Baby boy names: మీ అబ్బాయికి శ్రీ కృష్ణుడి పేరు పెట్టాలా? మంచి పేర్లు, వాటి అర్థాలు చూసేయండి-latest hindu baby boy names with meaning of lord krishna ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Boy Names: మీ అబ్బాయికి శ్రీ కృష్ణుడి పేరు పెట్టాలా? మంచి పేర్లు, వాటి అర్థాలు చూసేయండి

Baby boy names: మీ అబ్బాయికి శ్రీ కృష్ణుడి పేరు పెట్టాలా? మంచి పేర్లు, వాటి అర్థాలు చూసేయండి

Koutik Pranaya Sree HT Telugu
Aug 25, 2024 07:00 PM IST

Baby boy names: కృష్ణుడి అర్థం మీదుగా మీ అబ్బాయికి పేరు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ అర్థవంతమైన పేర్లు, వాటి అర్థాలు చూసేయండి.

శ్రీ కృష్ణుడి అర్థం వచ్చే అబ్బాయిల పేర్లు
శ్రీ కృష్ణుడి అర్థం వచ్చే అబ్బాయిల పేర్లు

చిన్న పిల్లలు అడుగులు వేయడం మొదలుపెడితే చిన్ని కృష్ణయ్య అడుగులు అంటారు. పిల్లలు చేసే ప్రతి పనికీ కృష్ణుని చేష్టలంటూ మురిసిపోతారు. ఇక కృష్ణుని అర్థం వచ్చేలా పేరు పెట్టాలనీ చాలా మంది భక్తులు ఆలోచిస్తారు. మీరూ అలాగో ఆలోచిస్తుందటే మంచి అర్థం ఉన్న కృష్ణుని పేర్లు, వాటి అర్థాలు చూసేయండి.

అభిజిత్:

అపజయం ఎరుగని దేవుడు శ్రీ కృష్ణుడు. అతని లాగే సదా విజయాలు చేకూరాలనుకుంటే మీ అబ్బాయికి అభిజిత్ అని పేరు పెట్టవచ్చు. దీనర్థం గెలుపొందేవాడు అని.

శ్యామ్:

ఈ పేరు చాలా సార్లు విన్నదే అయినా పిలవడానికి చాలా బాగుంటుంది. రెండక్షరాల పేరు పెట్టాలనుకుంటే శ్యామ్ అనే పేరు చూడండి. నీలమేఘశ్యాముడైన కృష్ణుని దేహం రంగుని సూచిస్తుందీ పేరు. అతని లాగే అందగాడని అర్థం.

గోకుల్:

ఇది శ్రీ కృష్ణుడి పెరిగిన గోకులం అనే ప్రదేశాన్ని సూచిస్తుంది. శ్రీ కృష్ణుడి పేర్లలో ఇదీ ఒకటి

జనార్దన్:

జనన మరణాల చక్ర నుంచి విముక్తి కల్పించేవాడు. అవసరంలో ఉన్న వాళ్లకి సాయం అందించేవాడని అర్థం. ఇది కూడా శ్రీ కృష్ణుని పేరే.

అవ్యుక్త్:

స్పష్టమైన ఆలోచనలు కలవాడని అర్థం. శ్రీ కృష్ణుడికి ఉన్న దూర దృష్టి, స్పష్టత కురుక్షేత్ర యుద్ద సమయంలో లోక కల్యాణానికి దోహదపడింది. మీ అబ్బాయికి అ అక్షరం మీద పేరు పెట్టాల్సి వస్తే ఇది బాగుంటుంది.

క్రిష్:

కాస్త ట్రెండీగా ఉన్న కృష్ణుని పేరు పెట్టాలనుకుంటున్నారా? అయితే కృష్ణని క్రిష్ గా పిలిచేయొచ్చు. ముద్దు పేరుగా పిలుచుకోవచ్చు.

వేణు:

ఈ అందమైన పేరును అందరం మర్చిపోయాం. ఈ జనరేషన్ పిల్లల్లో ఈ పేరున్న వాళ్లు ఉన్నారో లేరో. కృష్ణుని వేణుగానం కన్నా మధురమైనది ఏముంటుంది. దాన్ని సూచించే ఈ పేరు మీకు నచ్చితే అబ్బాయికి పెట్టండి.

మదన్:

ఇది కూడా కృష్ణుడి పేరే. మ అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టాలనుకుంటే ఈ పేరు చూడొచ్చు. దీనర్థం ప్రేమ కురిపించేవాడు, మన్మథుడు అని.

దర్శ్:

అందమైన వాడు. చంద్రుని వంటి రూపం కలవాడు. శ్రీ కృష్ణుడి లాగే అందమైన రూపం కలవాడని అర్థం.

వంశీధర్:

చేతిలో మురలి లేదా వంశిని ధరించిన వాడు. అందుకే వంశీధరుడయ్యాడు. సంగీతం మీద మక్కువ ఉన్నవాళ్లు, కృష్ణభక్తులు మీ అబ్బాయికి ఈ పేరు పెట్టొచ్చు.

మయూర్:

నెమలీకలున్న కిరిటీ ధరించిన వాడు. శ్రీ కృష్ణుడికి మరో పేరు. మ అనే అక్షరంతో కృష్ణుడి అర్థం వచ్చేలా పేరు పెట్టాలనుకుంటే ఈ పేరు చూడండి.

వీటితో పాటే కృష్ణయ్య, కన్నయ్య, కన్హా, కన్న.. లాంటి ముద్దు పేర్లనూ పెట్టుకుని మీ అబ్బాయిని పిలుచుకోవచ్చు.