Masala Omelette: మసాలా ఆమ్లెట్ తింటే రుచి మామూలుగా ఉండదు, ఒకసారి తిని చూడండి-masala omelette recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Omelette: మసాలా ఆమ్లెట్ తింటే రుచి మామూలుగా ఉండదు, ఒకసారి తిని చూడండి

Masala Omelette: మసాలా ఆమ్లెట్ తింటే రుచి మామూలుగా ఉండదు, ఒకసారి తిని చూడండి

Haritha Chappa HT Telugu
Jul 08, 2024 05:49 PM IST

Masala Omelette: మసాలా ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. ఇది పిల్లలకు ఎంతో నచ్చుతుంది. మసాలా ఆమ్లెట్ చేయడం కూడా చాలా సులువు.

మసాలా ఆమ్లెట్ రెసిపీ
మసాలా ఆమ్లెట్ రెసిపీ

Masala Omelette: ఆమ్లెట్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక మసాలా ఆమ్లెట్ తింటే ఇంకా నచ్చుతుంది. రొటీన్ గా ఆమ్లెట్ చేసే కన్నా మసాలా ఆమ్లెట్ తిని చూడండి. దీనిలో వాడే పదార్థాలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. దీన్ని చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది.

మసాలా ఆమ్లెట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

గుడ్లు - నాలుగు

ఉల్లిపాయలు - ఒకటి

పచ్చి మిర్చి - రెండు

క్యారెట్ - ఒకటి

క్యాప్సికమ్ - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

పాలు - రెండు స్పూన్లు

మిరియాల పొడి - పావు స్పూను

పసుపు - పావు స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నూనె - రెండు స్పూన్లు

గరం మసాలా పొడి - పావు స్పూను

మసాలా ఆమ్లెట్ రెసిపీ

1. గుడ్లను గిలక్కొట్టి ఒక గిన్నెలో వేయాలి. వాటిని నురుగు వచ్చేలా గిలక్కొట్టాలి.

2. అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి వేసి బాగా గిలక్కొట్టాలి.

3. ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

4. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.

5. గుడ్లు మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుని చిన్న మంటల మీద ఉంచాలి.

6. ఇలా చిన్న మంట మీద ఉంచడం వల్ల ఆమ్లెట్ లో వేసి కూరగాయలు కూడా ఉడుకుతాయి.

7. ఈ మసాలా ఆమ్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో కావాల్సిన పోషకాలు అందుతాయి.

కోడిగుడ్డుతో మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ ఆమ్లెట్లో కోడిగుడ్డుతో పాటూ అనేక రకాల కూరగాయలు ఉన్నాయి. కాబట్టి ఇంకెన్నో పోషకాలు అందుతాయి. కోడిగుడ్డులో విటమిన్ బి12, ఐరన్, సెలీనియం, విటమిన్ డి వంటి అత్యవసరమైన పోషకాలు ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. క్యారెట్, క్యాప్సికమ్ వంటి కూరగాయల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవి గుండుకు, మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. రెండు గుడ్లతో వేసుకున్న మసాలా ఆమ్లెట్ తింటే సంపూర్ణ భోజనం తిన్నట్టే. పొట్ట కూడా నిండిపోతుంది.

Whats_app_banner