Migraine: భావప్రాప్తితో మైగ్రేన్ తగ్గుతుందట, ప్రయత్నించి చూడండి
Migraine: తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి, మానసిక స్థితి మెరుగుపరచడానికి భావప్రాప్తి ఎంతో ఉపయోగపడుతుంది. భావప్రాప్తి వల్ల ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.
భార్యాభర్తల అనుబంధంలో శారీరక సాన్నిహిత్యం ఒక ముఖ్యమైన భాగం. శృంగారంలో పాల్గొనడం వల్ల భాగస్వామితో శారీరకంగా, మానసికంగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. దీనివల్ల సంబంధాలు బలపడతాయి. ఎక్కువ కాలం వారి సంబంధాన్ని మరింత గట్టిగా మారుతాయి. లైంగిక సంబంధం అనేది భార్యాభర్తల మధ్య అవగాహన, కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఇద్దరు వ్యక్తులను ఒకరికొకరు దగ్గర చేసేది శారీరక సంబంధమే. భావప్రాప్తి అనేది లైంగిక ప్రేరణలో ముఖ్యమైన భాగం. ఇది ఎన్నో శారీరక, మానసిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల మైగ్రేన్ వంటి తలనొప్పులు తగ్గుతాయి. మైగ్రేన్ నొప్పి తగ్గించి మంచి మూడ్ లో ఉంచుతుంది. ఈ ఉద్వేగం ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
మానసిక స్థితిని మారుస్తుంది
భావప్రాప్తి విషయంలో ఉద్వేగం కలుగుతుంది. ఆ సమయంలో డోపమైన్ వంటి ఆనంద హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇదొక ఫీల్ గుడ్ హార్మోన్. ఇది మనిషి మూడ్ ను సంతోషంగా మారుస్తుంది. సెరోటోనిన్, వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ కూడా సెక్స్ చేసేటప్పుడు, ఉద్వేగం, భావప్రాప్తి సమయంలో విడుదలవుతాయి. ఇవి శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలను నియంత్రిస్తాయి.
నిద్రను మెరుగుపరుస్తుంది
భావప్రాప్తి మానసిక స్థితిని పెంచడానికి, శరీరంలో ఒత్తిడి స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రవేళకు ముందు ఉద్వేగంతో శృంగారంలో పాల్గొన్న వ్యక్తులు మంచి నిద్ర నాణ్యతను పొందుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది నిద్రలేమిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
కటి ఫ్లోర్‌ను బలోపేతం చేయడానికి భావప్రాప్తి చాలా అవసరం. మూత్ర, మల విసర్జనలను ఆపుకోలేని ఆరోగ్య పరిస్థితిని నిర్వహించడానికి కటి ఫ్లోర్ బలంగా ఉండడం చాలా ముఖ్యం. లైంగిక విధులను మెరుగుపరచడానికి కటి భాగాన్ని బలోపేతం చేస్తుంది. సెక్స్, భావప్రాప్తి కలిగి ఉండటం కటి భాగాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి…
గుండె సంబంధిత పేషెంట్లు కోలుకోవడానికి, క్రమం తప్పకుండా సెక్స్ తో పాల్గొంటూ ఉండాలి. భావప్రాప్తి వల్ల గుండె జబ్బుల మరణాన్ని నివారించడంలో సహాయపడుతుంది. లైంగిక చర్య కూడా గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
భావప్రాప్తి వల్ల శరీరంలోని ఎన్నో నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ ను కూడా అదుపులో ఉంచుతుంది. మానసిక ఆందోళనతో బాధపడుతున్నవారు తరచూ జీవిత భాగస్వామితో లైంగిక ప్రక్రియలో పాల్గొనడం మంచిది. సెక్స్ అనేది కూడా వ్యాయామం చేయడంతో సమానం. మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి సెక్స్ ప్రక్రియ చాలా అవసరం. మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడానికి లైంగిక క్రియ చాలా అవసరం.
భావప్రాప్తి సమయంలో, పెద్ద మొత్తంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్ మెదడు నొప్పిని గ్రహించే విధానాన్ని మార్చడంలో సహాయపడుతుంది. మైగ్రేన్లు లేదా క్లస్టర్ తలనొప్పి వంటివి వచ్చినప్పుడు లైంగిక చర్యతో వాటిని తగ్గించుకోవచ్చు. భావప్రాప్తి శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది నొప్పి నివారణకు ఎంతో ఉపయోగ పడుతుంది.