Lord Shiva Blessings : శివుని అనుగ్రహం పొందాలంటే.. శ్రావణమాసంలో ఈ మొక్కలు నాటండి-trees to plant in srvana masam to get blessing from mahadeva ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Trees To Plant In Srvana Masam To Get Blessing From Mahadeva

Lord Shiva Blessings : శివుని అనుగ్రహం పొందాలంటే.. శ్రావణమాసంలో ఈ మొక్కలు నాటండి

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 06, 2022 11:05 AM IST

శ్రావణ మాసం మహాదేవునికి చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ.. ఆయనను పూజిస్తే.. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇది జీవితంలో చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. అయితే పూజ మాత్రమే కాదు.. ఈ మాసంలో కొన్ని ఆచారాలు పాటించడం వల్ల కూడా మహాదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు.

శివుని అనుగ్రహం
శివుని అనుగ్రహం

Lord Shiva Blessings : హిందువులకు శ్రావణమాసం చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో మహాదేవుని అనుగ్రహం పొందడానికి పూజలే కాకుండా కొన్ని నియమాలు పాటించవచ్చు అంటున్నారు శాస్త్ర్ నిపుణులు. దానిలో భాగంగా కొన్ని చెట్లు నాటడం అంటే శివుని చాలా ప్రియమైనది భక్తులు నమ్ముతారు. చాలా మంది శ్రావణమాసంలో ఈ చెట్లను ఇంట్లో నాటడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. మరి ఏవి నాటి.. శివుని అనుగ్రహం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకందాం.

అరటి చెట్టు

పెరుగుతున్న అరటి చెట్టును ఇంట్లో కలిగి ఉండటం చాలా శుభప్రదం. శాస్త్రాల ప్రకారం విష్ణువు ఈ చెట్టుతో సంబంధం కలిగి ఉన్నాడు. కానీ ఈ చెట్టును నాటడం ద్వారా విష్ణువు మాత్రమే కాదు శివుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి మీరు ఉంటున్న ఇంట్లోనే దీనిని నాటవచ్చు.

ప్లూమెరియా

ఈ చెట్టు అదృష్టానికి చిహ్నం. ఇది శివునికి ఇష్టమైన చెట్టు కూడా. కాబట్టి శ్రావణ మాసంలో ఈ చెట్టును నాటండి. మహాదేవుని అనుగ్రహం పొందవచ్చు. మీరు ఈ చెట్టును చాలా చిన్న ప్రదేశంలో కూడా నాటవచ్చు. ఫలితంగా ఫ్లాట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఉమ్మెత్త

ఉమ్మెత్త మహాదేవునికి ఇష్టమైన చెట్టు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రావణ మాసంలో ఈ మొక్కల్ని ఇంట్లో నాటితే ఆ ఇంట్లోని దుష్పరిణామాలన్నీ క్రమంగా మాయమవుతాయి. దీని ప్రభావంతో మహాదేవుని అనుగ్రహం కురుస్తుంది. కాబట్టి ఈ నెలలో ఇంట్లో ఉమ్మెత్త మొక్కను నాటండి.

శమీ చెట్టు

శమీ చెట్టు ఇంట్లో సానుకూల ప్రభావాలను పెంచుతుంది. కాబట్టి మీరు సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఈ చెట్టును నాటవచ్చు. అయితే శ్రావణమాసంలో ఈ చెట్టును నాటితే భోళనాథుని అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. కాబట్టి ఈ మాసంలో శమీ చెట్టును నాటండి.

మారేడు

మారేడుకాయలు లేకుండా శివారాధన పూర్తికాదు. అదే సమయంలో.. మారేడు ఆకులు కూడా తల్లి లక్ష్మికి చాలా ప్రియమైనవి. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇంట్లో ఈ చెట్టును నాటవచ్చు. దీనికి మహాదేవుడు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కానీ ఈ చెట్టును నాటడానికి కొంచెం పెద్ద స్థలాన్ని ఎన్నుకోవడం మంచిది.

WhatsApp channel

టాపిక్