Best Apps: పాస్‌వర్డ్ గుర్తుండేలా, కూనిరాగంతో పాటలు గుర్తు పట్టేలా యాప్స్-know best smart phone apps for music passwords and cooking ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Apps: పాస్‌వర్డ్ గుర్తుండేలా, కూనిరాగంతో పాటలు గుర్తు పట్టేలా యాప్స్

Best Apps: పాస్‌వర్డ్ గుర్తుండేలా, కూనిరాగంతో పాటలు గుర్తు పట్టేలా యాప్స్

Koutik Pranaya Sree HT Telugu
Jul 26, 2024 07:14 PM IST

Best Apps: స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం సాధ్యం కాదు. స్మార్ట్ ఫోన్లు ఉంటే రకరకాల యాప్స్ ఉంటాయి. అయితే సంగీతం, పాస్‌వర్డ్స్, కుకింగ్ వంటి వాటిలో ఉపయోగపడే యాప్స్ ఏంటో చూసేయండి.

లైఫ్‌స్టైల్ యాప్స్
లైఫ్‌స్టైల్ యాప్స్

స్మార్ట్ ఫోన్ సాయంతో మిగతా వారికంటే రెండు అడుగులు ముందుండొచ్చు. ఈ స్మార్ట్ యాప్స్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ కోసం బోలెడన్ని పాటలు రావడమే కాకుండా, మీకు కావాల్సిన వంటకం రెసిపీని కూడా పొందవచ్చు. ఊరికే పాస్‌వర్డ్ మర్చిపోతామనే బాధా తగ్గుతుంది. ఒక్కో యాప్ ఒక్కో అవసరం కోసం ఉపయోగపడుతుంది. ఈ యాప్స్ ఫీచర్స్, వాటి పేర్లు వివరంగా తెల్సుకోండి.

పాస్‌వర్డుల కోసం యాప్ (IPASSWORD):

టెక్నాలజీ జోక్యం మన జీవితాల్లో పెరిగిన కొద్దీ వివిధ ఖాతాల పాస్ వర్డ్ లను గుర్తుంచుకునే సమస్య కూడా పెరిగింది. కొన్నిసార్లు నోట్ బుక్ పై, మరికొన్నిసార్లు ఫోన్ నోట్ ప్యాడ్ పై పాస్‌వర్డ్ రాసుకుంటారు. అయితే, ఇది పాస్వర్డ్ భద్రతకు సంబంధించిన సమస్యను తొలగించదు. ఈ యాప్ సాయంతో మీ సమస్య ముగిసిపోతుంది. ఇది పాస్వర్డ్ మేనేజర్ లాంటిది. మీ డిజిటల్ జీవితాన్ని సురక్షితంగా, క్రమబద్ధంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇక్కడ మీరు మీ అన్ని పాస్వర్డ్లను సురక్షితంగా ఉంచుకోవడమే కాకుండా ఆటోఫిల్ పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్లు, ఇతర సున్నితమైన సమాచారాన్ని కూడా నోట్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీ సున్నితమైన సమాచారాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా డిజిటల్ ప్రపంచంలో మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది.

మ్యూజిక్ హాబీ ఉంటే (SHAZAM):

పాటలు అంటే ఇష్టపడే వారి కష్టాలు కూడా విచిత్రంగా ఉంటాయి. నోట్లో ఒక ట్యూన్ తట్టిందీ అంటే రోజంతా అదే పాటను పాడడం మామూలే. ఇష్టమైన ట్యూన్ విన్న తర్వాత మీరు ఆ పాటను గుర్తుపట్టలేకపోతే నిద్ర పట్టదు. అలాంటప్పుడు ఈ యాప్ మీకు ఉపయోగపడుతుంది. ఒక ట్యూన్ ఆధారంగా పాట, ఆర్టిస్ట్, ట్యూన్ గురించి అన్నీ ఈ యాప్ చెబుతుంది. సంగీత ఔత్సాహికులు సంగీత ప్రపంచం నుండి వారు ఇష్టపడే పాటల్ని త్వరగా అన్వేషించడానికి ఈ యాప్ ప్రత్యేకం. ఈ యాప్ మీకు నచ్చిన విధంగా పాటలను సూచించడమే కాకుండా మీకు ఇష్టమైన పాటలను సేవ్ చేసి మీ ప్లే జాబితాను క్రియేట్ చేసుకునే ఆప్షన్ ను కూడా అందిస్తుంది.

శాకాహార వంటల కోసం (HEBBARS KITCHEN):

శాఖాహార వంటకాలు విభిన్నంగా ప్రయత్నించడం మీకిష్టం అయితే ఈ యాప్ మీకే. శాఖాహార వంటకాల సంపద ఉంది ఈ యాప్‌లో. ప్రతి వంటకంలో విస్తృతమైన వంటకాలు మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. ఈ యాప్ లో దేశంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా విదేశీ ఆహారానికి సంబంధించిన శాకాహార వంటకాలు కూడా లభిస్తాయి. మీకు ఏ వంట చేయాలా అనే సందేహం వచ్చినప్పుడల్లా ఈ యాప్ వాడేయండి. ఇక్కడ రెసిపీలు చూసి మీకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసుకోండి.

 

Whats_app_banner