Janhvi kapoor: జాన్వీ కపూర్ వేసుకున్న నగలు ధర ఎన్ని కోట్లో తెలుసా? లుక్ వివరాలివే-know shocking proce of janhvi kapoor golden look jewellery for iifa ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Janhvi Kapoor: జాన్వీ కపూర్ వేసుకున్న నగలు ధర ఎన్ని కోట్లో తెలుసా? లుక్ వివరాలివే

Janhvi kapoor: జాన్వీ కపూర్ వేసుకున్న నగలు ధర ఎన్ని కోట్లో తెలుసా? లుక్ వివరాలివే

Koutik Pranaya Sree HT Telugu
Sep 30, 2024 08:00 AM IST

Janhvi kapoor: గౌరవ్ గుప్తా కస్టమ్ గౌన్ లో ఐఫా అవార్డ్స్ కు హాజరైన జాన్వీ కపూర్ బంగారు దేవకన్యలా కనిపించింది. దానికి జతగా జాన్వీ వేసుకున్న నగల ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. వాటి ధరెంతో చూడండి.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డ్స్ కు హాజరైన పలువురు సెలబ్రిటీల్లో జాన్వీ కపూర్ కూడా ఉన్నారు. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్ కోసం గోల్డెన్ గౌరవ్ గుప్తా గౌన్ ధరించింది ఈ ముద్దుల గుమ్మ. బల్గారీ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ ఆభరణాలను ఎంచుకుంది.

పసిడి హొయలతో జాన్వీ కపూర్:

2024 ఐఫా అవార్డ్స్‌కు సంబంధించిన తన గోల్డెన్ లుక్ ఫోటోలను "గోల్డెన్" అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్‌లో పంచుకున్నారు జాన్వీ. ఈ సందర్భంగా ఆమె ధరించిన కస్టమ్ డ్రెస్‌ను గిల్డెడ్ గాడెస్ గౌన్ అని పిలుస్తారు. జాన్వీ ఫాలోవర్లు కూడా కామెంట్లలో ఆమెను 'దేవత' అని పొగిడేస్తున్నారు. ఈ లుక్ డీకోడ్ చేద్దాం రండి.

జాన్వీ కపూర్ డ్రెస్ వివరాలు:

ఈ గౌన్ స్ట్రాప్‌లెస్ నెక్ లైన్‌తో ఉంది. మెడ, నడుముపై హంస, సర్ప లోహ ఆకారాలు, మెరిసే క్రిస్టల్ అలంకరణలు, ఆమె ఆకారాల్ని మరింత అందంగా కనిపించేలా చేసేలా డ్రెస్ హత్తుకుని ఉంది. దీనికి జతగా రంగురంగుల వజ్రాలతో చేసిన బంగారు చోకర్ నెక్లెస్, రోజ్ గోల్డ్ సర్పెంటి వైపర్ చెవిపోగులు, డైమండ్ రింగ్స్ తో సహా బల్గారికి చెందిన ఆభరణాలతో జాన్వీ మెరిసిపోయింది. జాన్వి అందమైన నగల ధర ఎంత చూడండి.

జాన్వీ కపూర్ నగల ధర ఎంతంటే..

చెవిపోగుల ధర
చెవిపోగుల ధర

ఫుల్ పావే డైమండ్స్‌ ఒదిగిన 18 క్యారట్ రోజ్ గోల్డ్ చెవిపోగుల ధర అక్షరాలా రూ.8,80,000. ఈ ఆభరణాలు బల్గారి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. కాగా, చోకర్ నెక్లెస్ విలువ రూ.8,00,00,000 ఉంటుందని అంచనా.

మేకప్ వివరాలు:

మెరిసే పింక్ ఐ షాడో, వింగ్డ్ ఐలైనర్, మస్కారా రాసిన కనురెప్పలు, గులాబీ రంగు బుగ్గలు, నిగనిగలాడే పింక్ లిప్ షేడ్‌తో గౌరవ్ గుప్తా వస్త్రధారణలో జాన్వీ మెరిసింది. చివరగా, ఆమె తన జుట్టును వదులుగా వదిలేసి, సాఫ్ట్ కర్లింగ్ చేసి మంచి ఫినిషింగ్ ఇచ్చింది.

టాపిక్