక్ష్యాలను మీరు చేరుకుంటారు, జీవితంలో విజయవంతం అవుతారు. ఇందుకు మీ అలవాట్లు, మీ ఆలోచనావిధానం, మీరు మీ దినచర్యను ఎలా రూపొందించుకుంటున్నారు అనే విషయాలు ఆధారం అవుతాయి. ఉదయం మీ దినచ్యర్య ఎలా ప్రారంభం అవ్వాలో ఇక్కడ తెలుసుకోండి.
త్వరగా మేల్కొనండి
మీ దినచర్య హడావిడిగా, ఏవో ఆందోళనలతో ప్రారంభం కావొద్దంటే, కాస్త త్వరగా లేవాలి. తద్వారా మీకు మీ దినచర్య ప్రారంభించడానికి తగినంత సమయం ఉంటుంది. ఈలోపు మీ రోజును ప్రశాంతంగా ప్లాన్ చేసుకోవడానికి సమయం లభిస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అనివార్య కారణాల వలన మీరు సరిగ్గా నిద్రపోలేకపోతే అప్పుడపప్పుడూ ఆలస్యంగా లేచినా పర్వాలేదు. ముందు మీ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. కనీసం 7-8 గంటలు నిద్రపోవడం అవసరం.
హైడ్రేట్ అవ్వండి
నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు నీరు త్రాగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే రాత్రంతా నిద్రపోయిన మీ శరీరానికి ఉదయాన్నే తగినంత హైడ్రేషన్ అవసరం. కొన్ని నీళ్లు తాగడం అనే ఈ సాధారణ చర్య మీ శక్తి స్థాయిలను పెంచుతుంది, మీ జీవక్రియను స్టార్ట్ చేస్తుంది.
వ్యాయామం చేయడం
ఉదయం త్వరగా నిద్రలేస్తే వ్యాయామం చేసేందుకు టైం ఉంటుంది. మీకు కష్టమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. స్ట్రెచింగ్, యోగా, కార్డియో లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇలా ఏదో ఒక విధంగా మీ శారీరానికి శ్రమను కల్పించండి. ఈ వ్యాయామం మీ శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ ఏకాగ్రతను పెంచుతుంది.
మెడిటేషన్
ఉదయ్యాన్నే ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ వ్యాయామాలకు కొన్ని నిమిషాలు కేటాయించండి. ఈ అభ్యాసం మీ మెండ్ లోని అనవసరపు చెత్తను క్లియర్ చేస్తుంది. మీ మనస్సును శాంతపరుస్తుంది, మీ ఒత్తిడిని తగ్గించి, మీకు మానసిక స్పష్టతను పెంచడానికి సహాయపడుతుంది.
ప్రణాళికను రూపొందించండి
ఏరోజు చేయాల్సిన పనులను ఆరోజే పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకోండి. ఏ పనిని ఎప్పుడు చేయాలి, ఖాళీగా ఉన్న సమయాన్ని ఎలా వాడుకోవాలి. మీరు ఏవైనా లక్ష్యాలు పెట్టుకుంటే ఆ లక్ష్యం కోసం ఈరోజు ఏమైనా చేయవచ్చా అనేది ప్లాన్ చేసుకోండి. ఇలా ఒక ప్రణాళికను రూపొందించుకోవడం వలన మీ లక్ష్యాలను మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ఇది మిమ్మల్ని లక్ష్యం దిశగా పనిచేయడానికి ప్రేరేపిస్తుంది.
ఆరోగ్యకరమైన అల్పాహారం
రాత్రి నిద్రపోయిన దగ్గర్నించీ ఉదయం వరకు మీరు ఉపవాసం పాటించినట్లే. అందువల్ల మీ శరీరానికి శక్తి అవసరం అవుతుంది. దానికి ఇంధనం కావాలి, కాబట్టి పోషకమైన అల్పాహారంను తీసుకోండి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు వంటి శక్తిని అందించే ఆహారాలను తీసుకోండి. తియ్యని, ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి. బ్రేక్ ఫాస్ట్ చేయడం ఎట్టిపరిస్థితుల్లో మరిచిపోవద్దు.
ఉదయం ఇలాంటి అలవాట్లు కలిగి ఉండండి, మీ జీవితంలో జరిగే మార్పును మీరే గమనిస్తారు.
సంబంధిత కథనం