Beauty Parlor Stroke : బ్యూటీ పార్లర్ స్ట్రోక్​ ప్రమాదం వారికే ఎక్కువట.. ఎలా నివారించాలంటే..-beauty parlor stroke causes and symptoms and treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Beauty Parlor Stroke Causes And Symptoms And Treatment

Beauty Parlor Stroke : బ్యూటీ పార్లర్ స్ట్రోక్​ ప్రమాదం వారికే ఎక్కువట.. ఎలా నివారించాలంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 03, 2022 11:39 AM IST

Beauty Parlor Stroke : ఒత్తిడి అనేది మెడపైనే ఎక్కువ పడుతుంది. సుదీర్ఘకాలం పాటు ఆ స్థానంలోనే ప్రెజర్ ఉంటుంది. మెడ దగ్గరున్న హైపర్-ఎక్స్‌టెన్షన్ పొజిషన్‌ మారడం వల్ల ఎముకలు మరొకదానిపై కొద్దిగా జారవచ్చు. ఫలితంగా వెన్నుపూస ధమని విచ్ఛేదం ఏర్పడుతుంది. ఈ విచ్ఛేదం ఫలితంగా రక్తం గడ్డకట్టడం.. మీ మెదడుకు వెళ్లి స్ట్రోక్‌కు కారణమవుతుంది.

బ్యూటీ పార్లర్ స్ట్రోక్
బ్యూటీ పార్లర్ స్ట్రోక్

Beauty Parlor Stroke : సెలూన్ స్ట్రోక్ లేదా బ్యూటీ పార్లర్ స్ట్రోక్ అనేది మెదడుకు రక్త సరఫరా లేకపోవడం, మెదడులోని భాగాలకు హాని కలిగించే నెక్ మానిప్యులేషన్ లేదా మసాజ్ కారణంగా అకస్మాత్తుగా సంభవించే అరుదైన అంశంగా చెప్తున్నారు నిపుణులు. హెయిర్ కట్‌కు ముందు లేదా సెలూన్‌లో హెయిర్ వాష్ చేసుకోవడం సర్వసాధారణం. ఇది రిలాక్స్ ఇస్తుందని చాలామంది భావిస్తారు. ఇలా అనుకునే హైదరాబాద్‌లోని ఓ యాభై ఏళ్ల మహిళ హెయిర్ సెలూన్​కి వెళ్లింది.

మంచిగా హెయిర్ వాష్ చేయించుకుంటుంది. ఆ సమయంలో ఆమెకు తల తిరగడం, వికారం, వాంతులు రావడంతో అది స్ట్రోక్‌గా నిర్ధారించారు. దీనిపై జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఈ కేసు గురించి ట్వీట్ చేశారు. ఈ అరుదైన పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి అంటున్నారు.

"ఇటీవల బ్యూటీ పార్లర్‌లో షాంపూతో హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు మైకము, వికారం, వాంతులు వంటి లక్షణాలతో ఒక 50 ఏళ్ల మహిళ మా వద్దకు వచ్చింది. మొదట్లో ఆమెను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. వారు ఆమెకు రోగ లక్షణ చికిత్స అందించారు. లక్షణాలు మెరుగుపడలేదు సరికదా మరుసటి రోజు ఆమె నడుస్తున్నప్పుడు కాస్త అసౌకర్యాన్ని ఫీల్ అయ్యింది. అప్పుడు ఆమెకు MRI స్కాన్ చేశారు. మెదడు కుడి వెనుక తక్కువ సెరెబెల్లార్ దగ్గర ఏదో సమస్యను గుర్తించారు. MR యాంజియోగ్రామ్ ఎడమ వెన్నుపూస హైపోప్లాసియాను చూపింది. బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ నిర్ధారణ కుడి PICA చేయగా... హైపర్‌ఎక్స్‌టెన్షన్ సమయంలో వెన్నుపూస ధమని కదిలినట్లు గుర్తించాము. షాంపూతో జుట్టును కడిగే సమయంలో మెడను వాష్-బేసిన్ ఆన్చినప్పుడు ఇది జరిగింది" అని డాక్టర్ కుమార్ వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించారు.

బ్యూటీ పార్లర్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

మెడ మసాజ్, తల, మెడ ప్రాంతంలో అకస్మాత్తుగా చల్లటి నీటిని ఉంచడం వంటివి మన మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే మెడ నాళాల సంకోచాన్ని తీవ్రతరం చేస్తాయి. ఈ కారకాలనే బ్యూటీ పార్లర్ సిండ్రోమ్ అంటారు. సెలూన్ స్ట్రోక్ లేదా బ్యూటీ పార్లర్ స్ట్రోక్ అనేది చాలా అరుదైన విషయం. ఇది మెడ మానిప్యులేషన్ లేదా మసాజ్ వల్ల అకస్మాత్తుగా సంభవించవచ్చు. ఇది మెదడుకు రక్త సరఫరా, మెదడులోని ప్రాంతాలకు నష్టం కలిగించవచ్చు. ఇదే కాకుండా సెలూన్‌లో హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు మెడ అకస్మాత్తుగా వంగడం లేదా హైపర్‌ఎక్స్‌టెన్షన్ కారణంగా స్ట్రోక్‌కు కారణమని భావిస్తారు.

బ్యూటీ పార్లర్ స్ట్రోక్ ప్రమాదం వారికే ఎక్కువ

మధుమేహం, హైపర్‌టెన్షన్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, బ్రెయిన్ స్ట్రోక్ లేదా గుండె జబ్బులు వంటి ముందస్తు వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఈ సంఘటనకు ఎక్కువగా గురవుతారు. అయితే ఇది ఆరోగ్యంగా ఉన్న వారిలో కూడా సంభవిస్తుంది. ప్రత్యేకించి వారు ఊబకాయం లేదా అధిక ధూమపానం చేసేవారు అయితే ఈ ప్రమాదం ఎక్కువే.

బ్యూటీ పార్లర్ స్ట్రోక్‌ను ఎలా నివారించాలి

* సెలూన్‌లో హెడ్ వాష్ లేదా మసాజ్ సమయంలో ఆకస్మిక, అధిక మెడ మానిప్యులేషన్‌ను నివారించండి.

* తల కడుక్కునేటపుడు ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లను మాత్రమే ఉపయోగించాలి.

* ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్