Love Marriage- Divorce | ప్రేమ పెళ్లిళ్లు విడాకులకు ఎందుకు దారితీస్తాయి.. అంతకుముందు, ఆ తరువాత జరిగే కథలు ఇవే!|-love marriage divorce these red flags should not be ignored before getting married
Telugu News  /  Lifestyle  /  Love Marriage Divorce, These Red Flags Should Not Be Ignored Before Getting Married
Love Marriage- Divorce
Love Marriage- Divorce (Pixabay)

Love Marriage- Divorce | ప్రేమ పెళ్లిళ్లు విడాకులకు ఎందుకు దారితీస్తాయి.. అంతకుముందు, ఆ తరువాత జరిగే కథలు ఇవే!|

03 November 2022, 23:05 ISTManda Vikas
03 November 2022, 23:05 IST

Love Marriage- Divorce: ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఎందుకు విడిపోతారో తెలుసా? కారణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, మీలో ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకునే వారుంటే ఇవి తెలుసుకోండి.

ప్రేమికులు బ్రేకప్ చెప్పుకుంటే ఆ ఇద్దరే ఒకరికొకరు దూరం అవుతారు. కానీ పెళ్లయ్యాక విడాకులు తీసుకుంటే రెండు కుటుంబాలు దూరం అవుతాయి. అనుకోకుండా ఏదైనా కష్టం వస్తే, ఆదుకోవడానికి అప్పుడు ఎవరూ ముందుకు రారు. బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమలు చిగురించే చాన్స్ ఉంటుదేమో కానీ, పెళ్లయ్యాక ఒక్కసారి విడాకులు తీసుకుంటే మళ్లీ బంధాలు అతుక్కోవడం అనేది ఉండదు. అదంతా గతమే, జీవితం అంతా వ్యర్థమే అనిపిస్తుంది. అప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశమే ఉండదు. (Also Read: సమంతకు కష్టమే!)

మరి ఒకరినొకరు ఎంతో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు.. పెళ్లయ్యాక ఎందుకు విడిపోతారు? అంత బలమైన కారణాలు ఏమై ఉండవచ్చు? ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు, వారు తమ ప్రియుడు, ప్రేయసికి సంబంధించిన మంచిచెడులు, అలవాట్లను ఇష్టపడతారు. కానీ పెళ్లయ్యాక కొన్ని అలవాట్లు, పద్ధతులు కొనసాగిస్తే అటువంటి సంబంధంలో కొనసాగడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లయ్యాక ఇరు కుటుంబాల పరువు ప్రతిష్టలు ముడిపడి ఉంటాయి. కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ఏవైనా పనులను భాగస్వామి పదేపదే చేస్తుంటే.. అది ఎదుటివారికి చికాకును తెప్పిస్తుంది. దీని వల్ల మనసు విరిగిపోయి, సంబంధం తెగిపోయే దశలోకి వస్తుంది. కాబట్టి ఏదైనా పెళ్లికి ముందే.

మీరు కూడా రిలేషన్షిప్‌లో ఉండి, మీ ప్రియమైన వారితో త్వరలో పెళ్లిని ప్లాన్ చేసుకుంటే, ఈ విషయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్లయ్యాక ఎలాంటి అంశాలు విడిపోవటానికి (Love Marriage- Divorce) దారితీస్తాయో ఇక్కడ చూడండి.

నిబద్ధత లోపించడం

ప్రేమలో ఉన్నప్పుడు ఏవైనా తప్పులు దొర్లితే, ఒక చిన్న సారీతో కూడా సర్ధుకుపోవచ్చు. కానీ పెళ్లయ్యాక ఆ నిబద్ధత లోపిస్తే సర్దుకుపోవడం ఉండదు, అంతా సర్దేయడమే.

అహంకారం

ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు, నేను స్వతంత్రంగా జీవించగలను అనే భావనలో ఉంటే, అలాంటి అహంకారం వర్కవుట్ కాదు. ఇద్దరు సంపాదించినా, ఒక్కరు సంపాదించినా ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం.

అనుమానం

ప్రేమలో ఉన్నప్పుడు భాగస్వామి ఏం చేస్తుంది, ఎవరితో ఉంది, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తే అది తనకు దక్కకుండా పోతారమో అనే భయంతో చేసినట్లు అవుతుంది. ఆ పొసెసివ్ నెస్ ప్రేమ అనిపించుకుంటుంది. కానీ పెళ్లి తర్వాత అలాగే చేస్తే దానిని అనుమానం అంటారు. అది అనర్థానికి దారితీస్తుంది.

కుటుంబాన్ని లెక్కచేయకపోవడం

ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లయ్యాక కుటుంబం అంటే అత్తగారి ఇళ్లే. తల్లివైపు వారు పరాయి వ్యక్తులు అవుతారు. కాబట్టి స్త్రీలు మెట్టినింటి ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలి. ఆ కుటుంబాన్ని లెక్కచేయకపోతే, మీకు ఆ కుటుంబంలో స్థానం పోతుంది.

అభిప్రాయ భేదాలు :

ప్రేమలో ఉన్నప్పుడు అభిప్రాయాలు వేరేగా ఉన్నా పోయేదేం లేదు, పెళ్లయ్యాక మాత్రం ఏకాభిప్రాయంతో ఉండాలి. అభిప్రాయ భేదాలు ఎక్కువ ఉన్నట్లయితే, భవిష్యత్తులో మీ సంబంధం ఎక్కువ కాలం ఉండబోదనే సంకేతం కూడా కావచ్చు.

సంబంధిత కథనం