No bra day: బ్రా వేసుకోకపోతే ఏమవుతుంది? పక్కాగా తెలియాల్సిన విషయాలివే-know about no bra day and best health benefits of not wearing bra ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  No Bra Day: బ్రా వేసుకోకపోతే ఏమవుతుంది? పక్కాగా తెలియాల్సిన విషయాలివే

No bra day: బ్రా వేసుకోకపోతే ఏమవుతుంది? పక్కాగా తెలియాల్సిన విషయాలివే

Koutik Pranaya Sree HT Telugu
Oct 13, 2024 10:30 AM IST

No bra day: బ్రా వేసుకోకపోతే వచ్చే లాభాల గురించి తెలియచేయడానికి అక్టోబర్ 13 న నో బ్రా డే జరుపుకుంటారు చాలా చోట్ల. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, స్వీయ పరీక్షల ప్రాధాన్యత గురించి గుర్తుచేసే ఈ రోజు గురించి వివరంగా తెల్సుకుందాం.

నో బ్రా డే
నో బ్రా డే (pexels)

బ్రా వేసుకోకుండా ఇంటి బయట కాలు పెట్టడం దాదాపు ప్రతి అమ్మాయికీ అసాధ్యమే. అలాని బ్రా వేసుకుంటే పూర్తిగా సౌకర్యంగా ఉందని కాదు. బ్రా వేసుకుంటే అసౌకర్యం, కొందరిలో బ్రా వల్ల నడుము నొప్పి, మెడనొప్పి, భుజం నొప్పులు, ప్రతిసారీ దాని గురించి శ్రద్ధ పెట్టాల్సి రావడం.. ఇలా ఎన్నో సమస్యలుంటాయి. అవన్నీ ఉన్నా కూడా ఎబ్బెట్టుగా కనిపించొద్దనే కారణంతో బ్రా వేసుకోవడం తప్పనిసరి అయిపోయింది.

అక్టోబర్ 13 న నో బ్రా డే ప్రపంచంలో చాలా చోట్ల జరుపుకుంటున్నారు. ఈ ఒక్క రోజు బ్రా లేకుండా ఉండి దాంట్లో ఉండే సౌకర్యాన్ని అనుభూతి చెందమని ఈ రోజు గుర్తు చేస్తుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, దాన్ని గుర్తించడానికి నిరంతరం చేయించుకోవాల్సిన స్క్రీనింగ్స్ గురించి, స్వీయ పరీక్షల గురించి ఈ రోజు గుర్తు చేస్తుంది. అసలు బ్రా వేసుకోకపోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెల్సుకుందాం.

బ్రా వేసుకోకపోతే?

చనుమొనలు:

బిగుతుగా ఉన్న బ్రాలు, ప్యాడెడ్ బ్రాలు, లేస్ డిజైన్లు ఉన్న బ్రాలు వేసుకున్నప్పుడు చనుమొనలు ఎక్కువ రాపిడికి గురవుతాయి. చనుమొనల మీద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాపిడి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా తయారవుతుంది. దాంతో దురద మొదలవుతుంది. కనీసం రోజులో కాసేపైనా బ్రా లేకుండా ఉండటం వల్ల ఈ సమస్య కాస్త తగ్గొచ్చు.

రక్త సరఫరా:

రక్త సరఫరాను బ్రాలు ప్రభావితం చేస్తాయి. బిగుతుగా ఉండే బ్రా రొమ్ముల కింది భాగంలో రక్త సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. దాంతో క్రమంగా చాతీలో నొప్పి రావడం మొదలవుతుంది. కాబట్టి బ్రా లేకుండా ఉండటం వల్ల రక్త సరఫరా సజావుగా ఉంటుంది.

నిద్ర:

నిద్ర పోయే ముందు బ్రా తీసేసి పడుకుంటే ఎన్నో లాభాలుంటాయి. చాలా మందికి బ్రా హుక్ తీసేస్తే కానీ నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఆ అలవాటు నిజంగా మంచిదే. జర్నల్ ఆఫ్ క్రోనో బయాలజీ ఇంటర్నేషనల్ ప్రకారం బిగుతుగా ఉండే బ్రాలు, ప్యాంటీలు వేసుకోవడం వల్ల నిద్ర మీద ప్రభావం ఉంటుందని తేలింది. అలాగే నిద్ర పోయినప్పుడు బ్రా బ్యాండ్ పైదాకా వచ్చేసి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది.

ఇన్ఫెక్షన్లు:

బ్రా వేసుకుంటే గాలి సరిగ్గా ఆడక చాతీ భాగంలో చెమట విపరీతంగా వస్తుంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో, తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో ఈ సమస్య ఎక్కువ. చెమట ఎక్కువగా వస్తే అది తేమగా మారి దురదకు, ర్యాషెస్ కు కారణం అవుతుంది. చెమట పట్టిన బ్రా అలాగే ఎక్కువసేపు ఉంచుకుంటే ఫంగస్ వృద్ది చెంది ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.

రొమ్ము క్యాన్సర్

బ్రా వేసుకోకపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా దగ్గుతుందనేది నిపుణుల మాట. ముఖ్యంగా అండర్ వైరింగ్ ఉన్న బిగుతు బ్రాలు రొమ్ము కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. చాతీ మద్దతు కోసం అండర్ వైరింగ్ ఉన్న బ్రాలు ఎక్కువసేపు వేసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. వీటివల్ల రొమ్ముల్లో నొప్పి, దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు.

రొమ్ముల్లో గడ్డలు

బ్రా వేసుకోవడం ఒక్కటే రొమ్ముల్లో గడ్డలు లేదా నీరు నిండడానికి కారణం కాకపోవచ్చు. కానీ బిగుతు బ్రాలు గంటల తరబడి వేసుకుంటే క్రమంగా ఈ సమస్యకు దారితీయొచ్చు. బ్రా వేసుకోకపోతే ఈ సమస్యా తగ్గించుకున్నట్లే.

Whats_app_banner