Tea in Brass pan: రోజూ టీ పెట్టడానికి ఇత్తడి పాత్ర వాడండి.. పర్ఫెక్ట్ రుచితో పాటూ ఆరోగ్యం కూడా-know benefits of using brass pan for making tea and food ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tea In Brass Pan: రోజూ టీ పెట్టడానికి ఇత్తడి పాత్ర వాడండి.. పర్ఫెక్ట్ రుచితో పాటూ ఆరోగ్యం కూడా

Tea in Brass pan: రోజూ టీ పెట్టడానికి ఇత్తడి పాత్ర వాడండి.. పర్ఫెక్ట్ రుచితో పాటూ ఆరోగ్యం కూడా

Koutik Pranaya Sree HT Telugu
Jul 15, 2024 09:30 AM IST

Tea in Brass pan: ఇత్తడి పాత్రల్లో ఉండే పోషకాలు నేరుగా వండిన ఆహారంతో శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇత్తడి పాత్రల్లో టీ తాగడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఇత్తడి పాత్రలో టీ
ఇత్తడి పాత్రలో టీ

మీరు సరిగ్గా గమనిస్తే పాతకాలం నాటి ఇత్తడి పాత్ర ఏదో ఒకటి మీ ఇంట్లో ఉంటుంది. చిన్నదో పెద్దదో తప్పకుండా కనిపిస్తుంది. ఒక్కసారి ఇంట్లో పెద్ద వాళ్లకి అడిగితే దాన్ని టీ పెట్టడానికి వాడేవాళ్లమని చెబుతారు. ఇప్పుడు అల్యూమినియం గంజులు, స్టీల్ పాత్రలు వాడుతున్నాం కానీ ఇది వరకు టీ అంటే ఇత్తడి పాత్రలోనే పెట్టేవాళ్లు. దాంతో టీ రుచి కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యమూ పెరుగుతుంది. టీ కోసమో కాదూ ఇత్తడి పాత్రను ఎలా వాడితే మరిన్ని ప్రయోజనాలున్నాయో కూడా చూడండి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని లోహాలతో చేసిన పాత్రలలో వండిన ఆహారం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ పాత్రల్లో ఉండే పోషకాలు వండిన ఆహారంతో నేరుగా శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే లోహాల్లో ఇత్తడి ఒకటి. ఇత్తడి పాత్రల్లో టీ తాగడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి ఎలాంటి ఎలంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఇత్తడి పాత్ర వాడకం వల్ల లాభాలు:

రోగ నిరోధక శక్తి:

రాత్రంతా ఈ ఇత్తడి పాత్రలో ఉంచిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీనివల్ల శరీరానికి అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. అదేవిధంగా, ఇత్తడి పాత్రలలో ఆహారాన్ని వండినప్పుడు, ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యం:

ఇత్తడి పాత్రలు పుష్కలంగా మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఆహారంతో కలిసి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ మెలనిన్‌లు సూర్యుడి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాదు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సాయపడతాయి. టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఇత్తడి పాత్రలు వాడటం వల్ల, అలాగే కొన్ని రకాల వంటలకోసం ఈ పాత్రల వాడకం వల్ల మొటిమలు, ముడతలు, మరకలు వంటి చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొంది చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. అందువల్ల, ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన ఇత్తడి పాత్రలు వాడటానికి ప్రయత్నించండి. ట

జీర్ణవ్యవస్థ:

ఇత్తడి పాత్రల్లో చేసిన టీ తాగడం వల్ల, వంటకు ఇత్తడి వాడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఆహారాన్ని బాగా జీర్ణం చేసి మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది:

ఇత్తడి పాత్రలలో వండిన ఆహారం లేదా టీలో జింక్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, ఈ పాత్రలలో తయారు చేసిన ఆహారం కూడా రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది.

ఆహారం రుచి పెరుగుతుంది:

ఇత్తడి పాత్రల్లో ఆహారం లేదా టీ వండేటప్పుడు, ఈ పాత్రల నుండి సహజ నూనెలు విడుదల అవుతుంది. దీనివల్ల ఆహారం సహజంగా రుచికరంగా మారుతుంది. ఈ పాత్రల్లో వండిన ఆహారం రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇత్తడిలో ఉండే పోషకాలన్నీ అందులో ఆహారాన్ని వండేటప్పుడు ఆహారంతో పాటు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

శ్వాసకోశ ఇబ్బందులు:

ఇత్తడి పాత్రలో ఆహారాన్ని వండటం ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇది కఫ, వాత మరియు పిత్త దోషాలను సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది.

సలహా:

ఇత్తడి పాత్రల్లో నిమ్మకాయ, టమటా వంటి ఆమ్ల ఆహారాలను ఎప్పుడూ వండవద్దు. సిట్రస్ మూలకాలు లేదా ఆమ్లాలను కలిగి ఉన్న ఆహారం ఇత్తడి పాత్రలలో వండడం ద్వారా శరీరానికి హాని కలిగిస్తుంది.

ఇత్తడి పాత్రలలో వండిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అయినప్పటికీ, ఈ పాత్రలలో ఆహారాన్ని వండడానికి మరియు తినడానికి ముందు నిపుణుల సలహా తీసుకోండి. తద్వారా మీరు అన్ని రకాల దుష్ప్రభావాలను నివారించవచ్చు.

 

Whats_app_banner