Mukesh Ambani love story : ‘రోడ్డు మధ్యలో నీతాకు ప్రపోజ్ చేశా’- ముకేశ్ అంబానీ!
Mukesh Ambani Nita Ambani love story : ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నప్పుడు నీతా అంబానీకి తాను ఎలా ప్రపోజ్ చేశానో ముఖేష్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Mukesh Ambani Nita Ambani : ముకేశ్ అంబానీ- నీతా అంబానీలు మేడ్ ఫర్ ఈచ్ అధర్లా ఉంటారు! ముకేశ్‌కు నీతా అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉంటారు. రిలయన్స్‌కి చెందిన చాలా విషయాలను ఆమె దగ్గరుండి చూసుకుంటారు. మరి.. నీతా అంబానీకి ముకేశ్ అంబానీ ఎలా ప్రపోజ్ చేశారో మీకు తెలుసా?
'రోడ్డు మధ్యలో ప్రపోజ్ చేశా..'
గతంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ముకేశ్ అంబానీ దంపతులు. నీతా అంబానీకి ప్రొపోజ్ చేసిన రోజును ఆయన గుర్తు చేసుకున్నారు. రోడ్డు మధ్యలో, భారీ ట్రాఫిక్ జామ్‌లో నీతాకు ప్రపోజ్ చేసినట్టు చెప్పారు.
"నిజంగా నేను చూసిన మొదటి అమ్మాయి.. నీతా. ఆమె నా జీవిత భాగస్వామి అని నేను నిర్ణయించుకున్నాను. ఒకసారి మేము పెద్దార్ రోడ్డులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. సడెన్‌గా, 'నీతా, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే సమాధానం చెప్పు. యెస్ ఆఆ? నో ఆఆ?" అని అడినట్టు.. ముకేశ్ అంబానీ చెప్పారు.
అప్పుడు నీతా అంబానీ.. “డ్రైవ్ చెయ్యి. వెనకాల హార్న్ కొడుతున్నారు,” అని అన్నారట. 'యెస్? ఆర్ నో? సమాధానం చెబితేనే.. కారు కదులుతుంది," అని ముకేశ్ అన్నారు.
నీతా అంబానీని ముకేశ్ అంబానీ.. మూడుసార్లు అడగాల్సి వచ్చింది. ఆ తర్వాతే, ఆమె ఒప్పుకున్నారు.
Mukesh Ambani Nita Ambani love story : అయితే.. ‘నేను నీ ప్రపోజల్‌ని తిరస్కరించి ఉంటే? ఏం చేసేవాడివి? అక్కడే వదిలేసే వాడివా?’ అని ముకేశ్ అంబానీని అడిగారు నీతా. “లేదు. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయేవాడిని. మనం స్నేహితులుగా ఉండేవాళ్లం,” అని బదులిచ్చారు ముకేశ్ అంబానీ.
ముకేశ్ అంబానీని వివాహం చేసుకున్న ఏడాదిలోనే సన్ ఫ్లవర్ నర్సరీలో టీచింగ్ ప్రారంభించానని నీతా అంబానీ ఆ చాట్‌లో వెల్లడించారు. ఆ సమయంలో ప్రజలు తనను చూసి నవ్వేవారని, కానీ అది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నీతా అంబానీ చెప్పుకొచ్చారు.