Beauty Parlour Stroke Syndrome । బ్యూటీ పార్లర్‌లో మసాజ్ చేసుకునేటపుడ్ జాగ్రత్త, స్ట్రోక్ రావచ్చు!
Beauty Parlour Stroke Syndrome: మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్లి షాంపూ, హెడ్ మసాజ్, థాయ్ మసాజ్ లు చేసుకునే వారైతే కాస్త జాగ్రత్త. ఇటీవల బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అని వెలుగులోకి వచ్చింది. అది ఎలా కలుగుతుంది, రాకుండా జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.
బ్యూటీ పార్లర్‌లో హెయిర్ వాష్ లాంటివి చేసుకునే వారు జాగ్రత్త. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ బ్యూటీ పార్లర్‌లో హెయిర్ వాష్ చేస్తున్న సమయంలో స్ట్రోక్‌కు గురైంది. ఉన్నట్లుండి మైకము, వికారం, వాంతులు వంటివి జరగటంతో వెంటనే ఆమె ఆసుపత్రిలో చేరింది. బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే స్ట్రోక్ అంటే ఏమిటి? అందులోనూ ఈ బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది స్ట్రోక్ అంటే గుండెకు సంబంధించిన అంశం అని అనుకుంటారు. కానీ నిజానికి ఇది మెదడుపై ప్రభావం చూపే ఒక ప్రాణాంతకమైన పరిస్థితి. మెదడుకు రక్తం సరఫరా ఆగిపోతే స్ట్రోక్ కలుగుతుది. దీనినే బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. గుండెకు రక్తం సరఫరా ఆగిపోతే దానిని హార్ట్ అటాక్ అంటారు. స్ట్రోక్ సంకేతాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చు, తద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. సాధారణంగా స్ట్రోక్ కలగడానికి ముందు ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఇది స్ట్రోక్‌కు అతిసాధారణమైన సంకేతం. తర్వాత మైకం, వికారం, వాంతులు, గందరగోళం లాంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది స్ట్రోక్.
What is Beauty Parlour Stroke Syndrome - బ్యూటీ పార్లర్ సిండ్రోమ్ స్ట్రోక్ అంటే ఏమిటి?
మరి బ్యూటీ పార్లర్ సిండ్రోమ్ స్ట్రోక్ అంటే ఏమిటి? అంటే.. సాధారణంగా ఎవరైనా పార్లర్‌కు వెళ్లినపుడు షాంపూ చేసుకోవడం, హెడ్ మసాజ్ లాంటివి చేసుకోవడం మామూలే. అయితే సెలూన్‌లో హెడ్ వాష్‌లు రిలాక్స్‌గా ఉన్నా, వాష్‌బేసిన్‌లపై ఉంచడం ద్వారా మెడ హైపర్‌ఎక్స్‌టెన్షన్ చాలా తీవ్రమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ దృగ్విషయాన్ని బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటారు.
మన జుట్టును షాంపూ చేసి, ఎక్కువ కాలం పాటు అదే స్థితిలో తలను ఉంచినప్పుడు మెడ భాగంలో ఒత్తిడి కలుగుతుంది. మెడ వద్ద మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాలుగు రక్త నాళాలు ఉంటాయి. మెడపై పడే ఒత్తిడి కారణంగా మెడ వెనుక భాగంలోని బ్లడ్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, ఫలితంగా స్ట్రోక్ కలుగుతుంది. దీనిని పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అని కూడా అంటారు.
మసాజ్ సమయంలో మెడ కండరాలు కుదింపుకు గురైనపుడు, వెన్నుపూస ధమని విచ్చేదం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విచ్ఛేదం కారణంగా రక్తనాళాలు చిరిగిపోయి, రక్తం కారి అది గడ్డకడుతుంది, ఫలితంగా ఈ గడ్డ కట్టిన రక్తం మెదడుకు వెళ్లి స్ట్రోక్‌కు కారణమవుతుంది.
Beauty Parlour Stroke Syndrome- ఎలా నిరోధించవచ్చు?
సెలూన్‌లో మసాజ్, షాంపూయింగ్, తలకు సంబంధించి మరేదైనా సర్వీస్ తీసుకుంటున్నప్పుడు మెడపై ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి వృద్ధులు, పిల్లల్లు ఉన్నప్పుడు రక్తనాళాలపై ఒత్తిడి తెచ్చే విధంగా శక్తివంతమైన మసాజ్‌లు చేయరాదు. సున్నితమైన మసాజ్‌లను పొందాలి, మెడకండరాలను విరవటం చేసుకోవద్దు.
వినియోగదారులు అంతర్లీన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మసాజ్ చేసుకునే ముందు తమ వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
సంబంధిత కథనం