Steamed Spinach Rolls: పాలకూర ఆవిరి కుడుములు.. చుక్క నూనె లేని అల్పాహారం..-know how to make steamed spinach rolls for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Steamed Spinach Rolls: పాలకూర ఆవిరి కుడుములు.. చుక్క నూనె లేని అల్పాహారం..

Steamed Spinach Rolls: పాలకూర ఆవిరి కుడుములు.. చుక్క నూనె లేని అల్పాహారం..

Koutik Pranaya Sree HT Telugu
Oct 05, 2023 06:30 AM IST

Steamed Spinach Rolls: చుక్క నూనె లేకుండా పాలకూరతో చేసే స్టీమ్డ్ స్పినాచ్ రోల్స్ తప్పకుండా తినాల్సిందే. వాటిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

పాలకూర ఆవిరి కుడుములు
పాలకూర ఆవిరి కుడుములు (pickpik)

అల్పాహారంలోకి ఆరోగ్యంగా తినాలనుకుంటే ఈ స్టీమ్డ్ స్పినాచ్ రోల్స్ మంచి ఆప్షన్. పక్కాగా చెప్పాలంటే పాలకూర ఆవిరి కుడుములు అనుకోవచ్చు. చుక్క నూనె లేకుండా వీటిని చేసుకోవచ్చు. మీకిష్టమైన కూరగాయలు కింద చెప్పిన వాటితో పాటూ సన్నగా తురిమి ఈ రోల్స్ కోసం వాడుకోవచ్చు. వీటిని మంచి ఫ్లేవర్ ఉన్న షెజ్వాన్, మింట్ లేదా చింతపండు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి.

కావాల్సిన పదార్థాలు:

1 కట్ట పాలకూర

సగం కప్పు క్యారట్ తురుము

పావు కప్పు ఉల్లికాడల తరుగు

1 కప్పు గోధుమపిండి

సగం చెంచా మిరియాల పొడి

సగం చెంచా చిల్లీ ఫ్లేక్స్

తగినంత ఉప్పు

పావు టీస్పూన్ బేకింగ్ సోడా

తయారీ విధానం:

  1. ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టుకోవాలి.
  2. నీళ్లు మరుగుతున్నప్పుడు పాలకూరను ఆకులు, కాడలతో సహా ఆ నీళ్లలో వేసేయాలి.ఒక రెండు నిమిషాలు అలా ఉంచి కాస్త మెత్తబడ్డాక వెంటనే ఆకును చల్లటి నీళ్లలో వేసేయాలి.
  3. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమపిండి, పాలకూర సన్నని తరుగు, ఉల్లికాడలు, క్యారట్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బేకింగ్ సోడా వేసుకుని నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి.
  4. ఇడ్లీలు ఉడికించుకునే పాత్రలో లేదా ఆవిరి మీద వీటిని ఉడికించుకోవాల్సి ఉంటుంది. దాని కోసం కలుపుకున్న పిండిని మీకిష్టమైన ఆకారంలో ఉండలుగా, లేదా వడల్లాగా, కుడుముల్లాగా ఒత్తుకోవాలి.
  5. ఆవిరి మీద పదినిమిషాలు ఉడికించుకుంటే చాలు. పాలకూర స్టీమ్డ్ రోల్స్ సిద్ధం. వీటిని మీకిష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడమే.

Whats_app_banner