Lord Ganesh Mantras । గణేశుని మంత్రాలు, శ్లోకాలు.. పఠిస్తే అన్నీ శుభాలు, లాభాలు!
వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి బుద్ధిజ్ఞానాలు, కార్య సిద్ధి, గొప్ప విజయం, సిరిసంపదలు సొంతం అవుతాయని భక్తుల నమ్మకం. మరి గణేశుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ కొన్ని మంత్రాలు, శ్లోకాలు అందిస్తున్నాం. వినాయకుడిని పూజించేటపుడు ఈ శ్లోకాలు తప్పక పఠించండి.
భాద్రపద మాసంలో వచ్చే మొదటి శుక్ల చతుర్థిని హిందువులు గణేష్ చతుర్థి లేదా వినాయక చవితిగా జరుపుకుంటారు. గణేశ పురాణం, స్కంద పురాణాల ప్రకారం గణేశుడు ఈరోజునే జన్మించాడని ప్రతీతి. భారతదేశంలో అత్యంత వైభవోపతంగా పది రోజుల పాటు గణేశ మహోత్సవాలు జరుగుతాయి. గణేశుడు భక్త జనులకు ఎంతో ఇష్టమైన దైవం. శివపార్వతుల తనయుడిగా కాకుండా.. జ్ఞానం (బుద్ధి), విజయం (సిద్ధి) , శ్రేయస్సు (వృద్ధి) లకు అధిపతిగా గణేశుడు ప్రసిద్ధి. సకల విఘ్నాలను తొలగించే దేవుడిగా దేవతలందరిలో తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడిగా, గణాలన్నింటికీ అధిపతి గణపతిగా గణనాథుడ్ని కొలుస్తారు. ప్రతి హిందువు ఇంట్లో గణేశుడి ప్రతిమ లేదా చిత్రం ఉంటుంది.
గణేశుడు తల ఏనుగు రూపంలో ఉంటుంది. ఈ ఆకారంతో గణపతిని దేవతలందరిలో సుస్పష్టంగా గుర్తించవచ్చు. అందుకే గజాననుడుగా కూడా పిలుస్తారు. ఇలా ఆయన సాక్షాత్కరించే రూపం, గుణగణాల ఆధారంగా అనేక పేర్లు ప్రాచుర్యంలో ఉన్నాయి.
శివ పురాణం ప్రకారం.. గణేశునికి శుభ్, లాభ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అంటే వీరు శుభం, లాభానికి ప్రతీకలు. వీరిలో రిద్ధి దేవి కుమారుడు శుభ్ కాగా, సిద్ధి దేవి కుమారుడు లాభ్ అని పురాణాల్లో ఉంది. అందుకే దేవతలందరిలో ఒక్క వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి బుద్ధిజ్ఞానాలు, ఎలాంటి ఆటంకాలు లేని కార్య సిద్ధి, తద్వారా మహోన్నత విజయం, ఎనలేని సంపదలు జీవితంలో సొంతం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Lord Ganesh Powerful Mantras, Slokas
మరి గణేశుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఇక్కడ కొన్ని వినాయక శ్లోకాలు, మంత్రాలు జాబితా చేస్తున్నాం. మీరు గణపతిని శుద్ధమైన మనసుతో ఆరాధిస్తూ ఈ మంత్రాలను జపించండి, మీకు సకల శుభాలు.. లాభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
శుభం చేకూర్చే గణేశ మంత్రం
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
వక్రతుండ మహా-కాయ సూర్య-కోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవా సర్వ-కార్యేషు సర్వదా ||
ఆశీర్వాద మంత్రం
गजाननं भूतगणादि सेवितं
कपित्थ जम्बूफलसार भक्षितम् ।
उमासुतं शोक विनाशकारणं
नमामि विघ्नेश्वर पादपङ्कजम् ॥
గజాననం భూత గణాధి సేవితమ్
కపిత్త జంబుఫలసార భక్తితం |
ఉమా సుతం శోక వినాశ కరణమ్
నమామి విఘ్నేశ్వర పాద పంకజం ||
మూల మంత్రం- శక్తి కోసం
ॐ श्रीम ह्रीं क्लीं ग्लौं गम गणपतये वरा वरद सर्वजनजनमय वशमानय स्वाहा ||
तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि |
तन्नो दंति प्रचोदयात ||
ॐ शांतिः शांतिः शांतिः ||
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద్ సర్వజన్ జన్మయ్ వశమనయే స్వాహా ||
తత్పురుషయే విద్మహే |
వక్రతుండయే ధీమహి |
తన్నో దంతి ప్రచోద్యాత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
సిద్ధి వినాయక మంత్రం
ॐ नमो सिद्धि विनायकाय सर्वकार्य करते
सर्व विघ्न प्रशमनय सर्वार्जय वश्याकरणाय
सर्वजन सर्वस्त्री पुरुष आकर्षणाय श्रीं ॐ स्वाहा ||
ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్య కర్త్రే
సమస్త విఘ్న ప్రశమ్నయ్, సర్వార్జయ్ వశ్యాకరాణాయ్
సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా ||
గణేశ గాయత్రీ మంత్రం
ॐ एकदंताय विद्यमहे
वक्रतुण्डाय धीमहि |
तन्नो दंति प्रचोदयात ||
ఓం ఏకదంతాయ విద్యామహే
వక్రతుండాయ ధీమహి |
తన్నో దంతి ప్రచోదయాత్ ||
శక్తివంతమైన ఈ గణేశ మంత్రాలు పరిశుద్ధమైన ఆలోచనలతో ధ్యాన ముద్రలో మనసులో పఠించడం లేదా జపించడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బుద్ధిజ్ఞానం పెరుగుతుంది, విజయం వరిస్తుంది. సంపదలు పెరుగుతాయి, జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగేందుకు మీలో సానుకూల శక్తిని నింపుతాయి.
సంబంధిత కథనం