Isha Ambani about IVF: తల్లి కాలేమని బాధ పడే వాళ్లకి.. ఇషా అంబానీ చెప్పిన మాటలు స్ఫూర్తినిస్తాయి..-know about how isha ambani gave birth to twins through ivf ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Isha Ambani About Ivf: తల్లి కాలేమని బాధ పడే వాళ్లకి.. ఇషా అంబానీ చెప్పిన మాటలు స్ఫూర్తినిస్తాయి..

Isha Ambani about IVF: తల్లి కాలేమని బాధ పడే వాళ్లకి.. ఇషా అంబానీ చెప్పిన మాటలు స్ఫూర్తినిస్తాయి..

Koutik Pranaya Sree HT Telugu
Jun 28, 2024 05:00 PM IST

Isha Ambani about IVF: కవల పిల్లలకు ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చానని ఇషా అంబానీ అన్నారు. దాని గురించి పూర్తి వివరాలు తెల్సుకోండి.

ఇషా అంబానీ
ఇషా అంబానీ (Instagram/@anaitashroffadajania)

ఇషా అంబానీ కవల పిల్లలకు ఐవీఎఫ్ ( IVF- in vitro fertilization) పద్దతి ద్వారా జన్మనిచ్చినట్లు వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఐవీఎఫ్ పద్ధతి చాలా కష్టంగా అనిపించిందని, తను చాలా అలిసిపోయానని చెప్పుకొచ్చింది. 32 సంవత్సరాల ఇషా ఐవీఎఫ్ విధానం మీదున్న అనేక అపనమ్మకాల్ని తొలగించడమే లక్ష్యంగా, తన మాతృత్వ ప్రయాణం గురించి బయటకు చెప్పారు.

తన తల్లి నీతా అంబానీ మాదిరిగానే ఇషా కూడా ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. ఐవీఎఫ్ సాయంతో గర్భం దాల్చడం గురించి నీతా అంబానీ గతంలో మాట్లాడుతూ, తాను ఎప్పటికీ తల్లి కాలేనని వైద్యులు చెప్పడంతో తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. "నాకు 23 ఏళ్ల వయసులో నేను ఎప్పటికీ గర్భం దాల్చలేనని వైద్యులు చెప్పారు. నేను విలవిల్లాడిపోయాను. అయితే, నాకు అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ఒకరైన డాక్టర్ ఫిరూజా పారిఖ్ సహాయంతో, నేను నా కవలలను జన్మనివ్వగలిగాను" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

కష్టమైన విధానం:

తన తల్లి లాగే, ఇషా అంబానీ కూడా ఈ విషయం గురించి మాట్లాడటానికి మొహమాటపడలేదు. “నా కవలలు ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చారని నేను చాలా తొందరగా చెబుతున్నాను, అయితేనే ఈ విధానాన్ని చాలా సాధారణంగా చూడగలం కదా?” అని ఇషా వోగ్ తో అన్నారు.

ఐవీఎఫ్ చాలా కష్టమైన ప్రక్రియ. ఎవ్వరూ కూడా వాళ్లు ఒంటరి అని గానీ, ఈ విషయం గురించి మాట్లాడటానికి గానీ మొహమాట పడకూడదు. ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు శారీరకంగా చాలా అలసట ఉంటుందని ఇషా అన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ. 2018 డిసెంబర్లో ఆనంద్ పిరమాల్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట 2022 నవంబర్ 19న తమ కవలలకు జన్మనిచ్చింది. వీరికి ఆదియా శక్తి, కృష్ణ అని నామకరణం చేశారు.

టెక్నాలజీని వాడుకుంటే తప్పేంటి?

నేటి ప్రపంచంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే పిల్లల్ని కనడానికి దాన్ని ఎందుకు ఉపయోగించకూడదని ప్రశ్నించారు. ఇది మీరు ఆనందించే విషయం కానీ, దాచాల్సిన విషయం కాదు. మీ అనుభవాన్ని పంచుకోడానికి మీకు మద్దతుగా నిలిచే వాళ్లు, మీలాంటి అమ్మాయిలే ఎవరైనా ఉంటే మీకు చాలా సాంత్వనగా అనిపిస్తుంది. లేదంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అన్నారామె..

అమ్మాయిలతో స్నేహం:

అమ్మాయిల స్నేహం గురించి మాట్లాడుతూ.. ఇషా అంబానీ, శ్లోకా మెహతా అంబానీతో తనకున్న సన్నిహిత సంబంధం గురించి కూడా మాట్లాడారు.ఇషా, ఆకాష్, శ్లోక ఒకే పాఠశాలలో చదువుకున్నారు. 'నా సోదరుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్ శ్లోకా కావడం నా అదృష్టం' అని ఆమె వోగ్ ఇండియాతో అన్నారు. "మేము పెద్దయ్యాక శ్లోక నాకు సోదరిలా మారింది. ఇప్పుడు కూడా మేము లండన్ లో ఒకే ఇంట్లో ఉంటామని చెప్పింది. ఆకాష్, ఆనంద్ ఇద్దరూ ముంబైలో ఉన్నారని, పిల్లలతో కలిసి ఇక్కడే ఉన్నామని, తాము నిజంగానే పెళ్లి చేసుకున్నామని జోక్ చేస్తూ ఉంటామని సరదాగా చెప్పింది.

 

 

Whats_app_banner