World Password Day: ఇలా చేస్తే.. మీ పాస్ వర్డ్స్ సురక్షితం
World Password Day: పాస్ వర్డ్స్ ఇప్పుడు నిత్య జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. డిజిటల్ లైఫ్ లోకి ఎంటర్ కావడానికి అవసరమైన ‘కీ’ ఇప్పుడు పాస్ వర్డే (password). అందువల్ల మీ డిజిటల్ లైఫ్ లోకి ఎవరూ అడుగుపెట్టకుండా ఉండాలంటే పాస్ వర్డ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి.
World Password Day: పాస్ వర్డ్స్ (passwords) ఇప్పుడు నిత్య జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. డిజిటల్ లైఫ్ లోకి ఎంటర్ కావడానికి అవసరమైన ‘కీ (key)’ ఇప్పుడు పాస్ వర్డే (password). అందువల్ల మీ డిజిటల్ లైఫ్ లోకి ఎవరూ అడుగుపెట్టకుండా ఉండాలంటే పాస్ వర్డ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. మే 4వ తేదీని వరల్డ్ పాస్ వర్డ్ డే (World Password Day) గా పరిగణిస్తారు.
Password protection: అన్నింటికీ పాస్ వర్డ్సే
ఫోన్, ల్యాప్ టాప్, ఈ మెయిల్, ఫేస్ బుక్, వాట్సాప్, ఈ కామర్స్ సైట్స్, ఆన్ లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ యాప్స్.. ఇలా అన్నింటికీ పాస్ వర్డ్ (passwords) రక్షణ తప్పని సరి. ఆయా సైట్స్ లోని మన వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం భద్రంగా ఉండాలంటే మన పాస్ వర్డ్ (passwords) అంత పటిష్టంగా, శత్రు దుర్భేధ్యంగా ఉండాలి. హ్యాకర్లు (hackers), స్కామర్లు (scammers), సైబర్ క్రిమినల్స్ (cyber criminals).. అంచనా వేయలేని, వారు ఓపెన్ చేయలేనంత పటిష్టంగా వాటిని రూపొందించుకోవాలి. లేదంటే, సున్నితమైన, రహస్యమైన వ్యక్తిగత సమాచారం బహిరంగం అవుతుంది. అలాగే, బ్యాంకింగ్ (banking) సైట్స్ వంటివి, పేమెంట్ యాప్స్ వంటివి హ్యాక్ అయితే, ఆర్థికంగా కూడా భారీ నష్టం వాటిల్లుతుంది.
Password protection tips: ఇలా చేస్తే బెటర్..
పాస్ వర్డ్స్ (passwords) ను భద్రంగా ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ కింద పేర్కొన్న అంశాలను ఫాలో కావడం మంచిది.
- పాస్ వర్డ్ (password) సులభంగా, అందరూ గుర్తు పట్టగలిగేలా ఉండకూడదు. చాలా మంది ఉపయోగించే పాటర్న్స్ ను వాడవద్దు.
- పేర్లు, ఇంటిపేర్లు, పుట్టిన తేదీ(birth day)ల వంటివి పాస్ వర్డ్ (passwords) గా వాడకండి. వాటిని ఈజీగా హ్యాక్ చేయవచ్చు.
- పాస్ వర్డ్స్ (passwords) ను ఎంచుకునే సమయంలో కనీసం ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ కేరక్టర్, ఒక నెంబర్ లతో కనీసం 8 అక్షరాలు ఉండాలని సూచిస్తుంటారు. కానీ, 8 కన్నా ఎక్కువ సంఖ్యలో అక్షరాలు ఉండేలా చూసుకోండి. మీ పాస్ వర్డ్ ఎంత సంక్లిష్టంగా ఉంటే, మీ అకౌంట్ అంత భద్రమని గుర్తుంచుకోండి.
- అవకాశం ఉన్న ప్రతీ చోట టూ ఫాక్టర్ ఆథెంటికేషన్ (two-factor authentication) లేదా మల్టీ ఫాక్టర్ ఆథెంటికేషన్ (Multi factor authentication) ను ఎంచుకోండి.
- పాస్ వర్డ్ (password) ఎంత వినూత్నంగా, ఎంత వింతగా ఉంటే అంత సేఫ్.
- సాధారణంగా కంపెనీలు పాస్ వర్డ్ ను తరచూ మార్చమని సూచిస్తుంటాయి. చాలా మంది నిర్లక్ష్యంగా పాత పాస్ వర్డ్స్ నే మార్చి మార్చి వాడుతుంటారు. అది మంచి పద్ధతి కాదు. వాటికే చిన్న చిన్న యూనీక్ చేంజెస్ చేసి పాస్ వర్డ్ గా సెట్ చేసుకోండి.
- కొత్త పాస్ వర్డ్ ను ప్రతీసారి ఎంపిక చేసుకోవడం, దాన్ని గుర్తు పెట్టకోవడం కష్టమైన పనే. కానీ అకౌంట్స్ భద్రత కోసం తప్పదు.
- పాస్ వర్డ్స్ ను, ఓటీపీ (OTP) లను వేరేవారితో పంచుకోవడం మంచిది కాదు. వాటిని ఎవరికీ షేర్ చేయవద్దు.
- పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ పై, పబ్లిక్ వైఫై వాడుతున్న సమయంలో పాస్ వర్డ్స్ ను ఎంటర్ చేయకుండా ఉండడమే మంచిది. ఒకవేళ చేయాల్సి వస్తే, ఆ తరువాత వెంటనే పాస్ వర్డ్స్ ను మార్చుకోవాలి.