Monk Fruit: డయాబెటిస్ పేషెంట్లు కచ్చితంగా తినాల్సిన పండు మాంక్ ఫ్రూట్, తీపి తినాలన్నా కోరికను ఇది తీరుస్తుంది-monk fruit is a must eat fruit for diabetes patients it satisfies the craving for sweets ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monk Fruit: డయాబెటిస్ పేషెంట్లు కచ్చితంగా తినాల్సిన పండు మాంక్ ఫ్రూట్, తీపి తినాలన్నా కోరికను ఇది తీరుస్తుంది

Monk Fruit: డయాబెటిస్ పేషెంట్లు కచ్చితంగా తినాల్సిన పండు మాంక్ ఫ్రూట్, తీపి తినాలన్నా కోరికను ఇది తీరుస్తుంది

Haritha Chappa HT Telugu
Feb 13, 2024 01:10 PM IST

Monk Fruit: డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఆర్టిఫిషియల్ స్వీట్ నెర్లను వాడుతూ ఉంటారు. వీటిని దీర్ఘకాలికంగా వాడితే ప్రమాదం. మాంక్ ఫ్రూట్ తినడం వల్ల తీపి తినాలన్న కోరిక తీరుతుంది.

మాంక్ ఫ్రూట్
మాంక్ ఫ్రూట్

Monk Fruit: ప్రపంచంలో 50 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది అన్ని దేశాల్లోని ప్రజలను ప్రభావితం చేస్తుంది. రాబోయే 30 ఏళ్లలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారందరికీ వరం అనే చెప్పుకోవాలి మాంక్ ఫ్రూట్. తీపి తినాలన్న కోరికను ఈ మాంక్ ఫ్రూట్ తీర్చేస్తుంది.

మాంక్ ఫ్రూట్ ఎందుకు తినాలి?

చక్కెర స్థాయిలు అదుపులో లేనప్పుడు మధుమేహం వస్తుంది. అలాంటివారు ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కెరకు పూర్తిగా దూరంగా ఉండాలి. అయితే ఆ తీపి కి అలవాటు పడినవారు చక్కెరకు దూరంగా ఉండేందుకు ఆర్టిఫిషియల్ సీట్‌నర్లపై ఆధారపడుతున్నారు. దీనిలో సున్నా క్యాలరీలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లు తినడం వల్ల దీర్ఘకాలికంగా ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం తప్పదు. కాబట్టి ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లకు బదులుగా మాంక్ ఫ్రూట్ ను ప్రయత్నించమని చెబుతున్నారు వైద్యులు. మాంక్ ఫ్రూట్ అనేది ఒక పండు.

మాంక్ ఫ్రూట్‌ను బుద్ధా ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఇది చైనాకు చెందిన పండుగా చెబుతారు. చైనీస్ వైద్యంలో కూడా దీన్ని వినియోగించినట్టు ఆధారాలు ఉన్నాయి. తీపి తినాలన్న కోరిక తీర్చే అద్భుతమైన పండు ఈ మాంక్ ఫ్రూట్. మాంక్ పండ్ల రసాన్ని తీసి ఎండబెట్టి పొడిలా చేసుకుని దాచుకుంటే అది మంచి చక్కెరలా ఉపయోగపడుతుంది. ఈ మాంక్ ఫ్రూట్ లో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.

మాంక్ ఫ్రూట్ చాలా తీపి

ఇది చాలా తీపిగా ఉంటుంది. చక్కెరతో పోలిస్తే 250 రెట్లు తీపిగా ఉంటుంది. క్యాలరీలు, కొవ్వులు, పిండి పదార్థాలు ఏమీ ఉండవవు. చిటికెడు మాంక్ ఫ్రూట్ పొడి వేసుకుంటే చాలు తియ్యదనం వచ్చేస్తుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను ఏమాత్రం పెంచదు. అలాగే ప్యాంక్రియాస్‌ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది. కాలేయంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

బరువు తగ్గేందుకు...

బరువు తగ్గేందుకు కూడా మాంక్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. దీనిలో ఆర్టిఫిషియల్ స్వీట్‌నెర్లలో ఉండవు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెంచే గుణము ఉండదు. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం మాంకు ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఇవి క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడేలా ప్రోత్సహిస్తాయి. లుకేమియా కణాల పెరుగుదలను అణిచివేసి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. దగ్గు వేధిస్తున్నప్పుడు లేదా ఆస్తమా ఇబ్బంది పెడుతున్నప్పుడు, శ్వాస కోశ వ్యాధులు ఉన్నప్పుడు మాకు తరచూ తినడం చాలా అవసరం.

ఎక్కడైనా మాంక్ ఫ్రూట్ కనిపిస్తే కచ్చితంగా కొని తెచ్చుకోండి. దీని పొడి రూపంలో మారి దాచుకోవచ్చు లేదా పండ్ల రసం లా చేసి తాగొచ్చు. ఇది మీ ఆరోగ్యానికి అన్ని విధాలుగా మీరే చేస్తుంది.

Whats_app_banner