Wife and Husband: భార్యాభర్తల మధ్య లైంగిక బంధం బలపడాలంటే ప్రతిరోజూ తినాల్సిన పండు ఇదే-this is the fruit that should be eaten to strengthen the sexual relationship between husband and wife ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wife And Husband: భార్యాభర్తల మధ్య లైంగిక బంధం బలపడాలంటే ప్రతిరోజూ తినాల్సిన పండు ఇదే

Wife and Husband: భార్యాభర్తల మధ్య లైంగిక బంధం బలపడాలంటే ప్రతిరోజూ తినాల్సిన పండు ఇదే

Haritha Chappa HT Telugu
Published Jul 02, 2024 06:00 PM IST

Wife and Husband: భార్యాభర్తలు ఆనందంగా జీవించాలంటే వారి మధ్య లైంగిక అనుబంధం చక్కగా సాగాలి. వారిలో లైంగిక ఆసక్తి పెంచి ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. ప్రతిరోజూ భార్యాభర్తలు మూడు ఖర్జూరాలను తింటే వారిలో సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది.

భార్యాభర్తల అనుబంధం
భార్యాభర్తల అనుబంధం (Pixabay)

Wife and Husband: భార్యాభర్తలు సంతోషంగా జీవించాలంటే వారి మధ్య లైంగిక అనుబంధం చక్కగా ఉండాలి. ఎంతోమంది భార్యాభర్తలు లైంగిక సంబంధానికి నెలల పాటు దూరంగా ఉంటున్నారు. దీనికి వారిలో సెక్స్ డ్రైవ్ తగ్గడం కారణమే. కాబట్టి భార్యాభర్తల్లో లైంగిక ఆసక్తి పెంచేందుకు ప్రతిరోజూ ఖర్జూరాలు తినాలి. ఇద్దరూ చెరో మూడు ఖర్జూరాలు తినడం అలవాటు చేసుకోండి. ఇవి వారిలో సెక్స్ డ్రైవ్ ను పెంచుతాయి. ఒకరిపై ఒకరికి ఇష్టాన్ని, ప్రేమను కలుగజేస్తాయి.

సెక్స్ డ్రైవ్ ను నియంత్రించడంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆ రెండింటి పనితీరు సరిగా లేకపోతే లైంగిక చర్య పై ఆసక్తి తగ్గిపోతుంది. దీనివల్ల భార్యాభర్తలకు తెలియకుండానే వారి మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి వారు ఖర్జూరాలను తినడం వల్ల వారి లైంగిక జీవితం ఆనందంగా సాగుతుంది.

లైంగిక ఆసక్తి తగ్గడానికి కారణం

కొందరి మహిళల్లో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మెనోపాజ్‌కు దగ్గరగా ఉన్న మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇది కూడా వారిలో లిబిడోను తగ్గిస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. బాలింతగా ఉన్న సమయంలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా లైంగిక కోరికలను తగ్గిస్తాయి.

రుతు చక్రం సరిగా లేకపోయినా కూడా హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇవి లైంగిక ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాగే థైరాయిడ్, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఆర్థరైటిస్ వంటి పరిస్థితులు ఉన్నా కూడా సెక్స్ పై ఆసక్తి కలగదు. యాంటీ డిప్రెసెంట్, గర్భనిరోధక మాత్రలు, రక్తపోటును తగ్గించే మందులు వాడుతున్న వారిలో లైంగిక ఆసక్తి తక్కువగా ఉంటుంది. డిప్రెషన్, ఒత్తిడి వంటి వారిన పడినవారు సెక్స్ పై ఎక్కువ ఆసక్తిని చూపించుకోరు.

ఖర్జూరాలు ఎందుకు తినాలి?

ఇలాంటి తక్కువ లైంగిక ఆసక్తి కలిగిన మహిళలు, పురుషులు కూడా ప్రతిరోజు ఖర్జూరాలను తింటే మంచి ఫలితం లభిస్తుంది. ఖర్జూరంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి స్థిరంగా శక్తిని అందిస్తూనే ఉంటాయి. 100 గ్రాముల ఖర్జూరం తింటే 66 గ్రాముల చక్కెర శరీరానికి లభిస్తుంది. ఇవి సెక్స్ డ్రైవ్ ను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

ఖర్జూరాలలో విటమిన్ ఏ కూడా అధికంగా ఉంటుంది. అలాగే మెగ్నీషియం నిండి ఉంటుంది. ఇవి హార్మోన్ల నియంత్రణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. లైంగిక కోరికలను పెంచుతాయి.

ఖర్జూరంలోని పోషకాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. ఇది ఆరోగ్యకరమైన లిబిడోకు కారణం అవుతుంది. కార్టిసాల్‌ను నియంత్రించి సెక్స్ డ్రైవ్ ను పెంచడంలో మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కార్టిసాల్ అనేది ఒక ఒత్తిడి హార్మోను. ఒత్తిడి అధికంగా అనిపిస్తే ఈ హార్మోను విడుదలవుతుంది. ఇది మానసిక స్థితిని మార్చేస్తుంది. లైంగిక చర్యలపై ఆసక్తి లేకుండా చేస్తుంది.

కాబట్టి ఉదయం లేచాక బ్రేక్ ఫాస్ట్ సమయంలో రెండు లేదా మూడు ఖర్జూరాలను తినడం అలవాటు చేసుకోండి. నెల రోజుల పాటు తింటే మీ ప్రవర్తనలో మీకే తేడా తెలుస్తుంది. ముఖ్యంగా మీరు మీ భాగస్వామితో చాలా ప్రేమ పూర్వకంగా ఉంటారు. మీ మధ్య అనుబంధం బలపడుతుంది. లైంగిక చర్య పై ఆసక్తి కలుగుతుంది. తద్వారా భార్యాభర్తలు బంధం మరింతగా దృఢమవుతుంది.

Whats_app_banner