Money and sleep: నిద్రకు, డబ్బుకున్న సంబంధం తెలిస్తే షాకవుతారు.. ఇలా చేస్తే మంచి నిద్ర మీ సొంతం..-does money effects sleep know what a recent survey saying ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Money And Sleep: నిద్రకు, డబ్బుకున్న సంబంధం తెలిస్తే షాకవుతారు.. ఇలా చేస్తే మంచి నిద్ర మీ సొంతం..

Money and sleep: నిద్రకు, డబ్బుకున్న సంబంధం తెలిస్తే షాకవుతారు.. ఇలా చేస్తే మంచి నిద్ర మీ సొంతం..

Jul 13, 2024, 09:51 AM IST Koutik Pranaya Sree
Jul 13, 2024, 09:51 AM , IST

Money and sleep: బ్రిస్టల్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం, డబ్బు మంచి నిద్రతో ముడిపడి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. డబ్బుకు నిద్రకు సంబంధం ఏమిటి? వారు ఏమి చెబుతున్నారో తెల్సుకోండి.

నేటి ప్రపంచంలో చాలా మందికి వివిధ కారణాల వల్ల  నిద్ర సమస్య ఉంటోంది .ఇది ఒక వ్యాధి అని అనుకుంటారు. లేదా సరైన వాతావరణం లేని కారణంగా నిద్రపోకపోవచ్చుఅనుకుంటాం. అయితే తాజాగా ఈ అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.  

(1 / 6)

బ్రిస్టల్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. నిద్ర, డబ్బుతో  ముడిపడి ఉంది. విశ్వవిద్యాలయ పరిశోధకులు సుమారు 1,000 మందిని సర్వే చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. డబ్బుకు నిద్రకు సంబంధం ఏమిటి? వాళ్లేం చెబుతున్నారో చూద్దాం.

(2 / 6)

ఇటీవల యూనివర్సిటీ పర్సనల్ ఫైనాన్స్ విభాగానికి చెందిన కొందరు పరిశోధకులు వెయ్యి మందిమీద సర్వే నిర్వహించారు.నిద్రకు, డబ్బుకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తేలింది.ఆ సంబంధం ఏంటంటే..

(3 / 6)

కొంచెం డబ్బు పొదుపు చేసినా మంచి నిద్ర వస్తుందని కనుగొన్నారు. చాలా సందర్భాల్లో నిద్రించడానికి ఇబ్బంది పడేవారిలో తగినంత ఆదాయం ఉన్నా కూడా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటున్నాయట. ఫలితంగా పొదుపు చేయడం సాధ్యం కాదు. ఇది ఒక రకమైన ఆందోళనకు కారణమవుతుంది.     

(4 / 6)

ఆదాయం తక్కువగా ఉన్నా కూడా దానికి తగ్గట్లు కొంచెం పొదుపు చేయగలిగితే నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి వీలైనంత కొద్ది మొత్తాన్ని పొదుపు చేయాలని వారు సూచిస్తున్నారు. ఇది సామాజిక ఆందోళన స్థాయిని తగ్గిస్తుంది.   

(5 / 6)

అయితే, మరో విషయం కూడా ఈ సర్వేలో బయటకు వచ్చింది. ఉదాహరణకు, వివాహం కాని వాళ్ల కంటే వివాహితులు చాలా బాగా నిద్రపోతున్నారట. వివాహం వల్ల చాలా సందర్భాలలో ఆందోళన స్థాయిలను తగ్గిస్తుందని వారు భావిస్తున్నారట.  ఇది సరైన నిద్రపోవడానికి సహాయపడుతుందని పరిశోధనలో తేలింది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు